హైద్రాబాద్ లో తిరిగే వాటర్ టాంకర్ల యాజామాన్యాలకి విజ్ఞప్తి..
మీమానాన మీరు, టాంక్ మొత్తం ఫుల్లుగా నీటి తో నింపేసి రోడ్లమీదకి తీసుకొచ్చేస్తే సరిపోతుందా..ఆ టాంకర్ల పైనుండే పెద్ద పెద్ద హోల్స్ అవీ.. మ్యాన్ హోల్స్ లా ఉంటాయి..వాటికి మూతలు పెట్టరా..
చాలావరకు మూతలు లేకుండా ఉన్నవే తిరుగుతున్నాయి సిటీలో..
నీటి మీద,ఆ నీటిని తీసుకెళ్ళే వెహికిల్ మీద ఉండే శ్రద్ధ పైనుండాల్సిన మూత మీద కూడా పెట్టండి..
డ్రైవర్స్ happy గా నడిపేస్తున్నారు కానీ..కొద్దిగా ఎత్తు పల్లాలు వచ్చేసరికి..అమాంతంగా నీళ్ళువచ్చి టాంకర్ వెనకాల ఉండే వెహికిల్స్ మీద,అవి నడిపే మనుషులమీద పడిపోతున్నాయి..కార్లు,ఆటోలు..అయితే ఫరవాలేదు..మిగిలిన వాటిమీద వెళ్ళేవాళ్ళకి చాలా ఇబ్బంది..పైగా నీరు కూడా చాలా వేస్ట్ అవుతోంది.
................................
(ఇవాళ నేనో ఫంక్షన్ కి వెళ్ళానన్నమాట..గంటసేపు రడీ అయ్యి..మరీ.తీరా మా మేనల్లుడు వాళ్ల ఇంటిదగ్గరనుండి ఫంక్షన్ జరిగే చోటకి బండిమీద తీసుకెళ్తుంటే మాముందర టేంకర్ మాకు చేసిన సన్మానమే ఈ పోస్ట్..వెనకాలే ఎందుకూ కొద్దిగా దూరంగా ఉండచ్చుగా అనకండి.టేంకర్ కి పైన మూతలేదని మేం తడిసిపోయేదాకా తెలీలేదు)
Translate
15, మే 2015, శుక్రవారం
7, మే 2015, గురువారం
ఏ కోపమైనా ఆర్టీసీ మీదే
ఆర్టీసీ బస్ మొత్తం నిండిపోయాకా టికెట్స్ ఇవ్వడం కష్టమయ్యి..ఓపక్కకి ఆపి
టికెట్స్ తీసేలోపల..ఆ పదినిమిషాల్లో లక్షల టర్నోవర్ ఉన్న బిజినెస్
ఆగిపోయిందని ఫీలయిపోతాం..వ్యవస్థ మీద కోపం వచ్చి బందులు చేస్తూ ముందరగా
నష్టం చేసేది..ఈ ఆర్టీసీ బస్సులకే..
మంచి టైం చూసి వీళ్ళు సమ్మె మొదలెట్టారంటున్నవాళ్లకి ఒకమాట...వాళ్ళేం శుభకార్యాలు చెయ్యట్లేదు ముహూర్తం చూసుకుని మొదలుపెట్టడానికి..ఒకవేళ వాళ్ళు అడిగేది తప్పే అయితే ప్రభుత్వం సగం ఇవ్వడానికి ఎందుకు ఒప్పుకుంది..వాళ్ళు 43% అడిగితే..27% ఇస్తానంటోంది).
ఇవాళేదో మొట్టమొదటిసారిగా బస్సులు చాలా రష్ గా ఉన్నాయనడానికి..గత 20 సంవత్సరాలనుండి..ప్రత్యేకరోజుల్లో బస్సులు ఎప్పుడూ ఇలాగే ఉంటున్నాయి..
కాకపోతే ఇంకొంచెం ఎక్కువ రష్ గా ఉంటున్నాయంతే..
ప్రభుత్వం ఎస్మా ప్రయోగిస్తానంటే ఆశ్చర్యం గా ఉంది..ఒకప్పుడు సకలజనుల సమ్మె అనగానే ఈ ఆర్టీసీ కూడా సహకరించిందనే విషయం నాకు గుర్తుంది..మరి మీకు
ఆర్టీసీకి ఒకటే విజ్ఞప్తి..మీరుకూడా ఇంక ఎక్కువ expect చెయ్యకుండా..ఇచ్చినదానితో తృప్తి పడండి..మీకు,ప్రజలకి కూడా మంచిది
ఇక ప్రైవేట్ వాహనాల గురించి ..వీళ్ళకి వచ్చేనష్టం ఏమీలేదు.వీళ్ళ బిజినెస్ ఎప్పుడూ ఫర్వాలేదు..ఇప్పుడేదో సిటీలోకి కూడా వస్తున్నారుకానీ..లేకపోతే వాళ్ళకి మామూలుగా ఉండే పాసెంజర్స్ ఎప్పుడూ ఉంటారు..

అయ్యో సల్మాన్
అయ్యో సల్మాన్ ఖాన్..నువ్వు జైల్ కెళ్తే ఎన్ని సినిమాలు,ఎంత
టర్నోవర్..కోట్ల లో బిజినెస్..ఇదంతా లాస్ కదా..ఇదే మా తెలుగు మీడియాకి
తెలిసిన బాధలు..నువ్వు కష్టపడి ఎలాగూ బెయిల్ తెచ్చుకుంటావ్..నీ పనులన్నీ
పూర్తి చేసుకుంటావు..ఇది తెలిసినా చెప్పదు మా మీడియా..అంతేకాదు అసలు ప్రాణం
పోయినవాడి పేరు కూడా గుర్తులేదు మా మీడియాకి...
ఇందుకు కాదు నేపాల్ పొండిరాబాబూ బాబూ భరించలేకపోతున్నాం మిమ్మల్ని అన్నది.
వాడెవడో దిక్కుమాలిన వెధవ..అభిజిత్ అని హిందీ సినిమాల్లో పాటలు పాడతాడు..పడుకోవడానికి ముంబై ఫుట్పాతే దొరికిందా మీకు ఇళ్ళులేవా అంటున్నాడు.
ఒరే ఏబ్రాసి వెధవా,,..నువ్వు ఒక్కరోజు నీ ఇంట్లో కాస్త ప్లేస్ ఇస్తావా ?,లేకపోతే నువ్వెళ్ళి ఒక్కరోజు అలాంటివాళ్ళ ఇంట్లో ఉంటావా..తింగరెధవ..

బుల్లెట్లకు బదులుండదు
మావోయిస్ట్స్ చాలా స్పీడ్ గా నిర్ణయాలు తీసుకుంటారు..ఎందుకంటే వాళ్ళు
పేల్చే బులెట్ కి సమాధానం తిరిగి వాళ్ళ ప్రాణాలే అని వాళ్ళకీ
తెలుసు...వాళ్ళ హిట్ లిస్ట్ లో ఉన్నవాళ్లని టార్గెట్ చెయ్యకుండా వదలరు..
తూర్పుగోదావరి జిల్లాకి చెందిన ఇద్దరిని (వీళ్ళిద్దరూ పోలీస్ informers..
అనే అనుమానం ఉంది మావోయిస్ట్స్ కి)..చత్తీస్ ఘడ్ కి మాట్లాడే పనుందని
పిలిచి చంపేసారు..పైగా ఈ కారణం తోనే చంపేసామని ప్రకటించారు.
నిజమే..చంపెయ్యాలి ఎందుకంటే మీకు కోపం పాలకుల మీద,పోలీసులమీద ఉందికాబట్టి information ఇచ్చే ప్రతివాళ్ళని చంపెయ్యాలి.. అప్పుడే ప్రజల్లో భయం మొదలవుతుంది. .కానీ మీలోనే, మీ విధానాలని వ్యతిరేకించేవాళ్ళుంటారు.. వాళ్లు చెప్పేది వినండి వాళ్లని మాత్రం, వాళ్ళు కూడా పోలీస్ ఇంఫార్మర్సేమో అనే అనుమానం తో చంపకండి.....ఎందుకంటే మీరు కూడా చాలావరకూ ఎక్కడో ఉంటూ ఉంటారు, మీ ఇంఫార్మర్స్ ప్రజల్లో ఉంటారు..అంటే మీకు కూడా ఇంఫర్మేషన్ ఇచ్చేవాళ్ళుంటారు..ఎవరికి వారు స్వయంగా నిజాలు తెలుసుకునే అవకాశం చాలా తక్కువ ఉంటుందికాబట్టి..ఈ ఇంఫార్మర్స్ మీద ఆధారపడటం తప్పనిసరి..
................
ఒక licensed ... గన్ లోంచి వచ్చే బులెట్ కి ప్రజలకి సమాధానం చెప్పాల్సిన భాద్యత ఉంటుంది..మీ గన్ లోంచి వచ్చే బులెట్ కి సమాధానం మీరే...

బీ పాజిటివ్
ఈటీవీ
వాళ్లు మైండ్ లో బ్లైండ్ గా ఫిక్స్ అయినట్టున్నారు...అయితే స్వరాభిషేకం
లేకపోతే స్వర సంగమం..రెండింటిలోనూ ఒకే ఒక తేడా ఉంది..స్వరాభిషేకం లో
ఆడియన్స్ ఎక్కువగా పార్టిసిపేట్ చేసేవారు కాదు..ఇక్కడ పాడేవాళ్ళు ,వెళ్లి
ఆడియన్స్ కూడా పార్టిసిపేట్ చేసేలా పాడేస్తున్నారు....అందుకే అభిషేకంతీసేసి
సంగమం అని పెట్టుంటారు...
ఇదీ ఒకందుకు మంచిదే లేకపోతే మంచి prime time లో వేసిన సినిమానే వేసి వాయించడం లేదు కాబట్టి..
ఏదయినా పాజిటివ్ గా ఆలోచించేస్తే భలే సౌకర్యంగా ఉంటుంది...
—
feeling silly.

పెళ్లి కావాలా, ఇంకో దేశం పొండి బాబూ
4.12 కోట్లమంది వధువులు కావలెను,అబ్బాయిలు ఉన్నారు కానీ,అమ్మాయిల కొరత ఎక్కువగా ఉంది....సాక్షి.
ఆల్రెడీ పెళ్ళయిన మగవారి పట్ల నా కామెడీ ఫీలింగ్స్.
..................
1.ఇప్పటికే పెళ్ళైయినవాళ్ళు అదృష్టవంతులు.
2.ఒకవేళ భార్య చేసేపనులేవన్నా నచ్చకపోయినా ఏం మాట్లాడలేరు..ఎందుకంటే అసలే పెద్దగా ఆప్షన్స్ కనపడటం లేదుకాబట్టి
3.ఇక బయట కనపడే అమ్మాయిలను పెద్దగా చూడరు..ఏదో ..తోటి పెళ్ళవని మగవాళ్లకి అవకాశం ఇచ్చినట్టవుతుంది కదా అని.
4.మరీ భార్యని నెత్తిమీద పెట్టుకోలేరు కానీ(అంటే బాగా బరువుగా ఉంటుందేమోనని..కికికి)..ఆల్మోస్ట్ దేవతలాగా పూజించేస్తారు.
5.భార్య అడిగినదల్లా కొనలేకపోతున్నామని విపరీతంగా మదనపడిపోయి బెంగపెట్టుకుని బక్కచిక్కిపోయినా ఆశ్చర్యపడక్కరలెద్దు
.....................
ఇక పెళ్ళికానీ మగవాళ్ళ పట్ల నా కామెడీ సానుభూతి
......................................
మీరేం బాధపడకండి..ఎక్కడో అక్కడ ,ఏదో ఒకదేశం లో మీకోసం ఒకమ్మాయి పుట్టే ఉంటుంది...మీరే వెతుక్కోవాలి కాంపిటీషన్ అలాఉంది మరి.
బాగా కష్టపడి చదివేసి తొందరగా లైఫ్ లో సెటిల్ అయి అంతే తొందరగా పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టెయ్యండి.
అధైర్యపడకుండా ఆంజనేయుడికి ఒక నమస్తే చెప్పేసి ప్రయత్నించండి...తప్పనిసరిగా మీకు పెళ్ళి అయ్యే అవకాశాలు 80% కనిపిస్తున్నాయి..
....................
all the best
(నన్ను వాయించేసేవాళ్లు ఇవా ళ నవ్వులరోజనే విషయం గుర్తుచేసుకోవాలని శాస్త్రం చెప్తోంది)

ఇది తెలంగాణ బాబూ
చంద్రబాబు ఇంటి చుట్టూ తిరగకండి..ఇక్కడ నడుస్తున్నది తెలంగాణా
ప్రభుత్వం..కేసీఆర్ అన్ని విధాలా సహాయసహకారాలందిస్తారు ,కేసీ ఆర్ కి
సహకరించండి..-----తలసాని శ్రీనివాసయాదవ్
కరెక్టే..కానీ తలసానిగారూ మీరు తెలుసుకున్నంత తొందరగా వాళ్ళు తెలుసుకోవాలంటే కష్టం..కొంచెం టైం పడుతుంది కానీ వాళ్ళూ దార్లోకొచ్చేస్తారు లెండి.మీరు టెన్షన్ పడకండి..
ఇక సహకారం..కేసీఆర్ ఏం చెయ్యాలనుకుంటే అదే చేస్తారుకాబట్టి..ఇక సహకరించడం అనే మాట పెద్దగా ఉపయోగం లేనిది..

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)