వంట వచ్చిన కొంతమంది మగవారితో ఇబ్బందులు...
ఏదో టైం బాలేక
నలభీములిద్దరూ వంట చెయ్యడం మొదలుపెట్టారుగానీ ఏనాడైనా ఎవరి వంట కైనా..అదే
ముఖ్యంగా ఆడవాళ్ళ వంటకు పేరు పెట్టినట్టు ఎక్కడైనా చదివామా లేదు కదా..మరి
వీళ్ళేంటండీ మరీ వంకలు పెడతారు..ఇప్పుడూ వీళ్ళేదో అవసరమయ్యో,ఇష్టం
పెంచుకునో నేర్చుకున్నారు బానేఉంది..
ఇంట్లో ఆడాళ్లు చేసేవాటికి
పేర్లెందుకు పెట్టడం.ఇంట్లోవాళ్ళని వంట మొదలయినప్పటినుండి..తిని
చేతులుకడుక్కునేదాకా కడుగుతూనేఉంటారు ..ఇదే నేనయితే అదరగొట్టేసేవాడ్ని
అంటారు..మరిచెయ్యచ్చుకదా...కారం ఎక్కువయ్యిందీ,ఉప్పు తగ్గించుండాల్సింది..వంట మీద శ్రద్ధపెట్టు...
శ్రద్ధపెట్టకుండా అసలు వంట ఎలా చేస్తారని వీళ్ళ ఉద్దేశం...వంటచేసేదేవన్నా అసెంబ్లీ స్పీకరా
కాదు కదా అన్నిటినీ మేనేజ్ చెయ్యడానికి..లేదా తెలుగు సినిమా హీరో నా
ఓపక్కన విలన్స్ ని కొట్టేస్తూ మధ్యలో తింగరిబుచ్చిలా వచ్చే హీరోయిన్ ని
భుజం మీదేసుకుని ఫైటింగ్ చేస్తూ అందర్నీ,అన్నిటినీ కవర్ చెయ్యడానికి..
ఇవాళా రేపు నూటికి డెబ్భై మంది టీవీ చూస్తూ తింటున్నారు..ఇలా వాళ్ళు రెండుపనులు చేస్తున్నారు కదా అని అందరూ అలాగే ఉంటారా..కాదు కదా.
అంచేత ఇందుమూలంగా నేను చెప్పేదేంటంటే ఈ వంటవచ్చిన మగవాళ్ళు..అందరూ కాదు
కొంతమంది మాత్రమే అదీ పేరు పెట్టేవాళ్లు..మొదట నెమ్మదిగా
చెప్పండి..నెమ్మదిగా నేర్చుకుంటారు..ఒకవేళ మీరు చెప్పినా బాగాచెయ్యకపోతే
మీకు నేర్పడం సరిగా రాదన్నమాట..
అప్పుడేం చెయ్యాలో నేను చెప్పక్కరలేదుగా...అదే అదే మీకు నేర్పడం చేతకాని కారణంగా మీరే వండుకుంటూ జీవనం సాగించండి
(ఈ post మా పక్కింటివారికి అంకితం చేస్తున్నా)
చివర్లో పక్కింటోళ్ళకు అంకితమెందుకు సేసారో తెలియక తలనోప్పోస్తోంది .విసదపరచగలరు
రిప్లయితొలగించండి