Translate

15, ఏప్రిల్ 2015, బుధవారం

ఎందుకు స్వామీ..కోరి కష్టాలని తెచ్చుకుంటున్నారని, అడిగిన భార్య 'మండోదరి' మాట, పక్కనపెట్టి మరీ ముందుకెళ్ళిన 'రావణుడు'..అతిపరాక్రమవంతుడయైన కొడుకు' ఇంద్రజిత్'చావుని సైతం చూశాకా పోయాడు...
అయినా రావణుడు మంచివాడే ఎందుకంటే..'సీత' ఇష్టంలేకుండా ఆమె వేలు కూడా తాకలేదు కాబట్టి, అనివాదించేవాళ్ళని చూశాను..అంతేకానీ అసలు వేరొకరి భార్య మీద చెడు ఆలోచన రావడమే పెద్ద తప్పయినప్పుడు..తప్పులో మళ్ళీ 'తప్పుడు నీతులు' వెతకటం ఎంతవరకూ కరెక్టో నాకు తెలీదు
వాదించే తెలివిని,వితండవాదాన్నీ సొంతం చేసుకుని రామాయణాన్ని,రాముడి ని విమర్శించేవాళ్ళు...అసలు రామాయణాన్ని ..'బాల కాండ' నుండి ఆఖరి 'ఉత్తరకాండ' వరకూ ఓపికగా అర్ధం చేసుకుని చదివితే..మనకొచ్చే అనుమానాలకి ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది అనే నమ్మకం ఉంది నాకు.
కేవలం విమర్శించడం వల్ల మనకి తృప్తిగా ఉంటుంది అనుకునేవాళ్ళు, ఎవరైయితే ఉంటారో వాళ్ళు ఎంతవరకు ప్రతీ విమర్శని సద్విమర్శగా తీసుకుని ముందుకెళ్తారో వాళ్ళ మనస్సాక్షికే వదిలేస్తున్నా.
రావణుడి భార్య మండోదరి కే తప్పనిపించింది మనకి ఒప్పెలా అవుతుంది..రాముడి భార్య సీతకే ఒప్పనిపించింది మనకి తప్పెలా అవుతుంది..
మనుషుల్లో మనిషిలా కష్టాలు అనుభవించినవాడు ..ధర్మానికి కట్టుబడినవాడు నా దృష్టిలో దేవుడే..
అందుకే త్యాగరాజంతటివాడు 'సీతమ్మ' మా అమ్మ,'శ్రీరాముడు' మాకు తండ్రి అయినా సరే... బంటురీతి కొలువియ్యవయ్య రామా అని ప్రాధేయపడి మరీ కోరుకున్నాడు.
నిత్యం రామనామం మాత్రమే పలికే రామదాసు..రాముడి పలుకే బంగారమాయెనా కాస్త మము బ్రోవమనీ చెప్పవే సీతమ్మ తల్లీ.. అని వాళ్ళ మీద తనకున్న నమ్మకాన్ని చూపించాడు
నాకు రామాయణం,రాముడు,సీత...వాళ్ళ బలగం అంటే చాలా ఇష్టం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి