Translate

15, ఏప్రిల్ 2015, బుధవారం

చాలామంది వాస్తు నమ్మకాల్ని,దేవుళ్ళని,ఆచారాలని,సాంప్రదాయాల్ని...ఆఖరికి గ్రహణాన్ని కూడా అన్నిటితోపాటూ నమ్మరు..అది వాళ్ళిష్టం అనుకోండి..
కానీ అలా చెయ్యడం ఆధునికత అంటే మాత్రం నేనొప్పుకోను ఎందుకంటే అదివాళ్ళ పర్సనల్ ఫీలింగ్ అంతే...ఆ ఫీలింగ్ తో ఇతరులకు ఇబ్బందిలేనప్పుడు నమ్మేవాళ్ళు.. నమ్మనివాళ్ళని తప్పు పట్టకూడదు..
నేను వాస్తుతో సంబంధంలేకుండా ఒక ఇల్లు కట్టాననుకోండి..ఖర్మకాలి నా టైం బాగాలేక అది అమ్మాల్సి వస్తే ..కొనేవాళ్ళు వాస్తు చూసుకునేవాళ్ళయితే...అప్పుడు నా పరిస్థితేంటీ..అందరూ నాలాగే ఆలోచించి కొనెయ్యరుకదా...
ఏదయినా అంతే..మనకి నచ్చకపోతే నమ్మద్దు....కానీ నమ్మేవాళ్ళని విమర్శించకూడదు..
నమ్మకపోవడానికి మనకి 100 కారణాలుంటే ...నమ్మేవాళ్ళు 101 ఆనవాళ్ళు చూపించచ్చు..
మనం సైన్స్ తో వివరంగా చెప్తే ...వాళ్ళు వివరించేవాటిలో సైన్స్ కూడా కనపడచ్చు...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి