ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత జగన్ కి ...
అసెంబ్లీ టైం ని వేస్ట్
చేస్తూ..గొడవలు పడుతూ వ్యక్తిగత విమర్శలకే స్థానం ఇస్తున్న్నప్పుడు..ఒకసారి
మీ ఆలోచన మార్చుకోవాలని మీకనిపించడం లేదా...
మీరు మాట్లాడుతున్న ప్రతిసారీ, కేసులు,జైల్ జీవితం గుర్తుకు రావడాన్ని ఎవరూ తప్పు
పట్టలేరు..ఎందుకంటే చరిత్ర ని ఎవరూ మార్చలేరు...
అందుకే, నిజంగా పార్టీ మనుగడ మీద దృష్టి పెట్టాలనుకున్నా,బలమైన ప్రతిపక్షం
అని నిరూపించుకోవాలన్నా..నిజంగా సమస్యలపై పోరాడాలనుకున్నా ముందర పార్టీ
అధ్యక్ష పదవి నుండి తప్పుకుని..ఎవరైనా
ప్రజల్లో మంచిపేరున్న మీ వ్యక్తి కి అప్పచెప్పి..మీమీదున్న అన్ని కేసులకు
సంబంధించి మీరే ముందరికి వెళ్ళి...పరిష్కార మార్గం వెతుక్కోండి..
ఎందుకంటే మీకు కూడా ఓట్లేసి నెగ్గించిన ప్రజలకు సమాధానం చెప్పాల్సిన భాద్యత మీకుంది కాబట్టి.
తెలంగాణా లో పార్టీ వ్యవహారాలను షర్మిళకు అప్పజెప్పి,Sakshi పేపర్ ని
భారతి కి అప్పజెప్పిన మీకు, ఏ జ్యోతుల నెహ్రూలాంటి వ్యక్తికో మీ
వ్యవహారాలు,మీ పదవి అప్పజెప్పడం వల్ల జరిగే నష్టం ఏమీ ఉండదు...
ఎందుకంటే ఏ రాజకీయపార్టీకీ అసమర్ధత అడ్డుగా ఉండకూడదు..ప్రజారాజ్యం పరిస్థితి చూసారు కదా..
కొత్తగా ఏర్పడిన ఒక రాష్ట్రం ఇలా వెనక్కీ,ముందుకూ వెళ్తూ ఉండకూడదు, పైగా ప్రజలు అయోమయానికి గురి కాకూడదు...
కుదరదూ.. నా ఎం ఎల్ ఎ లున్నారూ,నావాళ్ళున్నారు అనుకుంటే రాజకీయాల్లో
ఎంతమంది స్థిరంగా ఒకపార్టీనే నమ్ముకుని ఉన్నారు అనేది నేను చెప్పక్కరకేదు..
ఒక్కసారి అసంతృప్తి మొదలయితే...ఏంజరుగుతుందో నాకంటే మీకే బాగా తెలుసు
.............................................................
నేను పైన రాసిన post లో "తుమ్మల కిరణ్ "రాసిన ఒక్ కామెంట్ లోని మాటల్ని ఉపయోగించాను..
Thanks to Kiran Tummala
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి