Translate

15, ఏప్రిల్ 2015, బుధవారం

ఇవాళ కేజ్రీవాల్ ఏం చేసినా తప్పే..ఎందుకంటే..67 సీట్లు గెలుచుకుని ముఖ్యమంత్రి అయినవాడు, వెంటనే అతనిచ్చిన హామీలన్నీ నేరవేర్చలేదు కాబట్టి....అతను నడిస్తే తప్పు,మాట్లాడితే తప్పు,దగ్గితే తప్పు. జ్వరం వస్తే తప్పు,జలుబు చేస్తే తప్పు..ఇవన్నీ రాకూడదు ..
అయినా ఇంతవరకూ ఢిల్లీ కి ముఖ్యమంత్రి గా చేసినవాళ్ళెవరైనా ఈ బాధల బారీన పడ్డారా లేదే..
అంతర్గతంగా ప్రతీ పార్టీలోనూ గొడవలుంటాయి..కానీ కేజ్రీవాల్ ది మాత్రం చారిత్రాత్మక తప్పిదం కిందా కనపడుతుంది...
ఢిల్లీలో ఉండే ప్రజలు ఏం ఆలోచిస్తున్నారో ఇక్కడివాళ్ళు చెప్పేస్తారు..అవునుమరి ఇక్కడివాళ్ళని అడిగే ఢిల్లిలో వాళ్ళు ఓటేసారు కదా.
ఇంకెక్కడయినా అయితే రాత్రికిరాత్రి పదవిలోంచి తీసేస్తే తప్పే కాదు..అదే కేజ్రీవాల్ చేస్తే మహాతప్పు...ఎందుకంటే సామాన్యుడు కదా....
డియర్ కేజ్రీ...నువ్వు వీలయినంత త్వరగా స్టింగ్ ఆపరేషన్స్ చెయ్యడం నేర్చుకో...తేడా అనిపించినవాళ్ళ ని తీసిపడెయ్యి..నువ్వు నమ్మిన సిద్ధాంతాలని హాయిగా పాటించు...నీకు నచ్చినట్టు,వచ్చినట్టు నిర్ణయాలు తీసుకో...
అన్నింటికంటే ఒకటి చాలా Important ఏంటంటే ...రాజకీయం నేర్చుకో ...అస్సలు తప్పులేదు ఎందుకంటే..
రాముడు కూడా చెట్టుచాటునుండే "వాలి" ని చంపాడు....
నీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు.......
వైదేహి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి