ఉదయం 5 గంటలు దాటింది..ఇంతకుముందు అలారం కొట్టినా లేచేవాడ్నికాదు..అటూ ఇటూ
చేసి 5: 45 దాకా నిద్రపోయి ..అమ్మో ఆరవుతోంది అని అప్పుడు వాకింగ్ కి
వెళ్లేవాడ్ని...కానీ ఇవాళ అలాకాదు. ఎందుకంటే నిన్ననే వాకింగ్ కి వెళ్తూ ఒక
అమ్మాయిని చూశా..ఆ విశేషాలు మీకు వాకింగ్ చేస్తూ చెప్తాను...
ఇదివరకు
రోజులయితే ,తెల్లవారుఝామున లేచి గుమ్మంలో ముగ్గులు
పెట్టుకునేవారు...రాజమండ్రి లోనూ అంతే.కానీ రోజులు మారాకా అన్నిచోట్లలాగే
ఇక్కడ కూడా మార్పులు వచ్చేసాయి..
అందుకే ఉదయం బయట మార్కెట్ కి వెళ్ళేవాళ్ళు,పనులకి వెళ్ళేవాళ్ళు,వాకింగ్ చేసేవాళ్ళు ఇలా కొంతమంది కనిపిస్తారు..
అలాంటిది నిన్ననే నా కళ్ళకి ఒక వెలుగు..నాకాళ్ళకి ఓదారి కనిపించాయి..
మా ఇల్లుదాటాకా,మూడోవీధి జానకమ్మగారింటిదగ్గర ఒక అమ్మాయి.. అదీ ముగ్గు
వేస్తూ...ఎంతబావుందంటే...కళ్ళకి కాటుక పెట్టుకున్నట్టుంది..కొద్దిగా
చెంపలమీద అంటింది,చిన్నబొట్టు,పెద్ద జడ.
ఆ జడకాస్తా ఆ అమ్మాయి
నడుఒంపులో ఇరుక్కుందనుకోండీ అయినా బావుంది..మరి నాచూపుకూడా అక్కడే
ఇరుక్కుపోయిందికదా.పరికిణీ ఓణీ వేసుకుంది...అదింకా బావుంది....
ఏదోపాట
పాడుతోంది దగ్గరగా వెళ్ళాకా వినిపించింది..."తొలిజన్మలనోముకీ
దొరనవ్వులసామికీ...." ఏ సినిమా అనుకుంటుంటే గుర్తొచ్చింది ..ఆ...
ముద్దమందారం సినిమాలోది 'అలివేణీ ఆణిముత్యమా ' అనేపాట...
నన్ను చూసి
కొద్దిగా వాల్యూం తగ్గించింది...ఈలోపల వాళ్ళింట్లోనుండి పెద్ద వాల్యూం తో
మనోజ్ఞా ఇంకా ఎంతసేపు, పెట్టిన ముగ్గు చాలు, కాఫీ తాగుదుగానీ రా లోపలకి
అంటూ...ఆ అమ్మాయి నన్నొకసారి చూసింది నాకయితే నవ్విందనిపించింది..లోపలకి
వెళ్ళిపోయింది..నా మనసుకూడా ఆ అమ్మాయితో వెళిపోయింది...
............................................................
అమ్మో మూడోవీధి దగ్గరకొచ్చేసాను..ఇవాళ కనపడుతుందోలేదో...కనపడాలని నాతోపాటు మీరు కూడా కోరుకోండి
ఇంతకూ నాపేరు చెప్పలేదు కదూ..నాపేరు "నవీన్"
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి