ప్రజాప్రతినిధుల జీతాలు భారీగా పెంపు,జెడ్పీ చైర్ పర్సన్ కు నెలకు 7,500 నుంచి లక్షరూపాయలకు పెంపు-సాక్షి
స్థానిక ప్రజాప్రతినిధుల వేతనం పెంపు జెడ్పీ చైర్ పర్సన్ కి 7,500 నుండి 1,00,1000.మేయర్ కి 50,000--ఈనాడు.
నేను, ముందర ఈవార్తలు చూడగానే 7,500 కాదేమో 75,000 అయ్యుంటుంది..ఓ సున్నా పడలేదేమో అనుకున్నా..
రెండు వాచీలు ఒకే టైం చూపించవు అంటారు కాబట్టి,
రెండుపేపర్లు ఒకే తప్పు చెయ్యవని బలం గా నమ్ముతున్నాను.
ఇంతవరకూ ఏ ప్రభుత్వం కూడా ఇంతలా జీతాలు పెంచలేదు అనేది వాస్తవం.. సర్పంచ్
లకీ పెంచారు కానీ మామూలుగానే పెంచారు...ఏదయినా KCR నిర్ణయం ఊహించనిది..
ఈ విధంగా ముందుకుపోవాలని డిసైడ్ చేసారన్నమాట.
బహుశా KCR ఈవిషయం లో సాఫ్ట్ వేర్ కంపెనీ లని ఆదర్శం గా తీసుకున్నట్టున్నారు.
ఏంటో తెలంగాణా లో మేయరో,జెడ్పీ చేర్మనో అయినా బావుండేదని నాతో సహా ఎంతమంది అనుకుంటున్నారో పాపం..
వస్తూనే పేకాట క్లబ్బులొద్దన్నారు .ఉద్యోగులకి ఫిట్మెంట్ ఇచ్చారు.ఇప్పుడిలా ..
ఏదేమయినా మీ స్టయిలే వేరు మాష్టారూ..
Good Morning to KCR
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి