ఎందుకని క్రికెట్, వేలంటయిన్స్ డే,ఫాదర్స్ డే,మదర్స్ డే... ఇలాంటివన్నీ విదేశీ సంస్కృతి మనకు వద్దూ అని విమర్శిస్తున్నారు...
మనకి, మన పక్కిల్లు ఎలాగో ..మన దేశానికి పక్క దేశం అలాగా.. అంతే
కదా...terms బావుంటే అన్నీ బావుంటాయి, లేకపోతే స్నేహం కంటిన్యూ అవదు..
ఏదేశ ఆర్ధిక పరిస్థితి,జనాభా ని బట్టీ ఆదేశం ఉంటుంది.
ఏదో ...ఇతరదేశాల ప్రభావం వల్ల మనలో మార్పు వచ్చింది అనేది కరెక్ట్
కాదు...తెల్లారిలేచి ఓ నాలుగు ఇంగ్లీష్ words మాట్లాడందే రోజు
గడవదు,బ్రాండెడ్ వస్తువుల్ని వాడకుండా నిద్రపోం ...అలాంటప్పుడు ...చిన్నవాటిని మాత్రం భూతద్దం లో వెతకడం ఎందుకు.
మనవాళ్ళు వెళ్ళి విదేశాల్లో కూడా వాళ్ళ ప్రతిభ చూపించి ఆ దేశ, ఎకానమీ
పెంచుతుంటే మనవాడే కదా, అని గర్వపడితే సంతోషం... ఇక్కడే ఆ పని చెయ్యచ్చుకదా
అనుకుంటూ కూర్చుంటే....ఇలాంటి వాదనలవల్ల ఉపయోగం ఉండదు..
ఇతరదేశాలేమీ మనల్ని ,మీరు మమ్మల్ని ఫాలో అవ్వాల్సిందే అని బలవంతపెట్టట్లేదు కదా..మనకీ నచ్చిందీ ఇష్టపడుతున్నాం...
మాకు నచ్చలేదు అనుకునేవాళ్ళు దూరం గా ఉండటమే...అంతేగానీ ఒకవేలు వాళ్ళకి చూపిస్తే మనవేపు నాలుగు వేళ్ళు చూపించరా...
మంచి చెప్పడం మంచిదే..కానీ నేను చెప్పేదే మంచీ... మిగిలినదంతా చెడు ...అంటే...
ఏదో ఒకవిషయం మనకి నచ్చలేదని..అన్నిటినీ విమర్శించడం కంటే..గౌరవించేవాటిని గౌరవించడం...నచ్చనివాటికి దూరగా ఉండడం కరెక్ట్
తప్పు,ఒప్పు అనే బటన్స్ ఉండే రిమోట్ మనం...మనం డిసైడ్ చేసుకోవాలి ఏది ప్రెస్ చెయ్యాలి అనేది..అవతలవాళ్లని తప్పు పట్టేముందు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి