Translate

15, ఏప్రిల్ 2015, బుధవారం

అరవింద్ కేజ్రీవాల్...కాస్త నామాట విను బాబూ...అసలే మనకి ఆరోగ్యం బావుండదు..అలా సమోసాలు..అవీ ఇవీ తినకు..రాష్ట్రపతిగారు సరదాగా తినమన్నారని తినేస్తే మళ్ళీ ఆరోగ్యంలో తేడా వస్తే కష్టం ...అసలే నీ ఎజండా మన జెండా అంత నీట్ గా ఉంది..
నువ్వుఅది కాస్తా మర్చిపోయీ ఇలా చిరుతిళ్ళకు కక్కుర్తి పడితే..నేను పొట్టలోకి వెళ్లే వాటిగురించే అంటున్నా...అపార్ధం చేసుకోకు...
నీమీద విపరీతమయిన హోప్స్ పెట్టుకున్న నేను...హర్ట్ అవుతా..
రాష్ట్రపతిగారు తినమన్నారని తినేసి...అతనెవరో కార్ ఇచ్చాడని తీసేసుకుని...వాళ్ళేవరో బాగా డబ్బులు డొనేట్ చేసారని ఆనందపడిపోతే... .రేపొద్దున్న కుర్చీ దిగి వెళ్ళమంటే వెళ్ళాల్సొచ్చేది నువ్వక్కడివేకాదు...అర్ధమయ్యిందా....తరవాత... కక్కలేక మిగలేక ఏడవాలి మనం..
అసలే ఢిల్లీ ప్రజల్లో 99% శాతం మీకు అనుకూలంగా వోట్లేసారు...ఇక్కడ..ఏ సంబంధం లేకపోయినా సపోర్ట్ చేసాను నేను..మా నమ్మకాన్ని నిలబెట్టు ...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి