ఇవాళ సాక్షి ఎడిటోరియల్ పేజ్ లో సీనియర్ జర్నలిస్ట్,కాంగ్రెస్ పార్టీ తఫున
1989-91 వరకు లోక్ సభ సభ్యుడిగా చేసి,ఇప్పుడు National spokesperson గా
బీజేపీ పార్టీ చేత నియమించబడిన శ్రీ ఎం. జె అక్బర్ గారు ఇలా రాసారు.
"కేజ్రీవాల్ తన అధికార బుట్టలోంచి ప్రతీ ఎం ఎల్ ఏ కి ఓ రొట్టెముక్కనో లేదా ఓ
చేపనొ వేసారు,వారంతా మంత్రులో,కార్యదర్శులో అయ్యారు..ఇక వాళ్ళు
చేసేదేంటి...ఎవరికి తెలుసు...తలా ఒక కారు,ఒక కార్యాలయం,సొంత డబ్బా
కొట్టుకునే హక్కూ లభించాయి.
అరవింద్ ..ఎలెక్షన్స్ టైం లో మందు పంచారు..రెండుకోట్ల రూపాయల చెక్కులూ తీసుకున్నారు విరాళం కిందా"
............................
ఒకపెద్దస్థాయిలో ఉన్నమీరు ఇంత చిన్నవిషయాలు రాసారేంటి సర్..మీ స్థాయికి
తగ్గ మాటలు రాయండి..రెండు పెద్ద పార్టీలతో పనిచేసిన అనుభవం
మీదగ్గరుందికదా...
ఢిల్లీలోని 99% ప్రజలు ఇచ్చిన తీర్పు కేవలం 'మందు
'మీద ఆధారపడిందా...కారు,కార్యాలయం కోసం,పదవికోసం అయితే కాంగ్రెస్ తో
జతకట్టి ముఖ్యమంత్రి అయినవాడు..ఆ పదవిలోనే ఏడవచ్చుగా బయటికొచ్చిమరీ పోటి
చెయ్యాల్సిన అవసరంలేదే....
పోనీ మీరన్నట్టు మందు పంచినా,డబ్బు పంచినా
ఇంకేవన్నా చేసినా కూడా రెండు కోట్లు ఏమూలకి సర్...ఓ వంద కోట్లయితే ఏదో
జాగ్రత్తగా సర్దుకోచ్చు...అంచేత ఈసారి రాసేటప్పుడు ఎక్కువ మొత్తం రాయండి...
అరవింద్ కి తెలీదండీ ప్రశాంత్ భూషణ్ తండ్రి "శాంతి భూషణ్ "ఎలక్షన్స్ ముందు
బయటికెళ్ళి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడే ఇతనిమీద కన్ను
వెయ్యాలని...ఇప్పుడు తెలుసుకున్నాడు..అందుకే తప్పు చేసానని చెప్పాడుగా..ఇంక
మీరు కొత్తగా చెప్పేదేంటండీ బాబూ..పాత సీసాలో కొత్త సారా పొయ్యడం తప్ప.
ఇకనుండి చాలా పకడ్బందీగా అరవింద్ ని ఎలా బుక్ చెయ్యాలా అని ఆలోచించి
వీలయినంత తొందరగా అతన్ని దింపేసే ఏర్పాట్లలో ఉండండి..మీకసలే ఫోర్త్ ఎస్టేట్
లో అదేనండీ జర్నలిజం లో సుధీర్ఘ అనుభవం ఉందికూడాను.
All the Best
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి