ఉదయం 8:45 గంటలవుతోంది..almost ఎంప్లాయిస్ అందరూ ఆఫీస్ కి చేరుకున్నారు.
సరిగ్గా నేను నేనూ లోపలకి అడుగుపెట్టి lift దగ్గరకు
వెళ్ళబోతుంటే..అప్పటిదాకా అక్కడే పేపర్ చదువుకుంటున్న మా కంపెనీ ఎం డి
కాస్తా మెట్ల దగ్గరకి వెళ్ళి మెట్లెక్కి నాలుగో ఫ్లోర్ లో ఉన్నా ఆయన కేబిన్
కి వెళ్తుంటే ..మొదట ఆశ్చర్యం గా అనిపించింది..
తర్వాత బహుశా ఇలాంటి
మనస్థత్వం వల్లే ఆయన ఈస్థాయికి వచ్చారనిపించింది..అందుకే ఈ రోజుకి ఇది
జరిగి 15 యేళ్ల యినా నేను మర్చిపోలేకపోయాను..అప్పట్లో సత్యం కంప్యూటర్స్
మొదటి స్థానం లో ఉంటే..ఈయన కంపెనీ రెండో
స్థానం లో ఉండేది..అలాంటి కంపెనీలో పనిచేసే అవకాశాన్ని సద్వినియోగం
చేసుకోలేకపోయానని బాధపడని రోజూ లేదు..ప్రతీ ఎంప్లాయ్ తో ఆప్యాయం గా
మాట్లాడే వ్యక్తి మా ఎం డి..ఆయనతొ ఆసోసియేట్ అయి పనిచేసే అవకాశాన్ని మిస్
చేసుకున్నానని తలుచుకోని రోజూ లేదు...
ఇప్పటికీ ఎక్కడేనా కలిసినా నన్ను వెంటనే గుర్తుపట్టి పలకరించే మనిషి...
ఆ కంపెనీ పేరు అప్పట్లో ..Visual soft Technologies.ఆయన పేరు D.V.S Raju
నేను పనిచేసింది కొద్దికాలమే..అయినా ఒక మంచిపేరున్న కంపెనీలో వర్క్ చేసాననే తృప్తి మిగిలిపోయింది...
ఇప్పుడు D.V.S Raju గారు గంగవరం పోర్ట్.. ఎం.డి.Best Business Leader అవార్డ్ గెలుచుకున్న DVS Raju గారికి నా ప్రతేక శుభాకాంక్షలు.
సర్.. నేను మీ అభిమానిని
Translate
27, ఏప్రిల్ 2015, సోమవారం
26, ఏప్రిల్ 2015, ఆదివారం
ఇలా చేయొచ్చుగా
నాకో చిన్న సందేహం...
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే పంచవర్షప్రణాళికల స్థానం లో వార్షిక ప్రణాళికలుంటే,అన్ని విధాలా బావుంటుందని..అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులని పిలిచి ప్రకటించారు..దీనికి అందరూ కూడా ఒప్పుకున్నారు..కాంగ్రెస్ తప్ప
అంటే కొన్ని నిర్ణయాలకి అందరి ఆమోదం అవసరం అనేది స్పష్టమయ్యింది..అయితే కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోకపోవడానికి కారణం ఏంటంటే ..పంచవర్షప్రణాళికలు కాంగ్రెస్ చేతిలో రూపుదిద్దుకున్నాయి 60 యేళ్ళ క్రితం..ఇప్పటివరకూ కంటిన్యూ అవుతూ వచ్చినప్పుడు ఇప్పుడెందుకు మార్చడం అని కావచ్చు.
కానీ పంచవర్ష ప్రణాళికలో స్థానం లో వార్షికప్రణాళికలు మాత్రమే ఉండాలి అనే నిర్ణయానికి అందరి అమోదం పొందడం లో బీజేపీ ప్రభుత్వం సక్సెస్ అయ్యింది.
మరీ ఇదే రీతిలో కొత్తగా ఏర్పడ్డ ఒక రాష్ట్రానికి కూడా కొన్ని ప్రత్యేక నిధులు,అనుమతులు,రాయతీలు ఇవ్వడానికి కూడా బీజేపీ ప్రభుత్వం ప్రయత్నించచ్చుగా...
ఎలాగూ రెండు రాష్ట్రాలుగా విడదీసిన కాంగ్రెస్ కూడా ప్రత్యేక రాష్ట్రం గా ప్రకటించాలని కూడా అడుగుతోంది కాబట్టి..ఈ ప్రపోజల్స్ కి అడ్డురాదు కదా...ఎందుకంటే ఒకవేళ అడ్డొస్తే ఏం జరుగుతుందో కాంగ్రెస్ కు తెలుసు..
కొన్నిటికి రూల్స్ ఒప్పుకోవు అని చెప్పి రూల్స్ మార్చేకంటే కొత్త రూల్ ఒకటి తయారుచేసి ఆ రూల్స్ కి కలిపేస్తే సరి..మంచి జరుగుతుంది అన్నప్పుడు ఇలా చెయ్యడం తప్పుకాదని నా ఉద్దేశం...

నేనే రైటూ
ఆమధ్యన ఢిల్లీలో ఎలెక్షన్స్ కు ,ముందరే అరవింద్ ఖచ్చితంగా నెగ్గుతాడు అంటే నాకు బుర్రలేదని తిట్టిపోసారు...
మొన్న టాక్స్ విషయంలో తెలంగాణా చేసింది కరెక్ట్, ఏ రాష్ట్రమయినా వచ్చే అదాయాన్ని పోగొట్టుకుంటుందా అంటే అప్పుడూ నన్ను తిట్టేసారు..
నేనో బస్ కొని, ఏపీ కి,తెలంగాణా కి మధ్యలో సర్వీస్ స్టార్ట్ చేస్తే ..
ఏ పీ నాకు టాక్స్ విధిస్తే తప్పకుండా కడతాను అంటే మళ్ళీsame cards names Different టైప్ లో వాయించేసారు...
ఇప్పుడు ఏ పీ, లో తెలంగాణా నుండి ఏ పీ, కి వెళ్ళే వాహనాల మీద టాక్స్ వసూలు చెయ్యడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధం అయ్యింది...
ఇది చాలా మంచి ఆలోచన..నా దృష్టిలో...అయినా మనం మిగిలిన రాష్టాలకి కట్టడం లేదా..ఇదీ అంతే..
....................................................
హమ్మయ్యా ఇంక నేను బస్ కొనడం మిగిలింది
.........................................
(ఊరికే నన్ను వాయించేసేబదులు కాస్త ఆలోచించండి యా)

నరసింహే
జెమినీ టీవీలో ఇప్పుడు నరశిం హ సినిమ వస్తోంది..నేను విపరీతంగా అభిమానించే రజనీకాంత్ సినిమా
అందరికీ ఈ డైలాగ్ గుర్తొస్తాందా
"అతిగా ఆశ పడే మగవాడు..అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు"
భలే సినిమా.. పని మానేసి చూసేస్తున్నా
రజనీకాంత్ కి సూట్ అయ్యే పాట..
జీవితమంటే పోరాటం, పోరాటం లో ఉంది జయం
ఎక్కు తొలిమెట్టు కొండని కొట్టు ఢీ కొట్టు
గట్టిగ పట్టెయ్ నువు పట్టు గమ్యం చేరేట్టు
......
అరుణాచలం వెళ్ళినవాళ్ళకి ,గిరి ప్రదక్షిణం చేసినవాళ్లకి చాలా చోట్ల రజనీకాంత్ కనపడతాడు,వినపడతాడు
That is one and only Real Hero only Rajanikanth

మొండి చెయ్యి
ఇవాళ ఓపక్కన తెలంగాణా టీ ఆర్ ఎస్ ప్లీనరీ..మరో పక్క ఏ పీ కి స్పెషల్ స్టేటస్ లేదని ప్రకటన...
పోనీలెండి ఇవ్వకపోతే ఇవ్వకపోయారు..మీకు ఓటేసి మిమ్మల్ని గెలిపించాం కాబట్టి.. కొన్ని రాయితీలు,నిధులు ఇవ్వండి చాలు..కాస్త వెనకాల ఉండి నడిపించండి..
కొత్తగా ఏర్పడ్డ ఒకరాష్ట్రం వీలయినంత బాగుపడాలంటే ఏం చెయ్యాలో మీరే నిర్ణయం తీసుకుని అమలు చెయండి...ఏదో ఆంద్రప్రదేశ్ విడిపోయింది కాంగ్రెస్ చేతిలోకానీ, మీరేం రాష్ట్రాలు విడిపోవటానికి వ్యతిరేకం కాదు..
మీరూ 15 యేళ్ళ క్రితమే కాకినాడలో ఒక వోటు రెండు రాష్ట్రాలని బీజేపీ ప్లీనరిలో చెప్పారు...మాకూ గుర్తుంది...మీరు బీజేపీని బలోపేతం చేసే ఆలోచనలో ఉన్నారు అలాగే రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టిపెట్టండి చాలు..ఏలినవారు ఏం చెప్పినా చెయ్యాల్సిన ప్రజలు మేము..

అన్నదాత దుస్థితి
ఆత్మహత్యని రాజకీయం చేసే పెద్దలు..రాజస్థాన్ రైతు ఆత్మహత్య ని ఇలా చెప్పుకొచ్చారు..అతను ఢిల్లీలో అందరూ చూస్తుండగా చేసుకున్నాడు..ఇది ఎంత ఘోరం..
...అంటే ఎవరికీ చెప్పకుండా ఆత్మహత్య చేసుకుంటే, ఇప్పటివరకూ గాల్లో కలిసిపోయిన చాలామంది రైతుల ప్రాణాలతోపాటే ఇతని ప్ర్రాణం ఉండేది..ఈ పార్టీలు యుద్ధప్రాతిపదికన అతని కుటుంబానికి లక్షలు ప్రకటించేవారూ కాదు..
అంచేత ఒక రకంగా అతని కుటుంబానికి చచ్చాకా ఆధారం అయ్యాడతను..ఈ పార్టీలన్నిటికి అతను చనిపోయాడు అనే బాధకంటే ఢిల్లీ లో చనిపోవడమే ఎక్కువ బాధగా ఉన్నట్టుంది.
కానీ ఒక్క విషయం..
ఒక రాజస్థాన్ కి చెందిన వ్యక్తి,అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన వాడు..(ఇక్కడ అతనొక్కడేకాదు)..తనలాంటి బాధితులతోకలిసి వసుంధరా రాజే మీద వత్తిడి అయినా తీసుకురావల్సింది, ఎందుకంటే ఊహించని కష్టం వచ్చినప్పుడు ప్రభుత్వాన్ని కాక ఇంకెవర్ని సాయం అడుగుతారు ప్రజలు. ఒకవేళ వాళ్ళు సాయం పొందలేకపోతే వేరే ఏదయినా బ్రతుకుదెరువు అయినా చూసుకోవాల్సింది..ఆ బాధ అనుభవించినవాళ్ళకి తెలుస్తుందనేవాళ్లకు నేనేం చెప్పలేను...

చావడానికి ఉన్న ఒక్కమార్గం కంటే...చాలా ఎక్కువ మార్గాలు బ్రతకడానికి ఉన్నాయి అనేది అతను కొద్దిగా ఆలోచించి ఉంటే ..today అతని కుటుంబం అతన్ని మిస్ చేసుకుని ఉండేది కాదు..ఇవాళ డబ్బు ఎంత ఉన్నా మనిషి దూరమయ్యాడు..అతని చావే తిండి పెడుతోంది అనే వాస్తవాన్ని ప్రతీక్షణం గుర్తుంచుకోవల్సిన పరిస్థితి ఆ కుటుంబానికి వచ్చేదికాదు..
19, ఏప్రిల్ 2015, ఆదివారం
నాడి తెలిసిన నాయకుడే
28 యేళ్ళకే మంత్రి, IT Indian of the Millennium..అనే గౌరవం పొందిన
వ్యక్తి..1995 నుండి 2004 వరకు అప్పటింకా విడిపోని ఆంధ్రప్రదేశ్ కి
దీర్ఘకాలం ముఖ్యమంత్రి..
ఏప్రిల్ 20,1950 లో పుట్టీ ఎకనమిక్స్ లో MA చేసిన నార చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు...మంచి అడ్మినిస్ట్రేటర్ అనేపేరు ఈయన సొంతం...
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా..ఆంధ్రప్రదేశ్ గా విడిపోయాకా ఆంధ్రప్రదేశ్ కి మొట్టమొదటి ముఖ్యమంత్రి...ఎన్నో సవాళ్ళు ఇతని గుమ్మంలో నిల్చున్నాయనే వాస్తవాన్ని అంగీకరించే నాయకుడు .
బాబుగార్ని నమ్ముకున్న వాళ్ళ, నమ్మకాన్ని నిలబెట్టాలని ఆశ పడుతున్నాను..
నేను 20 యేళ్ళు ఆంధ్రా లో ఉండే ఇక్కడికొచ్చాను...
"తెలంగాణా లో ఉండే సెటిలర్ ని నేను"..
అయినా తెలంగాణా బావుండాలనే కోరుకుంటాను..అక్కడ పెరిగితే..ఇక్కడ బ్రతుకుతున్నాను కాబట్టి
విమర్శించేవాళ్లకి నేనేమీ చెప్పలేను కానీ బాబు మీద కోపం తో హెరిటేజ్ పాలు వాడని వాళ్ళు..ఎప్పుడో ఏన్ టీ ఆర్ స్థాపించారు కాబట్టి ఇప్పటికీ ప్రతీ విషయం లోనూ ఆయన పేరు బయటికి తెచ్చేవాళ్ళు వాస్తవం కూడా గమనించాలి..
ఎన్ టీ ఆర్ మీద ఉండే గౌరవం ఎలాగు ఎక్కడికీ పోదు..కానీ జరిగే ప్రతీపనికి కూడా ఆయనకి లింక్ పెట్టడం తగదు...
విమర్శలు,తప్పొప్పులు,ఎత్తుపల్లాలు ప్రతివారికి వారి స్థాయిని బట్టి ఉంటాయి..అదే జీవితం అంటే..
నేను ప్రతిపక్షం లో ఉన్న జగన్ కి,మొన్న కేసీఆర్ కి ఇవాళ బాబు కి కూడా ఒకలాగే శుభాకాంక్షలు చెప్పాను..ఎందుకంటే రాష్ట్రాల భవిష్యత్ కి వీళ్ళ నిర్ణయాలు చాలా అవసరం అని నమ్ముతున్నాను...

రాసుకో సాంబా రాసుకో...
మోడీ
కి వీరాభిమానులు,బాబుకి భక్తులు,కేసీఆర్ కి అభిమానులు ,జగన్ కి
ఫేన్స్..ఇలా..పొలిటీషియన్స్ కి,ఏక్టర్స్ కి,సెలెబ్రిటీస్ కి,లెజెండ్స్ కి
జైకొట్టే జనం ఉంటారు తప్పులేదు..అభిమానం,ప్రేమ లేకుండా ఎలా బ్రతుకుతాం...
కానీ age తో సంబంధం లేకుండా, ఒకే ఒక్కడిని మాత్రం అందరూ విపరీతం గా అభిమానించేస్తూ ఉంటారు...
అగ్నివేష్ లాంటివాళ్ల అగ్ని మీద నీళ్ళు పోసేవాడు..మేధాపాట్కర్ లాంటి ఒక్కరు దూరమయితే ఏంటి మేధస్సు ఉన్నవాళ్ళు, కూడా ఉన్నారు, చాలు అని ఆనందపడిపోయేవాడు..
శాంతి భూషణ్,ప్రశాంతి భూషణ్ దూరం అయితే ఏంటి మనశ్శాంతి ఉంది చాలు అనుకునే ధీరుడు,శూరుడు,వీరాధి వీరుడు,మంచివాడు,యోగ్యుడు..రాజాధిరాజ,రాజ మార్తాండ,రాజ గంభీర.... నాకు తెలుసు మీరు కరెక్ట్ గానే guess చేస్తారని.....
అతనే.. ఒకే ఒక్కడు..శ్రీ శ్రీ శ్రీ అరవింద్ కేజ్రీవాల్
.........................................................
( అంటే ..మరీ..ఈ మధ్యన ఇతన్ని తలుచుకుని వారం రోజులయ్యింది..మళ్ళీ ఎక్కడ ఫీలయి మనసు కష్టపెట్టుకుంటాడో అని ఇలా రాసానన్నమాట....)..
( పొగిడేవాళ్ళు మాత్రం నా వాల్ మీద నిరభ్యంతరం గా పొగిడెయ్యండి..నేనస్సలు ఫీలవను...తిట్టేవాళ్ళు తిట్టకండి మరి.. ఇవాళ ఆదివారం కదా అరవింద్ కి సెలవో.. ఏంటో..)

18, ఏప్రిల్ 2015, శనివారం
Devi Varma ki gift....my friend devii enjoy...
ఈ రోజుల్లో...
మామూలు రోజుల్లో ఓణీలు వేసుకునేవాళ్ళు తక్కువైపోతున్నారు..అదేనండీ ఫంక్షన్స్ లో తప్ప పెద్దగా బయట కనపడటం లేదు...బహుశా బస్సులు ఎక్కి..దూరాలు వెళ్ళి చదువుకుంటున్నారు కదా అందుకు కావచ్చు..పైగా చుడీదార్లయితే సౌకర్యంగా ఉంటుందని కావచ్చు..ఏదయినా అప్పుడప్పుడూ అయినా వేసుకుంటున్నారు...అది చాలు..సంక్రాంతికి కోడిపందాలు,పెళ్ళిళ్ళలో పేకాట్లు,ఫంక్షన్స్ లో సాంప్రదాయం గా కనిపించడం భలే బావుంటుంది...
మన దేవీ వర్మ ఇలాంటి ఫొటొస్ భలే పెడుతుం...
See More
Lyrics
: Veturi Sundara Rama Murthy Gaaru Music : Ramesh Naidu Gaaru Actors :
Naresh, Pradeep, Subhakar, Subhalekha Sudhakar, Poornima Movie : Rendu
Jalla Se...
youtube.com
17, ఏప్రిల్ 2015, శుక్రవారం
కలెక్టర్ కు పది కోట్లు - శెభాష్ KCR
దేశం లో మొట్టమొదటిసారి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి జిల్లా కలెక్టర్ కి
పది కోట్లిచ్చి అభివృద్ధి కి ఖర్చు పెట్టమన్నారు..బావుంది కేసీ ఆర్ గారు..
జిల్లాకి పది కోట్లంటే వందకోట్లు...మొన్నామధ్యన మేయర్స్ కి ,కార్పొరేటర్స్ కీ కూడా భారీ గా జీతాలు కూడా పెంచారు..
నాకయితే ఒక్కసారి కలెక్టర్లు వాళ్ళ జిల్లాలో విస్తృతంగా తిరిగి..ఒక్కసారి నీటి సమస్య..డ్రైనేజ్ సమస్య గురించి ఒక అవగాహన కొచ్చి నివేదికలివ్వడం అవసరమయితే డబ్బు ని ఖర్చు పెట్టడం లాంటివి చేస్తే బావుంటుందనేది నా అభిప్రాయం..
వాటికి ఆ శాఖల మంత్రులున్నారని అనచ్చు...ముఖ్యమంత్రే ముందుకొచ్చినప్పుడు వీరు కూడా ఇలా చెయ్యటం తప్పుకాదు...
కలెక్టర్ స్థాయి వ్యక్తులు ముందుకొస్తే సమస్యలు కొంతవరకూ తీరచ్చు...ఇందులోకూడా అవినీతి జరుగుతుందనేవాళ్లకు నేనేమీ చెప్పలేను...అవినీతి చెయ్యాలంటే ఎలాగయినా చెయ్యచ్చు...అది విషయం కాదు.
ఇప్పటికే వెనకబడిన అదిలాబాద్ లాంటి జిల్లాను ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉందని నా ఫీలింగ్.
#All the Best To the collectors#

16, ఏప్రిల్ 2015, గురువారం
పంచ్ పడింది
ఇందాకా బయటనించుని,మా అబ్బాయిని ఆడిస్తుంటే..ఒకతను బైక్ పై వచ్చి 'రెంట్'
కేవన్నా ఇల్లుందా అని అడిగాడు బాగా ఖాళీగా ఉన్నానని.. ఇలా start చేసా...
ఇప్పుడు మీరు ఆగ్నేయం వేపునుండి వచ్చారు కదా..ఒకసారి ఈశాన్యం వేపు వెళ్ళి...లెఫ్ట్ కి తిరగండి.ఉత్తరం రోడ్ లో రెండు లేడీస్ హాస్టల్స్ కనిపిస్తాయి....ఈలోపల అతను అక్కడ నాకేం పనండీ అన్నాడు..
ఊరుకోవయ్యా చెప్పేది పూర్తిగా విను..అక్కడేమో కొంతమంది అమ్మాయలు నిలబడీ, అబ్బాయిలేమో బైక్ మీద కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు..వాళ్ళని పట్టించుకోకుండా...కుడి పక్కకు తిరిగి తూర్పు కు వెళ్తే...అర్ధమయ్యిందా తూర్పు కి వెళ్తే ఒక చిన్న సందు వస్తుంది...అక్కడ దక్షిణం లో ఉన్న ఇంట్లో ఆవిడని...
ఆవిడతో నాకేం పనండీ బాబూ..మళ్ళీ అతను
ఉండవయా స్వామీ..పొరపాటున కూడా ఆవిడని కదపకు..అసలే పెద్ద కంచు..(.మీకన్నానా నెమ్మదిగానే అన్నాడు )కానీ నేను మాత్రం వినపడనట్టు..మళ్ళీ స్టార్ట్ చేసా...ఆ 'కంచు' ఇంటి ఎదురుగుండా పడమర ముఖద్వారం తో ఒక ఇల్లు ఉంది అందులో అడిగితే..
ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్.బి నగర్ లో లోపలికి ఉన్న ఇల్లు అది సంవత్సరం నుండి ఖాళీగా ఉందిలెండి..దాని వివరాలు చెప్తారు అన్నా..
పాపం చాలా expectations తో వచ్చాడుకదా అని, ఇంత వివరంగాచెప్పా....ఈలోపల మా ఇంటి బాల్కనీవేపు చూసి..ఓసారి పట్టిన చెమటని కర్చీఫ్ తో తుడుచుకుని...మేడం ఆ బాల్కనీ లో సిగరెట్ కాలుస్తున్న ఆయన ఎవరూ అని అడిగాడు... మా అయన అన్నాను...మేడం ఆయనకి నా ప్రగాఢ సానుభూతి తెలియచెయ్యండి ప్లీజ్ అనేసి వెనక్కి చూడకుండా వెళ్ళిపోయాడు.....
........బాగా తెలివైనవాడు కదా.....

Small doubt
........
"చిత్రం" ..సినిమాలో "ఊహలపల్లకీలో ఊరేగించనా"..పాట విన్నప్పుడల్లా ఒక అనుమానం వస్తుంది నాకు
ఊహల పల్లకీ లో ఊరేగించనా
ఆశల వెల్లువై రాగం పలికించనా
కలహంసై కబురలందించనా
రాచిలకై కిలకిల నవ్వనా
నా పెదవుల మధువులే ఇవ్వనా సయ్యాటలోనా
...రాసింది.....కులశేఖర్
కలహంస అయి కబురులందించనా,రాచిలుకై కిలకిలా నవ్వనా,అని పాడుతుంది..అమ్మాయి
నాకైతే కలహంసై కబురులందించనా అనేకంటే రాచిలకై కబురులందించనా అని ఉంటే ఇంకా బావుండేదేమో అని ఫీలింగ్
ఎందుకంటే హీరో హీరోయిన్ కి దగ్గరగానే ఉంటాడు..ఈ సినిమాలో ..ఒకవేళ అతను ఎక్కడో దూరం గాఉంటే హంసరాయబారం చేస్తోందీ అమ్మాయి అనుకోవడానికి...
పాటంతా బావుంటుంది కానీ చిలక మాట్లాడుతుందంటారు కాబట్టి..ఇలా రాయాల్సింది
..............................
ఇప్పుడెందుకు గుర్తొచ్చిందంటే రేడియోలో ఈ పాట వస్తోంది...ఎప్పటినుంచో ఉన్న అనుమానం, మళ్ళీ బయటికొచ్చింది..అంతే

కొంతమందికి మాత్రమే....
ప్రేమించుకునేటప్పుడు...ఇంట్లో అబద్ధాలు చెప్పాలి,పార్కులకి తిప్పాలి,Gifts కొనాలి..బాడీగార్డ్ లాగా అన్నీ కనిపెట్టుకుంటూ ఉండాలి..అమ్మాయి ఏం చెప్పిన..తుమ్మినా,దగ్గినా కూడా అద్భుతం అనాలి,
ఈ లోపల పరీక్షలు వస్తే చదివినా చదవకపోయినా సరే రాయాలి..రిజల్ట్ బాగాలేకపోతే ఓదార్పుయాత్రచెయ్యాలి..అన్నీ బావుండి ..ఇద్దరూ ప్రేమలో ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటే మధ్యలో వచ్చే వాలంటైన్స్ డే లాంటివాటిని చాలా జాగ్రత్తగా ఒక వేడుకలా జరుపుకోవాలి..
ఇన్ని జరుగుతుంటే అసంకల్పిత ప్రతీకారచర్యలా ...అమ్మాయికో. అబ్బాయికో ..ఏవో ఇబ్బందులొచ్చి..పెళ్ళిదాకా వెళ్ళే పరిస్థితి ఉండకపోవచ్చు...అప్పుడు కాసేపు బాధపడి..అంతా మర్చిపోయి..ఎవరిదారి వాళ్ళు చూసుకుందామనే తెలివైన ఆలోచనకి వాళ్ళే వచ్చెయ్యచ్చు...
ఇంతకష్టపడి స్కెచ్ వేసుకుని దానికి ప్రేమ అనే పేరు పెట్టుకుని కన్వీనియంట్ గా బతికేసేవాళ్ళని పెళ్ళి పేరుతో ఇబ్బందిపెట్టడం ......
భజరంగ్ దళ్ వాళ్ళకి న్యాయమేనా అని .పెళ్ళి చేసి వాళ్ళ ప్రేమని చంపేస్తారా..వాళ్ళకే ఒక క్లారిటీ ఉండదు కదా..మీరేం ఉద్ధరిద్దామని వాళ్ళ జోలికి వెళ్తున్నారో... really very sad..మహా అయితేమీకు భయపడి రహస్యంగా కలుస్తారు...అంతే..
ప్రియమైన భజరంగ్ దళ్ ..మీకో సలహా....
వీలైతే ప్రేమించండి..పోయేదేముంది మహా అయితే తిరిగిప్రేమిస్తారు అంతే కదా...
భజరంగ్ దళ్ కి మాత్రమే వాలంటైన్స్ డే శుభాకాంక్షలు...

ఎందుకని క్రికెట్, వేలంటయిన్స్ డే,ఫాదర్స్ డే,మదర్స్ డే... ఇలాంటివన్నీ విదేశీ సంస్కృతి మనకు వద్దూ అని విమర్శిస్తున్నారు...
మనకి, మన పక్కిల్లు ఎలాగో ..మన దేశానికి పక్క దేశం అలాగా.. అంతే కదా...terms బావుంటే అన్నీ బావుంటాయి, లేకపోతే స్నేహం కంటిన్యూ అవదు..
ఏదేశ ఆర్ధిక పరిస్థితి,జనాభా ని బట్టీ ఆదేశం ఉంటుంది.
ఏదో ...ఇతరదేశాల ప్రభావం వల్ల మనలో మార్పు వచ్చింది అనేది కరెక్ట్ కాదు...తెల్లారిలేచి ఓ నాలుగు ఇంగ్లీష్ words మాట్లాడందే రోజు గడవదు,బ్రాండెడ్ వస్తువుల్ని వాడకుండా నిద్రపోం ...అలాంటప్పుడు ...చిన్నవాటిని మాత్రం భూతద్దం లో వెతకడం ఎందుకు.
మనవాళ్ళు వెళ్ళి విదేశాల్లో కూడా వాళ్ళ ప్రతిభ చూపించి ఆ దేశ, ఎకానమీ పెంచుతుంటే మనవాడే కదా, అని గర్వపడితే సంతోషం... ఇక్కడే ఆ పని చెయ్యచ్చుకదా అనుకుంటూ కూర్చుంటే....ఇలాంటి వాదనలవల్ల ఉపయోగం ఉండదు..
ఇతరదేశాలేమీ మనల్ని ,మీరు మమ్మల్ని ఫాలో అవ్వాల్సిందే అని బలవంతపెట్టట్లేదు కదా..మనకీ నచ్చిందీ ఇష్టపడుతున్నాం...
మాకు నచ్చలేదు అనుకునేవాళ్ళు దూరం గా ఉండటమే...అంతేగానీ ఒకవేలు వాళ్ళకి చూపిస్తే మనవేపు నాలుగు వేళ్ళు చూపించరా...
మంచి చెప్పడం మంచిదే..కానీ నేను చెప్పేదే మంచీ... మిగిలినదంతా చెడు ...అంటే...
ఏదో ఒకవిషయం మనకి నచ్చలేదని..అన్నిటినీ విమర్శించడం కంటే..గౌరవించేవాటిని గౌరవించడం...నచ్చనివాటికి దూరగా ఉండడం కరెక్ట్
తప్పు,ఒప్పు అనే బటన్స్ ఉండే రిమోట్ మనం...మనం డిసైడ్ చేసుకోవాలి ఏది ప్రెస్ చెయ్యాలి అనేది..అవతలవాళ్లని తప్పు పట్టేముందు

దేశవిదేశాల్లో ఉన్న నా అభిమాన స్నేహితులకు..
మీరంటే నాకెంత అభిమానమో నేను మాటల్లో చెప్పలేను..చేతల్లో చూపించలేను..మీరంతా నా ఆరాధ్య దేవతలు,దేవుళ్ళు...
రేపు శివరాత్రి అని మీకు తెలుసుకదా..మీరంతా నాకో సాయం..చెయ్యాలి...చెయ్యము,చెయ్యలేము అని నా ఉత్సాహం మీద వాటర్ చల్లద్దు..మీరు తప్పకుండా చెయ్యాలి..మీకా టాలెంట్ ఉంది..
ఎవరూ మీ టాలెంట్ ని తట్టిలేపక మరుగున పడుతోంది అంతే..మీమీద ఎంతో నమ్మకం తో అడుగుతున్నా..కాదనకండి......మీ చేతుల్లో ఉన్నదే..ఎక్కడ్నుండీ కొని తేవక్కరలెద్దు..డబ్బు ఖర్చు పెట్టక్కరలెద్దు..టైం అస్సలు వేస్ట్ అవదు...
విషయం ఏంటంటే
..
...
....
రేపొక్కరోజు ..మంచి మంచి వంటలు..పులిహోరా...ముఖ్యంగా స్వీట్స్ ఉన్న photos అస్సలు post చెయ్యద్దు...ఇక్కడ లడ్డూలూ చాలా important అమ్మా....ఇవి అసలంటే అసలే వద్దు..
ఎందుకంటే యావన్మంది ప్రజానీకానికీ తెలియజేయునది ఏమనగా అంటే రేపు నేను ఉపవాసం......ఓ అరగంట సేపు నాకోరికలన్ని కోరుకుని ఆతర్వాత మీ అందరూ బావుండాలని ఆ శివుడ్ని మరిమరీ కోరుకుంటా ..

తెలంగాణా ముఖ్యమంత్రి గారు..మన ప్రధాని మోడీ గార్ని కలిసి..తెలంగాణా లో
ఉన్న సమస్యలు వివరంగా చెప్పారు..అంతే కాకుండా ప్రాణహిత-చేవెళ్ళకు జాతీయ
హోదా విషయం కూడా ప్రస్తావించారు...వీటితోపాటుగా..విభజన చట్టం లో ఉన్న
ప్రతిపాదనలన్నీ వీలైనంత త్వరగా అమలు చేయమన్నారు .మిషన్ కాకతీయ
ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు కూడా..
ఇక్కడదాకా బానే ఉంది
..
ఆంధ్రాకి ..హైకోర్ట్ తొందరగా ఏర్పాటు చెయ్యమని కోరారు...
ఒక రాష్త్రం కొత్తగా ఏర్పడినప్పుడు..కావలసినవన్నీ ఏర్పడటానికి కొంచెం టైం పడుతుంది..ఒక్కటీ చేసుకుంటూ రావాలి..కేంద్రం కూడా సపోర్ట్ చెయ్యాలి..ఇప్పుడు..
హైకోర్ట్ ఒక్కటీ ఎందుకు ప్రస్తావించినట్టు..
.......................
ఒకవేళ కేంద్రం కనుక ..ఆంధ్రా లో హైకోర్ట్ విషయం లో యుద్ధప్రాతిపదికన స్పందించి ,ఒక్క హైకోర్ట్ ఏర్పాటుకు నిధులందిస్తే..
ఆంధ్రా ముఖ్యమంత్రి..CBN గారు..మిగిలిన అన్నింటికీ కూడా ఇలాగే స్పందించి అప్పుడు మాట్లాడండని కేంద్రం మీద ఒత్తిడి తేవాలి

ఆంధ్రప్రదేశ్ ...తెలంగాణా,ఆంధ్రా అని రెండు రాష్ట్రాలుగా విడిపోయాకా
మొట్టమొదటి తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
గారి పుట్టినరోజు సందర్భంగా రెండు మాటలు..
ఫిబ్రవరి 17, 1954 లో మెదక్ జిల్లా లో పుట్టిన KCR తెలుగు లిటరేచర్ లో ఉస్మానియా యూనివర్సిటీ నుండి మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నారు..1970 లో యూత్ కాంగ్రెస్ సభ్యుడిగా సంజయ్ గాంధీ నాయకత్వం లో పనిచేసారు..1983 లో TDP లో చేరారు..అప్పట్నుండీ అంటే.. ఎన్ టీ రామారావు గారి నాయకత్వం లోనూ, బాబు గారి నాయకత్వం లో కూడా పనిచేసి..2000-2001 లో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా కూడా పనిచేసిన KCR ..ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఎలాగైనా సాధించాలనే కసి,పట్టుదలతో తెలంగాణా రాష్ట్ర సమితి స్థాపించారు..
2004 లో కాంగ్రెస్ తో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిందీ ,..2009 లో TDP తో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిందీ...ఈ TRS పార్టీనే
అయినా ..లక్ష్యం మాత్రం ప్రత్యేక తెలంగాణా మాత్రమే
మొత్తానికి విపరీతమయిన కృషి,పట్టుదలతో ..సోనియాగాంధీ ని మెప్పించి తెలంగాణా సాధనలో సఫలం అయ్యారు..KCR
తెలంగాణా ప్రజలు ఈయన కష్టాన్ని గుర్తించి ముఖ్యమంత్రిని చేసారు
ఇప్పటికీ ఎంతసేపు మాట్లాడాల్సివచ్చినా ఎదురుగుండా script పెట్టుకోని వ్యక్తి..
సమయానుకూలంగా సెటైర్స్ వెయ్యగల తెలివి..
విపరీతంగా చదివే అలవాటు ఉన్న KCR కి
జన్మదిన శుభాకాంక్షలు...
..........వైదేహి

దొరగారికి విజ్ఞప్తి
మీరు హటాత్తుగా మా మీద ప్రేమ చూపిస్తే ఎలాగండీ మాష్టారు...తుఫాను కి,వరదలకి కూడా హెచ్చరికలుంటాయే..అలాంటిది మీ మానాన మీరు మమ్మల్ని ఆకాశానికెత్తేస్తుంటే ..తట్టుకోవడం కష్టంగా ఉంది గురువుగారూ.
హుస్సేన్ సాగర్ కి వరదొచ్చినట్టు మీకు ప్రేమ పొంగితే ఎలాగండీ బాబూ.
మీరు మమ్మల్ని అభిమానిస్తుంటే మాకు బానేవుంది కానీ మీ వీరాభిమానుల పరిస్థితేంటారు..వాళ్ళకి as usual గా మమ్మల్ని విమర్శించాలో,పొగడాలో అర్ధం కాకుండా ఉంది..
అంచేత మీరు ముందర మీ అభిమానులకి ఒక క్లారిటీ ఇవ్వండి..తర్వాత మా సంగతి చూద్దురు గానీ..
మాకాలిలో ముల్లు గుచ్చుకుంటే మీరొచ్చి తీస్తామని సెలవిచ్చారు మహా సంతోషం ..అంతకంటే ముందు మీరు మాకు చూపించేదారిలో ముళ్ళు లేకుండా చూడండి చాలు

నిద్రపోతున్న తన చిన్న ప్రపంచాన్ని తట్టి లేపిన సోనియాగాంధీ..ఎంతో బాధతో లేఖరాసిన విధానం చూస్తుంటే...చాలా సంతోషంగా ఉంది.
మన విజయనగరం సత్తిపండు ,గ్లామర్ కింగ్ ఆనం రాం నారాయణరెడ్డి ,అభిమాన స్నేహితుడు కే వీ పీ ..ఈ ముగ్గురూ తో కలిసి కేంద్రం తో ..ఏపీ కీ ప్రత్యేక హోదా,రెవెన్యూ లోటు,రాజధానీ లాంటీ అంశాల గురించి రాజీ లేని పోరాటానికి డిసైడ్ అయ్యారు సోనియా గారు..
ఒక పార్టీని బతికించుకోవాలీ అంటే.. ఒక సమస్యను, అది తను సృష్టించిందే అయినా కూడా అవసరానికి ఈజీగా వాడుకోవచ్చనే విషయం బాగా తెలుసుకున్నారు..
ఏపీ రాష్ట్రానికి సంబంధించినంతవరకూ మీరు ఏహోదాలో అడుగుతున్నారు..మీరేం అక్కడ ప్రతిపక్షం కాదు.ఐతేనేం మేము మనుషులం మాకా హక్కుంది అంటారా..మీకంటే అక్కడి ప్రజలే బాగా అడుగుతున్నారు...
ఇక కేద్రం దగ్గరకొస్తే ..ఆల్రెడీ కేంద్రం జారీ చేస్తున్న ఆర్డినెన్సుల మీద ఫైట్ చేస్తున్నారు కదా..దానితోపాటు ఈవిషయం కూడా ప్రస్తావిస్తున్నారా..
నేను గిల్లాను..మీరంతా జోలపాడండి అంటే ..ఎలా.
ఓపక్కన ,మీ పొన్నాల లక్ష్మయ్యగారూ తెలంగాణా బిల్ అమోదం పొంది సంవత్సరమయ్యిందీ ఇదంతా మా సోనియా ఘనత అని సంబరాలు చేసుకుంటున్నారు..మరోపక్క మీరు పోరాటం చేస్తానంటున్నారు..
బావుందండీ ..ఏరాష్ట్రానికి ఆ రాష్ట్రం లో అలా అన్నీ సెట్ చేసుకుంటున్నారన్నమాట.

ఏంటి బాబుగారూ ఇంకా మాటలు పడదామనే డిసైడ్ అయ్యారా..
మీకు మాత్రమే సొంతమయ్యే ఇల్లు, మీరు దగ్గరుండి కట్టించుకుంటున్నారు కదా..మరి రాష్ట్రం మొత్తానికి ఉండాల్సిన ఒకే ఒక రాజధాని విషయం లో మీరెందుకీవిధంగా ఉండట్లేదు..
ఏవండీ ..విజయవాడ చుట్టుపక్కల ఖాళీగా ఉన్న బిల్డింగ్స్ లో తాత్కాలిక రాజధాని ఏర్పాటు చేసి పని మొదలెట్టలేరా...ముందర మీరు కదిలి, గట్టిగా ఆర్డర్స్ పాస్ చేస్తే ఉద్యోగులు రారా..వచ్చినవాళ్ళతో start చెయ్యలేరా..మీమీద నమ్మకంతో ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటే మీరు వాళ్లకేవిధంగా న్యాయం చెయ్యాలనుకుంటున్నారు..?
ఇవాళ KCR ఆంధ్రరాష్ట్రం గురించి మాట్లాడారంటే దానికి అవకాశం ఇచ్చినట్టవలేదా.
ఒక్క నిమిషం ఉండండి.. ఒకసారి ఆయనతో చిన్న మాట చెప్పాకా మీదగ్గరకొస్తాను
ఏవండీ KCR .మీరేవన్నా ఎలాంటి డెవలప్మెంట్ లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారా..లేక ఇప్పుడే పుట్టిన రాష్ట్రాన్ని పాలిస్తున్నారా..మీకు కడుపు నిండుగా ఉందని ఏమీలేని ఆకులో ఉమ్మేస్తానంటే ఎలాగండీ..ఇవాళ అభివృద్ధి చెందిన తెలంగాణా రాష్ట్ర రాజధానిలో మీరు వ్యతిరేకించే ఆంధ్రరాష్ట్ర ప్రజల రక్తం,తెలివితేటలు,పెట్టుబడి ఉంది గుర్తు తెచ్చుకోండి..ఒకసారి కుందేలు,తాబేలు కధ గుర్తుతెచ్చుకోండి మీరు..
పోటీ అభివృద్ధిలో చెయ్యడం లో పడండి..మాటలు మాట్లాడ్డం లో కాదు
.......
బాబుగారూ 9 నెలల కాలాన్ని వెనక్కి తీసుకురాలేకపోవచ్చు..కానీ పనిలో స్పీడ్ ఉంటే పదికాలాలు గుర్తుండిపోతారు..డబ్బు,సౌకర్యాలు ఉంటే ఎవడైనా పాలించగలడు.. అవన్నీ లేవుకాబట్టే మీరు ఎక్కువ effort పెట్టాలి

వంట వచ్చిన కొంతమంది మగవారితో ఇబ్బందులు...
ఏదో టైం బాలేక నలభీములిద్దరూ వంట చెయ్యడం మొదలుపెట్టారుగానీ ఏనాడైనా ఎవరి వంట కైనా..అదే ముఖ్యంగా ఆడవాళ్ళ వంటకు పేరు పెట్టినట్టు ఎక్కడైనా చదివామా లేదు కదా..మరి వీళ్ళేంటండీ మరీ వంకలు పెడతారు..ఇప్పుడూ వీళ్ళేదో అవసరమయ్యో,ఇష్టం పెంచుకునో నేర్చుకున్నారు బానేఉంది..
ఇంట్లో ఆడాళ్లు చేసేవాటికి పేర్లెందుకు పెట్టడం.ఇంట్లోవాళ్ళని వంట మొదలయినప్పటినుండి..తిని చేతులుకడుక్కునేదాకా కడుగుతూనేఉంటారు ..ఇదే నేనయితే అదరగొట్టేసేవాడ్ని అంటారు..మరిచెయ్యచ్చుకదా...కారం ఎక్కువయ్యిందీ,ఉప్పు తగ్గించుండాల్సింది..వంట మీద శ్రద్ధపెట్టు...
శ్రద్ధపెట్టకుండా అసలు వంట ఎలా చేస్తారని వీళ్ళ ఉద్దేశం...వంటచేసేదేవన్నా అసెంబ్లీ స్పీకరా
కాదు కదా అన్నిటినీ మేనేజ్ చెయ్యడానికి..లేదా తెలుగు సినిమా హీరో నా ఓపక్కన విలన్స్ ని కొట్టేస్తూ మధ్యలో తింగరిబుచ్చిలా వచ్చే హీరోయిన్ ని భుజం మీదేసుకుని ఫైటింగ్ చేస్తూ అందర్నీ,అన్నిటినీ కవర్ చెయ్యడానికి..
ఇవాళా రేపు నూటికి డెబ్భై మంది టీవీ చూస్తూ తింటున్నారు..ఇలా వాళ్ళు రెండుపనులు చేస్తున్నారు కదా అని అందరూ అలాగే ఉంటారా..కాదు కదా.
అంచేత ఇందుమూలంగా నేను చెప్పేదేంటంటే ఈ వంటవచ్చిన మగవాళ్ళు..అందరూ కాదు కొంతమంది మాత్రమే అదీ పేరు పెట్టేవాళ్లు..మొదట నెమ్మదిగా చెప్పండి..నెమ్మదిగా నేర్చుకుంటారు..ఒకవేళ మీరు చెప్పినా బాగాచెయ్యకపోతే మీకు నేర్పడం సరిగా రాదన్నమాట..
అప్పుడేం చెయ్యాలో నేను చెప్పక్కరలేదుగా...అదే అదే మీకు నేర్పడం చేతకాని కారణంగా మీరే వండుకుంటూ జీవనం సాగించండి
(ఈ post మా పక్కింటివారికి అంకితం చేస్తున్నా)

KCR
కి తెలంగాణా..అందులోనూ హైదరాబాద్ మీదున్న ప్రేమాభిమానాలకు
జోహార్లు..ఏంటండీ మాట్లాడితే వంద కోట్లు అంటున్నారు మరి...నిజంగా తెలంగాణా
ఆర్ధికంగా అంత మంచిపొజిషన్ లో ఉందని నాకు తెలీనేలేదు..
మిషన్ కాకతీయ,హుస్సేన్ సాగర్ చుట్టూ బిల్డింగ్స్,వినాయక నిమజ్జనానికి..ప్రత్యేక చెరువు,కొత్త సచివాలయం అదీ పర్ఫెక్ట్ వాస్తు తో..ఇవే కాకుండా కోట్లాది రూపాయల మొక్కుబడులు...
నాకోవిషయం అర్ధమయ్యింది..ఈయన ఎక్కడ అడుగుపెడితే అక్కడ వరాలిస్తున్నారు..అన్నిటికంటే కూడా నిన్న యాదగిరిగుట్ట కిచ్చిన వరం మాత్రం అసామాన్యం..ఏడాదికి 100 కోట్లు సేంక్షన్ చేసారు..ఆధ్యాత్మిక కేంద్రంగా డెవలప్ చెయ్యడానికి..ఏడాదికి వందకోట్లండీ సరిగ్గా వింటున్నారుకదా నేను చెప్పేది..అదీ విషయం మరి.
ఐతే మా KTR ఏవన్నా తక్కువనుకుంటున్నారా..అదేనండీ తెలంగాణా IT మినిష్టర్..తండ్రికి తగ్గ కొడుకు ఈయన..ఏకంగా లక్షకోట్ల ఎగుమతులు మాలక్ష్యం అని చెప్పేసారు.
ఒకప్పుడు IT ఎగుమతుల్లో బెంగుళూర్ తర్వాతి స్థానం లో నిలిచిన హైదరాబాద్ కు పూర్వ వైభవాన్ని తెచ్చేప్రయత్నం లో KTR బిజీగా ఉన్నారు
అందుచేత తెలంగాణా ముఖ్యమంత్రిగారు..శ్రీ KCR ,IT మినిష్టర్ శ్రీ KTR..మీఇద్దరూ మా ఆతిధ్యం స్వీకరించీ..మమ్మల్ని ఆశీర్వదించి..అదీ మీ స్టైల్లో..మదర్పితచందనతాంబూలాలు స్వీకరించ ప్రార్ధన
............................................ఇట్లు వీరవిధేయురాలు .....................వైదేహి

వెంకీ మీ డాడీ కోరికమీద post పెడుతున్నా...
నువ్వు నీ exams బాగా రాయరా బాబూ..ఒకవేళ నువ్వు నీ ఫ్రెండ్స్ తో బిజీగా ఉండో fb లో టైం గడుపుతూనో చదవకపోతే నీ పక్కవాళ్ళని,వెనకాలవాళ్ళని బతిమాలుకుని జాగ్రత్తగా మేనేజ్ చేసి ఎలాగోలా మంచి మార్కులు తెచ్చుకో లేకపోతే ....మీ డాడీ మురళీవెంకట్ గారూ బెంగపెట్టుకుని బక్కచిక్కిపోతారు..
తెలంగాణా ముఖ్యమంత్రి లాగా మీడాడీ బోల్డన్ని మొక్కులు కూడా మొక్కుకున్నారు...ఒరే నాయనా.. పేకాట ఆడేవాళ్ళు కూడా రెగ్యులర్ గా ఆడకపోతే హేండ్ రైజ్ లో ఉండదు..అలాగే క్రికెట్ ఆడేవాళ్ళు కూడా రెగ్యులర్ గా ప్రాక్టీస్ చెయ్యకపొతే ఆడటం ఉండదు..పెవిలియన్ చుట్టూ ప్రదక్షిణాలు చెయ్యడమే..చూసావా జాతీయ క్రీడలకే ఇంత కష్టపడుతుంటే...చదువుకెంత కష్టపడాలి మరి ...అందుకే..నామాట విను..
బాగా చదువుకుని పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకుని మమ్మల్ని ఉద్ధరించు..పెద్ద ఉద్యోగం తెచ్చుకుని నాలుగురాళ్ళు సంపాదించి ఒకటి నాకు,ఒకటి మీ మురళీ వెంకట్ గారికి,ఒకటి మీ అమ్మా నాన్నకి ..మిగిలినది నువ్వూ,మిగిలిన వాళ్లందరూ పండగ చేసుకోండి..నువ్వు ఖచ్చితం గా అన్నీ సాధిస్తావనే నమ్మకం ఉంది..నీవెనకాలనేనున్నానుకదా..
(చదివేవాళ్ళందరూ సరదాగా మాత్రమే తీసుకోండి..పొద్దున్నే నన్ను వాయించెయ్యకండి)

All the best venky
పవన్ కల్యాణ్... బాబుగార్ని కలవటం అయిపోందా..సరే భోజనం టైం అవుతోందికదా..మా ఇంటికి వచ్చెయ్..
తినేసాకా ఢిల్లి వెళ్దాం...నేను చెప్పేది విను..ఇప్పుడు మన ప్రధానమంత్రి ని పదిసార్లు వెళ్లి కలవటం ,20 సార్లు మన సమస్యలు చెప్పటం తప్పేమీ కాదు..పౌరుషానికెందుకు వెళ్లటం చెప్పు..మనం ఓట్లేస్తేనేకదా ఆయన ప్రధాని అవుతా..
ఆయనకేవన్నా పిల్లలా,సంసారామా..ఏవీలేవుకదా..మనల్ని కాక ఇంకెవర్ని చూడాలి ..కాకపోతే గజనీ లాగా ఏంచెయ్యాలో మర్చిపోయారు..మనం గుర్తుచేద్దాం..అవసరం మనది...
పోలవరానికి లాస్ట్ యియర్ 250 కోట్లు ఇచ్చారు ఇప్పుడు 100 కోట్లే ఇచ్చారేంటండీ అని అడుగుదాం..తెలంగాణా ముఖ్యమంత్రి అయితే సంవత్సరానికి యాదగిరిగుట్ట అభివృద్ధికే 100 కోట్లిస్తానన్నారనే విషయం ఆయనికి తెలీదేమో మనమే చెప్దాం...అంతేనా ..ఇంకా చాలాఉన్నాయి అవన్నీ మాట్లాడుకుని...
అమ్మో ఇప్పటికే ఒంటిగంట అయ్యింది త్వరగా రా నీకోసం చిట్టిముత్యాలు రైస్ తో బిర్యానీ చేసాను..తినేసి ఢిల్లీ వెళదాం సరేనా...నువ్వేం మొహమాటపడకు నేనూ నీతో వస్తాను కదా..

వామనావతారం గుర్తుంది కదా అందరికీ...
వామనుడు పుట్టినవెంటనే తండ్రిని ఉపనయనం చెయ్యమంటాడు...తన తండ్రి అయిన కశ్యపబ్రహ్మని..
తండ్రికి తెలుస్తుంది, తనకి పుట్టింది శ్రీమహావిష్ణువే నని ..వెంటనే ఒడుగు చేస్తాడు కూడా..
బుల్లి పిల్లాడులా ఉండే వామనుడు..హేపీగా యజ్ఞోపవీతం ధరించి..ఒక గొడుగు తీసుకుని బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్న స్థలం దగ్గరకొస్తాడు..మన బలిచక్రవర్తి కాస్తా ..కొత్తగా ఉపనయనం అయినట్టుంది ఏంకావాలో కోరుకో అంటాడు...
వామనుడు మూడడుగుల స్థలం చాలు అంటాడు..అంతేనా అంటాడు బలి..అంతే చాలూ..కానీ నేనే కొలుచుకుంటాను అంటాడు వామనుడు..
మహాభాగ్యం అని చెప్పి , బలిచక్రవర్తి ,భార్యని నీళ్ళు తీసుకురమ్మంటాడు
అయితే... అతని భార్య నీళ్ళు తెచ్చి బలి చేతిలో వంపుతుండగా... మన శుక్రాచార్యుడు ఉన్నాడు కదా, మహా తెలివైనవాడు..వచ్చింది విష్ణుమూర్తి అని కనిపెట్టి..నీళ్ళు పడే రంధ్రానికి అడ్డుగా వెళతాడు..
నీరు రాకపోవడాన్ని గ్రహించిన వామనుడు ధర్బ పుల్లతో ఒకసారి పొడుస్తాడు. దెబ్బకి శుక్రాచార్యుడి కన్ను పోతుంది ...సంతోషంగా దానం చేస్తాడు బలి చక్రవర్తి..అ తర్వాత అంతా మీకు తెలుసు..చాలా చిన్నప్పుడు చదివాను..అందుకే గుర్తున్నంతవరకూ రాసాను.
...ఇప్పుడు రాజులు,రాజ్యాలు..లేవు .శుక్రాచార్యులు ఉన్నా..వాళ్ళ ఆటలు సాగవు..ఈ రోజుల్లొ దానాలివ్వడం ..పుచ్చుకోవడం...అనేవి విలువలేని మాటలు..
ఇప్పుడు ప్రజాస్వామ్యం లో ఉన్నాం...ప్రజలదగ్గర ఓటు అనే అయుధం ఉంది. రోజులు మారాయి...ఒక పార్టీకి నలభయ్యేళ్ళు పట్టింది కళ్ళు తెరవడానికి...కానీ ఉపయోగం లేదు కదా..మిగిలిన పార్టీలు నేర్చుకుంటే మంచిది..లేదంటే ఉన్న ఖర్చులతోపాటు మళ్ళీ ఎలెక్షన్స్ ఖర్చు....మళ్ళీ పన్నులు..ధరలు పెరగడం అనీ మామూలే ...
అలవాటు పడిపోయాం అని అనుకోవద్దు..ఒకవామనుడినే తట్టుకోవడం కష్టం అయ్యింది...ఇప్పుడు ప్రజలందరూ వామనుడిలా అయ్యేదాకా వెయిట్ చెయ్యకండి

అసలు, ఆటోల్లో పాటలు పెట్టీ ..వాళ్ళు వింటూ మనల్ని వినమని హింసించే ఆటో డ్రైవర్లకి ఏం చెప్పి జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలి
.కూకట్ పల్లి లో ఒక ఆటో అతన్ని అమీర్ పేట్ వస్తావా ..అని అడుగుదామనుకుంటున్నా ఇంతలోనే "తూ ఆజా సరోజా" అనే పాట వస్తోంది ఆటోలోంచి..అతనేం చెప్తున్నాడో అర్ధమైచావలేదు.."ఆజా సరోజా"అనేమాట తప్ప..
సరే ఏదో చెప్పి ఎక్కి కాస్త ఆ పాటలు ఆపవయ్యా అంటే..మేడం ఇప్పుడు బేక్ టూ బేక్ మూడు పాటలు వస్తాయి బావుంటాయి మేడం అన్నాడు..
వీడి రేడియోమిర్చీ అభిమానం తగలెయ్యా అనుకున్నా....వెంటనే..."మన్మధరాజా మన్మధరాజా" అనేపాట వచ్చేసింది.ఖర్మ అనుకుంటూ కష్టపడివిన్నా..తర్వాత "సిగ్గేస్తోంది నిను చూస్తుంటే.. "అనేపాట వచ్చేసింది యమా స్పీడ్ గా ...మన హరికృష్ణ,సిమ్రాన్ ది .."నాకూ ఆపాట అంటే ఇష్టమే కానీ ..ఆటో డ్రైవర్ తోపాటు ..ఈపాట ఎలా వినేడవాలీ అనుకుంటున్నా ..
ఇంకొక్కపాట..అదికూడా అయిపోతే బావుండూ..అనుకునేలోపు వచ్చిందండీ..మూడోపాట..ఏంటనుకున్నారు....
"రారా..వస్తవా అడిగింది ఇస్తవా"...నా జన్మ ధన్యమయిపోయింది..
మొత్తానికి అతను చెప్పినవన్నీ అయ్యాయికదా అని ..సర్లేవయ్యా నువ్వన్న పాటలన్నీ అయిపోయాయి కదా ఇప్పటికయినా ఆపేయ్ అంటే...
ఆటో డ్రైవర్ నావంక ఒకవెర్రి చూపు చూసి ...మేడం మీరు కళలని పోషించరా అన్నాడు..అతని సినిమా డైలాగులకి నవ్వొచ్చింది ..పైగా ఆడుతూ పాడుతూ పనిచేసుకోవాలి మేడం...అంటూ నామీదే పంచ్ వేసాడు....భలే తెలివైనవాడు..
ఇంతకీ అతనిపేరు యాదగిరి..యాదాద్రి కాదండోయ్

మల్లిగాడి ఇంటికాడ మల్లెపూలు కోసుకుంటె--చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటె
సుబ్బుగాడి దిబ్బకాడ సన్నజాజు లేరుకుంటె--పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటె
చాకిరేవు గట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటె--సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటె
ముత్యమున్న ముక్కుపుడక ముక్కుమీద పెట్టుకుంటె--రోల్డ్ గోల్డ్ గాజులేసి చేతులేమొ ఘల్లుమంటె
చీరకట్టునేమొనేను అట్ట ఇట్ట సర్దుకుంటె--సింగార కుంకుమెట్టి పెద్దబొట్టు దిద్దుకుంటె
అద్దం లో చూసుకుంటు నాకు నేను ముద్దుకుంటె--కుర్రాళ్ళ చూపులన్ని వచ్చి నన్ను గుద్దుకుంటె...
..................
ఇలాంటిమాటలన్నీ పల్లెటూళ్ళ లో ఉండేవాళ్ళకు అలవాటే..వ్యవసాయం పనులయితే మరీ పాడుకుంటూ పనిచేసుకుంటూ సంతోషంగా గడిపేస్తారు...ఇది "s/o సత్యమూర్తి "సినిమాకోసం దేవిశ్రీప్రసాద్ రాసినపాట..ఈ సినిమాకు సంగీతం కూడా దేవిశ్రీ నే..నాకు వినగానే పళ్ళెటూళ్ళు,వాళ్ల హడావుడి గుర్తొచ్చింది.

పవన్ కల్యాణ్ వ్యాఖ్యల మీద JC దివాకర్ రెడ్డి స్పందించడం బావుంది
.ఎందుకంటే పవన్ తన మానాన తను వచ్చి ఉద్రేక పూరిత ప్రసంగం చేసి మర్నాడు..
ఇంటర్వ్యూలు ఇచ్చి అప్పుడు కూడా స్పష్టత లేకుండా మాట్లాడినప్పుడు..
ఒక TDP MP గా దివాకర్ రెడ్డి స్పందించటం కరెక్టే..ఎందుకంటే ఆంధ్రా ఏం పీలు స్పందించాలి అనిచెప్పినప్పుడు ఎలా స్పందించాలో కూడా చెప్పాలి పవన్ అన్నారు జేసీ..
నిజమే కదా...రాజకీయాల్లో అమూలాగ్రం చదివేసినవాళ్లకి ఎవరోఒకరు వచ్చి సలహాలు,సూచనలు ఇస్తే ..ఇస్తే ఇచ్చాడులే అని వదిలెయ్యకుండా బయటికొచ్చి నీ సలహా ఏంటీ..నువ్వేం సూచన చెయ్యదల్చుకున్నావు అని అడగటం....దీనివల్ల ఇంకోసారి ఇలాంటివి చేసేవాళ్ళు పునరాలోచించుకునే అవకాశం ఉంటుంది....

పరీక్షలు
రాసేవాళ్ళసలు వినకూడదు ...వింటే ఈపాట పాడిన అమ్మాయిని చితక్కొటేస్తారని
భయం..అందుకే వాళ్ళు తప్ప అందరూ వినచ్చని చెప్తోంది....ఇంక మీ ఇష్టం..పేర్లు
పెట్టకండి మొదటిసారి పాడుతోంది మరి
picosong.com
ఇంగ్లాండ్ పర్యటనలో విరాట్ కోహ్లీ వైఫల్యానికి నన్ను కారణం అనడం తగదు...అనుష్క శర్మ.
అనుష్కా, అతను గెలిచినప్పుడు బేట్ ఎత్తి నీకు చూపించాకే కదా మాకు చూపించాడు..అప్పుడు, ముందర అభిమానులు ఆతర్వాత నేను అని చెప్పావా లేదు పైగా ముసిముసినవ్వులు నవ్వుకున్నావు...
అతను బాగా ఆడినప్పుడు..అనుష్క ఎంకరేజ్ చెయ్యటం వల్లే ఆడాడు అని పేపర్లలో వస్తే నువ్వేమయినా కాదు అన్నావా..హేపీ ఫీలయ్యావు..
అదిగో అప్పుడలాఉంటే..ఇప్పుడిలా ఉండాల్సివస్తుంది మరి...
అతను ఆడుతుంటే విపరీతం గా ఎంకరేజ్ చేసావాలేదా..ఏదో నీకు ఖాళీ లేక ఈ మధ్యన కనిపించడం లేదు గానీ అతని వెనక్కాల నువ్వున్నావనేది ఓపెన్ సీక్రెట్ కదా.
.క్రికెటర్లని పరిణతి చెందిన వ్యక్తులుగా చూడండి అంటున్నావు బానేవుంది....ఇక్కడ అతన్నెవరూ ఏమీ అనలేదు....
కానీ ఒక సెలెబ్రిటీ కి సంబంధింతవరకూ సమాజం ఇలాగే ఉంటుంది...నువ్వు దానికి అలవాటుపడిపో..నీకు బాధ అనిపించినా తప్పదు.
.ఎందుకంటే ఎవరు అవునన్నా కాదన్నా..ఒకసారి సెలబ్రిటీ అయితే ఇంక వాళ్ళకి,ప్రైవేట్ పబ్లిక్ అనే రెండు జీవితాలుండవు...ఇదీ లోకం తీరు..ఇలాగే ఉంటుంది

ఇజ్రాయెల్ చుట్టూ ముస్లిం దేశాలే..పాలస్తీనా,సిరియాలతో ఎప్పటినుండో తగువు
పడుతోంది ఇజ్రాయిల్..ఈ పోరాటం లో ఎప్పటినుండో అమెరికా, ఇజ్రాయెల్ కు
మద్దతిస్తోందనేది అందరికీ తెలిసిన విషయమే..అంతటి మిత్రదేశమైన అమెరికాకు
చెందిన CNN కార్యాలయాన్ని ఇజ్రాయెల్ నేలమట్టం చెయ్యటం..నిజంగా పెద్ద
సాహసమే..
("శ్రీనివాసరావు అవ్వారు " గారి post చూసాకా నాకిలా అనిపించింది)

మీకో చిన్న విషయం చెప్పాలండీ...
నిన్న, నేను ఎర్రగడ్డ రైతుబజార్ కి వెళ్ళాను..ఎప్పుడూ నేనొక్కదాన్నే వెళ్తాననుకోండీ..పొరపాటున కూడా షాపింగ్ కి ,మార్కెట్ కి మావారు రారు...రిస్కెందుకులే అని ఏదో అలా ఒకరికొకరు సహకరించుకుంటామన్నమాట.
సరే కూరలు కొనడం మొదలు పెట్టాను...నా ముందర భార్య,భర్త అనుకుంటా..ఇద్దరూ కలిసి కూరలు తీసుకుంటున్నారు...వాళ్ళమాటల్ని బట్టి గెస్ చేసా..కాకపోతే ఒక ప్లాస్టిక్ కవర్లో వేసుకుంటున్నారు కూరలన్నీ...బహుశా బజార్లోనే కొనుక్కున్నారేమో ఆ కవర్...
ఆ అమ్మాయి..ఖచ్చితంగా నాకంటే ఓ పదేళ్ళు చిన్నదే అయ్యుంటుంది..బాగా తక్కువకి బేరం చేస్తోంది ..భర్త అసహనం గాచూస్తున్నాడు..అమ్మే అతను నిస్సహాయం గా ఉన్నాడు..మొత్తానికి కొన్నారు...20 రూపాయలు చెప్తే 10 రూపాయలకడుగుతున్నారు..
రైతుబజార్లో అంత మార్జిన్ ఉంటే..వాళ్ళు అక్కడ కూరలమ్మరు..శుభ్రంగా ఏ బంజారాహిల్స్ లోనో షాప్ పెట్టుకుంటారు..ఇది నా అభిప్రాయం మాత్రమే నండోయ్.
సరే కొనడం అయిపోయింది..నేను ఆటో పిలుద్దామనుకుంటున్నాను..ఈలోపలే ఆ భార్యాభర్తలిద్దరూ బండికి ఆ కవర్ తగిలించికుని బయల్దేరుతున్నారు..వర్షానికి మొత్తం చాలా బురదగా ఉంది రోడ్...ఈలోపలే కూరల బరువుకి కవర్ చిరిగి అన్నీ కింద పడిపోయాయి..నాకయితే ఉసూరు మనిపించింది...డబ్బులసంగతి పక్కన పెడితే పాపం వాళ్ళ శ్రమ,ఆ కూరలు పనికిరాకుండా పోయాయని
వాళ్లు కొంచెం శ్రద్ధ పెట్టి కాటన్ బేగ్ తెచ్చుకుని ఉంటే బావుండేదనిపించింది....ఎందుకంటేమనచుట్టూ ఉన్న పర్యావరణాన్ని కాపాడినవాళ్ళవుతాం కదా
నేను కూడా అప్పుడప్పుడూ ప్లాస్టిక్ కవర్స్ వాడేస్తుంటానులెండి..నాకూ బాగా జ్ఞానోదయం అయ్యింది
వీలయినంతవరకూ కాటన్ బేగ్స్ వాడటానికి ప్రయత్నిద్దాం
పొద్దున్నే చెప్పిందేంటా అనుకోకండి..ఇ ఈసారికి సర్దుకుపొండి

అసలు, ఏరాష్ట్ర బడ్జెట్ లో అయినా ప్రణాళికేతరవ్యయం ఎందుకు ఎక్కువగా
ఉంటుంది...అంటే ..ఎందుకేనా మంచిదని ఎక్కువ amount చెప్తారా..అదికూడా
ప్రణాళికా వ్యయం కంటే ఎక్కువ గా ఉంటుంది...
రాష్ట్ర ఆదాయం అనూహ్యం గా పెరిగే అవకాశం ఉన్నా.. అంటే 100% పెరిగితే తప్ప ఈ లోటు పూడదు..ఎంత పన్నులు పెంచినా..ఆదాయం కోసం ప్రభుత్వ భూములు అమ్మినా కూడా ఇంత డబ్బు సమకూర్చడం జరుగుతుందా...కేంద్రం సాయం అనేమాట పక్కనపెడితే ఇది ఎంతవరకూ కరెక్ట్ అనేది నాకు తెలీదు.
క్రితం సంవత్సరం 1,00.637 కోట్లు.. బడ్జెట్ అయితే అందులో ప్రణాళికా వ్యయం...48,648.47 కోట్లు
ప్రణాళికేతర వ్యయం 51,648.47 కోట్లు
ఈ సంవత్సరం 1,15,689.19 కోట్లు అయితే
అందులో ప్రణాళికా వ్యయం 52,383.19 కోట్లు
ప్రణాళికేతర వ్యయం 63,306..00 కోట్లు
పోనీ ప్రకృతి వైపరిత్యాలు,అనుకోని కష్టాలు ఉంటాయికదా అనచ్చు..దానిని ప్రణాళికేతర వ్యయం లో చూపిస్తారోలేదో నాకు తెలీదు...ఒకవేళ చూపిస్తే అప్పుడది కేంద్ర సాయం లోకొస్తుందా రాదా...
నాకిది ముందుజాగ్రత్తలా అనిపించడం లేదు...ఖర్చులు పెంచుకుని పన్నులు పెంచడం కరెక్టా...సరే భూములమ్మేస్తాం...మరిnext బడ్జెట్ లో కూడా ఇలాగే ఉంటే అప్పుడింకేం అమ్ముతాం
300 ఎకరాలున్నవాడు ఖర్చులు పెరిగాయి ..సరిపోవడం లేదని ఒక ఎకరం అమ్మితే 299 ఎకరాలు మాత్రం సరిపోతాయా... ఖర్చులు తగ్గనప్పుడు..అంచేత అమ్ముకోవడం మాత్రమే మిగులుతుంది..మన బడ్జెట్ ని తగ్గించలేనప్పుడు ఆదాయం పెరిగే మార్గం చూసుకోవాలి.
ఇదెలా ఉందంటే suppose నాకు ఒక లక్షరూపాయలు నెలకు ఆదాయం ఉంది కానీ నా ఖర్చులు 2 లక్షలున్నాయి అన్నట్టే

A Short Story by Vydehi......
జానకీ..జానకీ ...అబ్బా, ఆ ఫేస్ బుక్ వదిలి నా సెల్ ఫోన్ ఎక్కడుందో చూడు టైం అవుతోంది ఆఫీస్ కి..
అబ్బా.. ఆ సిగరెట్ కాలుస్తూ బాల్కనీలో పెట్టుంటారు చూడండీ..కూర్చున్న చోటనుండి లేవకుండానే చెప్పింది జానకి..
జానకి భర్త శ్రీరాం ..చిన్న సాఫ్ట్ వేర్ కంపెనీ ఉంది అతనికి..వీళ్ళిద్దరికీ ఇద్దరు పిల్లలు..బాబూ,పాప...ముచ్చటయిన సంసారం..
జానకీ, ఫోన్ దొరికింది కానీ.. ఏంటలా నన్ను పట్టించుకోకుండా మరీ చూస్తున్నావ్ ఏముందేంటి అక్కడ..అడిగాడు శ్రీరాం లోపలికి వస్తూ..
ఏవండీ ఇలారండీ ఒకసారి ...ఇతని పేరు ఋషి ..స్నేహం గురించి ఎంతబాగా రాశాడో చూడండి కవిత..
సరేలే, నాకలాంటివాటిని చూసి చదివే ఖాళీ ఉండదని తెలుసుగా, నువ్వే చదివి చెప్దువు గానిలే సాయంత్రం..అంటూ ఆఫీస్ కి వెళ్లాడు శ్రీరాం
అతన్ని పంపించి వచ్చి ..ఋషి కవితకి ఒక లైక్ కొట్టి కామెంట్ పెట్టింది..ఋషి inbox లోకొచ్చి thanks చెప్పాడు..
మెల్లగా స్నేహం మొదలయ్యింది...జానకి డిగ్రీ చేసి ఇంట్లోనే ఉంటోంది..ఋషి MSc Computers చేసాడు..కానీ జాబ్ లేదు..కొద్దిగా English లో మాట్లాడ్డానికి భయపడతాడు..వాళ్ళ నాన్న వేణుగోపాలస్వామి గుళ్ళో పూజారి అని,ఒక చెల్లి ఉంది,, తను Inter చదువుతోందని...సంగీతం అంటే మహా ఇష్టం అనీ ఇలా అతని వివరాలన్నీ చెప్పాడు..అతనికి అమెరికా కూడా వెళ్ళాలని కోరిక..హైదరాబాద్ లో వాళ్ళ మేనమామ ఇంట్లో ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పాడు.
స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ లో జాయిన్ అవ్వచ్చుకదా చెప్పింది జానకి..కొంచెం ఫీజ్ ఎక్కువ ఉంది..పైగా ముందర ఉద్యోగం చూసుకుని తర్వాత నేర్చుకుంటాను చెప్పాడు ఋషి.
అతనికి హైదరాబాద్ లో స్నేహితులు పెద్దగాలేరని అర్ధమయ్యింది జానకి కి.
ఒకపని చెయ్యండి, రామకృష్ణ మఠం వాళ్ళు కొద్దిగా తక్కువ ఖర్చులోనే నేర్పుతారు కానీ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు..ఒక మూణ్ణెల్లలో అయిపోతుంది ..ఈలోపల అప్పుడప్పుడు నాతో English లోనే చాట్ చేస్తూ ఉండండి అని చెప్పింది జానకి.
జానకి తన ఫొటో పెట్టలేదు ఫేస్ బుక్ లో ....News papers లో ఫేస్ బుక్ గురించి వచ్చే వార్తలు చదివి కొంచెం భయపడింది.
కానీ ఋషి ఎప్పుడూ ఆ ప్రస్తావన తేలేదు..జానకి వివరాలు కూడా ఎప్పుడూ అడగలేదు..అందుకే జానకి కి అతని స్నేహం నచ్చింది..
రోజులు గడుస్తున్నాయి...ఋషి Spoken English Class లో జాయిన్ అవడం జానకితో English లోనే చాట్ చెయ్యడం అన్నీ జరుగుతున్నాయి.
ఓరోజు జానకి పిన్ని, జానకి కి ఫోన్ చెసింది.. వాళ్ళబ్బాయికేదన్నా ఉద్యోగం చూడమని...సరే అంది జానకి...భర్త తో చెప్పింది,పిన్నికొడుకు ఉద్యోగం గురించి..శ్రీరాం మూడురోజుల తర్వాత వాళ్ళ Friend కంపెనీ Email ID ఇచ్చి Resume పంపమని మీ పిన్నికొడుక్కి చెప్పు..కనీసం ఈ జాబ్ అయినా సరిగ్గా చెయ్యమను అన్నాడు ...నవ్వింది జానకి...ఎందుకంటే శ్రీరాం నిజంగానే జానకి పిన్నికొడుక్కి ఉద్యోగం ఇప్పించడం మూడోసారి...పిన్నత్తగారి బాధచూడలేక
జానకి శ్రీరాం చెప్పిన Email ID నోట్ చేసుకుంది...చాలాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చింది...
ఋషికి ఆ Email ID ఇచ్చి apply చెయ్యమంది..అతను ముందు కంగారుపడ్డాడు..తనే ధైర్యం చెప్పింది...
ఋషి, జానకి చెప్పినట్టు చేసాడు...సాయంత్రం శ్రీరాం వచ్చాడు..ఏంటీ మీ పిన్నికొడుకు apply చేసాడా అని ఆడిగాడు..చేసాడని చెప్పింది జానకి..
రెండు రోజుల తర్వాత జానకి inbox లోకి ఋషి నుండి మెసేజ్ వచ్చింది ..మీరు చెప్పిన చోటే నాకు జాబ్ వచ్చింది అంటూ ..నేనొక పాట పాడాను..ప్లీజ్ వినండి...మీ అభిప్రాయం కూడా చెప్పండీ అని..అది ఒక పాట లింక్..జానకి ఆ లింక్ open చేసింది..ఒక్క క్షణం తర్వాత పాట మొదలయ్యింది...
"మెరిసే తారలదేరూపం...విరిసే పువ్వులదేరూపం...అది నాకంటికి శూన్యం
మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఏరూపం
నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం..నీ రూపం..అపురూపం".."సిరివెన్నెల" సినిమాలో పాట...
పాట అయిపోయింది..ఇంతలో పాట చాలాబాగా పాడాడోయ్ నీ శిష్యుడు అంటున్న మాటలు విని వెనక్కి చూసింది జానకి ..గుమ్మంలో శ్రీరాం...ఆనందం తో శ్రీరాం ని బంధించేసింది జానకి.
(ఎందుకంటే ... ఋషికి apply చెయ్యమని చెప్పినరోజు రాత్రే శ్రీరాం కి మొత్తం విషయం చెప్పింది జానకి..అంతా విని నువ్వేం చేసినా నాకు ఇష్టమేనని శ్రీరాం కూడా అన్నాడు కాబట్టి)
.............End..........................

ప్రజాప్రతినిధుల జీతాలు భారీగా పెంపు,జెడ్పీ చైర్ పర్సన్ కు నెలకు 7,500 నుంచి లక్షరూపాయలకు పెంపు-సాక్షి
స్థానిక ప్రజాప్రతినిధుల వేతనం పెంపు జెడ్పీ చైర్ పర్సన్ కి 7,500 నుండి 1,00,1000.మేయర్ కి 50,000--ఈనాడు.
నేను, ముందర ఈవార్తలు చూడగానే 7,500 కాదేమో 75,000 అయ్యుంటుంది..ఓ సున్నా పడలేదేమో అనుకున్నా..
రెండు వాచీలు ఒకే టైం చూపించవు అంటారు కాబట్టి,
రెండుపేపర్లు ఒకే తప్పు చెయ్యవని బలం గా నమ్ముతున్నాను.
ఇంతవరకూ ఏ ప్రభుత్వం కూడా ఇంతలా జీతాలు పెంచలేదు అనేది వాస్తవం.. సర్పంచ్ లకీ పెంచారు కానీ మామూలుగానే పెంచారు...ఏదయినా KCR నిర్ణయం ఊహించనిది..
ఈ విధంగా ముందుకుపోవాలని డిసైడ్ చేసారన్నమాట.
బహుశా KCR ఈవిషయం లో సాఫ్ట్ వేర్ కంపెనీ లని ఆదర్శం గా తీసుకున్నట్టున్నారు.
ఏంటో తెలంగాణా లో మేయరో,జెడ్పీ చేర్మనో అయినా బావుండేదని నాతో సహా ఎంతమంది అనుకుంటున్నారో పాపం..
వస్తూనే పేకాట క్లబ్బులొద్దన్నారు .ఉద్యోగులకి ఫిట్మెంట్ ఇచ్చారు.ఇప్పుడిలా ..
ఏదేమయినా మీ స్టయిలే వేరు మాష్టారూ..
Good Morning to KCR

ప్రతీ సెకన్ ని పట్టించుకుంటూ..చాలా జాగ్రత్తగా ఉంటూ..మంచి బిజినెస్ మైండ్ ఉన్నవాడు ప్రేమిస్తే..
.........................................
ప్రియమైన నీకు...
నేను నిన్ను జనవరి 2, 2015 న ఉదయం 7:45 నిమిషాలకి పంజాగుట్ట సాయిబాబా గుళ్ళో చూసాను..నీకుభక్తి మరీ ఎక్కువనుకుంటా..ప్రదక్షిణాలమీద ప్రదక్షిణాలు చేసి నువ్వు బయటికొచ్చేసరికి టైం కాస్తా 9:30..అయినా నా విలువైన టైం ని వేస్ట్ చేసుకుని ఉన్నానంటే కారణం నువ్వు అందంగా ఉండటం ఒకటైతే ..నాకిష్టమైన లంగా ఓణీ వేసుకు రావడం మరొకటి.సరే నాకు ఆఫీస్ కి టైం అయ్యిందని నేను వెళిపోయాననుకో .
మళ్ళీ నువ్వు వారం రోజులకి అంటే జనవరి 9 సాయంత్రం 5:20 కి "బిగ్ సినిమాస్"దగ్గర కనిపించావు..అప్పుడూ బానే ఉన్నావనుకో ..నేనే వెంటనే, నీ దగ్గరకొచ్చి మాట్లాడదామనుకుంటే ..నువ్వెవరో కోన్ కిస్కాతో మాట్లాడుతున్నావ్(of course ..నేను తప్ప ఎవరున్నా నీతో, నాకలాగే అనిపిస్తుంది ఆ టైం లో )
సరే అక్కడికొచ్చి ,నా హీరోయిజం ప్రదర్శించి ,అతన్ని బాధపెట్టి నా విలువైన టైం వేస్ట్ చేసుకుంటూ నిన్నూ,నీ సోదిని భరించడం కష్టమనిపించి wait చేసాను
ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి తింటూ 70 కేజీలున్న నేను ఇంకోరెండు కేజీలు పెరిగాను.
సరే మొత్తానికి నిన్ను ఫాలో అయి జాగ్రత్తగా మీ ఇంటిముందు ఐరన్ చేసేవాడి దగ్గర details కనుక్కుని నీకీ ఉత్తరం రాస్తున్నా...
నేను నిన్ను ప్రేమిస్తున్నాను..ఏం చూసి అని అడక్కు..ఎవడయినా ముందర అందమే చూస్తాడు..అది నీకు కావల్సినంత ఉంది..
నేను సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నా..అన్నీ పోను చేతికి లక్షరూపాయలు వస్తాయి..మార్కెట్ లో నాకు దగ్గరదగ్గర ఓ 50 లక్షలు కట్నం వచ్చే అవకాశం ఉందని టాక్..నువ్వంత ఇవ్వక్కరలేదు ఓ 49 లక్షలు చూసుకో చాలు..
కానీ ముందర నన్నో మూణ్ణెళ్ళు ప్రేమించాలి..ఎందుకంటే నేను కట్నానికి,నీ అందానికి పడిపోయానని గానీ ,నువ్వు నా ఉద్యోగానికి పడిపోయావని గానీ ప్రజలు అనుకోకూడదు...ఈ మూణ్ణెళ్ళ టైంలో నేను నిన్ను ముద్దులు మాత్రమే పెట్టుకుంటాను అదీ అప్పుడప్పుడు..ఎందుకంటే నా టైం వేస్ట్ అవకూడదు కదా..నీకిష్టం లేకపోతే తిరిగి ఇచ్చెయ్యచ్చు వాటిని..
ఒకరకంగా నీకూ,నాకూ "probation for a period " అనుకో ..మూణ్ణెల్ల తర్వాత నిన్ను పర్మనెంట్ చేస్తాను...అదే పెళ్ళి చేసుకుంటాను..తర్వాత నీకు..ప్రమోషన్లు,అవీ ఇవీ ఉంటాయనుకో..
నీకు నా బంపర్ ఆఫర్స్ నచ్చితే నువ్వు అప్లై చెయ్యచ్చు అదే నువ్వుకూడా ఒక లెటర్ రాసి పంపించు..లేదంటే నేను మళ్ళీ సాయిబాబా గుడికి వెళ్తాను.
Best regards
నీ ప్రేమికుడు
.....
ఈ post Santosh Patnaik రాసిన ఒక post చూసి సరదాగా రాసాను...కాపీ చెయ్యలేదు..ఉపయోగించుకున్నాను అంతే.
ముందరే చెప్తున్నా ...సరదాగా తీసుకోండి

కోడిపందాలపేరుతో కోళ్లని హింసించద్దు..గుత్తా జ్వాల
ఓకే..కానీ ఇవాళే ఎందుకు చెప్తున్నావు..
ఇప్పుడెక్కడైనా కోడిపందాలు జరుగుతున్నాయా..నాకు తెలీదు మరి అందుకే అడుగుతున్నాను,ఫీలవకు అడిగానని..
మామూలుగా అయితే కోడిపందాలు సంక్రాంతికి జరుగుతాయి..అప్పుడు చెప్తే నీకు,నీ ప్రకటనలకి మంచి పబ్లిసిటీ వచ్చేది..ప్రజలు కూడా కాస్త ఆలోచిస్తారేమో..
ఈ PETA వాళ్ళు ప్రజలు ఎక్కడ, జ్వాలని మర్చిపోతారో అని బాగానే గుర్తుచేస్తున్నారు.. జ్వాలా మొహానికి మాత్రం రక్తం మరకలంటకుండా బాగానే మేనేజ్ చేసావు అయ్యో అదే బాగానే ఉన్నావు..
ఇంతకీ నువ్వు వెజిటేరియన్నా,నాన్ వెజిటేరియన్నా..చెప్పనేలేదూ

To kejriwal Sir
మీమానాన మీరు వైద్యం చేయించుకుందుకువెళ్ళినా, మీ వ్యతిరేకులు అదేదో మహాతప్పు కిందా మాట్లాడుతున్నారు..ఢిల్లీ ముఖ్యమంత్రి అయినదగ్గరనుండి అస్సలు ఓర్చుకోలేకపోతున్నారు..ఓ బాధపడిపోతున్నారు..నాకు తెలిసి మోడీగారు కూడా ఇంతలా ఫీలవలేదనుకుంటా..
అయినా మీరెందుకు ఆ మూడు సీట్లు వాళ్ళకి వదిలారు..చూడండీ ..ఆ మూడు సీట్లే ముప్ఫై సీట్లు కిందా అనుకుంటున్నట్టున్నారూ..ఊరికే విమర్శిస్తున్నారు.. నెగ్గిన బీజేపీ అభ్యర్ధులు కాస్తా ఒక డ్రైవర్ ని పెట్టుకుని ముగ్గురూ ఒక కారు లోఢిల్లీ అసెంబ్లీకి వచ్చివెళిపోవచ్చు..కాస్త ఖర్చేనా తగ్గుతుంది .
ఇప్పుడు బీజేపీ ఉంది కాబట్టి ఆ ఢిల్లీ సీట్ మాత్రం వేరేవాళ్ళకెందుకు దక్కాలి అని..ఇప్పుడు మాట్లాడుతున్నవాళ్లు మీరు మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడలేదే...ఎందుకంటే అప్పుడు కేంద్రం లో ఉన్నది కాంగ్రెస్ కదా..అందుకని..ఆల్రెడీ ఉన్నకోపం అంతా కాంగ్రెస్ మీద చూపించారు...మిమ్మల్ని అనడం మర్చిపోయారు..
ఏవేవో వార్తలు చూసి,చదివి వ్యక్తిగత విమర్శలకు కూడా సిద్ధం అవుతున్నారు..మీరేం పట్టించుకోకండీ..మీపని మీరు చేసుకోండి...మహామహావాళ్ళకే..మన్ మోహన్ సింగ్ లాంటివారికే తప్పలేదు...
ఈ post ...
శ్రీనివాసరావు అవ్వారు గారికి ,జనసేవాసమితి గారికి,రామరాజు కలిదిండి గారికి..అంకితం

15, ఏప్రిల్ 2015, బుధవారం
పొద్దున్నే ఓ Good Morning పోస్ట్ ..తర్వాత ఆరోజు ని, ఏ దేవుడి
రోజనుకుంటామో ఆ దేవుడి ఫొటో తోపాటు పోస్ట్.వెంటనే break fastకి
సంబంధించీ..ఇడ్లీ,దోశ,పూరీ ఆ మర్చిపోయాను.. పెసరట్టు ఉప్మా ఇలాంటివాటి
ఫొటోస్ తో ఉన్న ఒకపోస్ట్..ఇవన్నీ చూస్తుంటే మధ్యలో AP తెలంగాణా,కేంద్రానికి
సంబంధించినవార్తలు కొన్ని..అక్కడక్కడ,పులులు,పిల్లులు,గులాబీలు..కూడా
కనపడుతున్నాయి...నిజంగా ఇంత శ్రద్ధగా పోస్ట్లు పెట్టేవాళ్ళకి
వందనాలు...ఎందుకంటే..ఇవేమీ నాకులేవు..కనీసం నేర్చుకోవాలని కూడా ఉండట్లేదు
ఎందుకంటే..ఆ ఎలాగూ, ఎవరోఒకరు ఈ శ్రమ పడుతున్నారుకదా..అని కావచ్చు..సహజంగానే నాకూ ఆసక్తి తక్కువనేది కూడా ఒకకారణం అవ్వచ్చు.
కానీ సాక్షిపేపర్ కి నాకులేని మంచిలక్షణాలు చాలా ఉన్నాయి..అదేంటంటే ఆల్రెడీ వర్షాలు లేవని తెలుసు..ఎండాకాలం అంటే ఎండ ఎక్కువ ఉంటుందనీ తెలుసు.భూగర్భ జలాలు ఇంకిపోయాయనీ తెలుసు...నీటి కష్టాలు ఉంటాయనీ తెలుసు...నేను తెలంగాణా గురించి మాట్లాడుతున్నానండి...ఈ సమస్య గురించి రాస్తూ ఓ ఫొటో కూడా పెట్టింది..దయచేసి ఎవరయినా ఆ ఫొటో చూస్తే కనుక తెలంగాణా లో ఆ ఫొటో ఉన్న ప్రాంతం ఎక్కడుందో చెప్పండి..నాకయితే తెలీదు..తెలుసుకుందామని మాత్రమే అడుగుతున్నాను...అంతకుమించి వేరే ఏమీ కాదు

సిన్సియర్ గా ఉండే ఆఫీసర్స్ కి నాదొక చిన్న మనవి..
మీ మనస్సాక్షికి సమాధానం చెప్పుకోవడానికో,మీ నిజాయితీ ని నిలబెట్టుకోవడం కోసమో..సమాజం పట్ల మీకున్న భాద్యతని తెలియచెయ్యడం కోసమో, తీసుకునే జీతానికి న్యాయం చెయ్యడం కోసమో, మీ ప్రాణాలని సైతం లెక్కచెయ్యకుండా పోరాడకండి..ఎందుకంటే మేము అంటే ప్రజలు..మీకేదయినా కష్టం వచ్చి, మీరంతట మీరే ప్రాణం తీసుకున్నా,వేరేవిధంగా ప్రాణం పోయినా కూడ కొద్ది రోజుల్లో మర్చి,పోతాం..
ప్రతీ సంవత్సరం ఆరోజుని, గుర్తుచేసుకుని మీ బొమ్మకి దండేస్తాం అంతే...లేదంటే కనిపించే దేవుళ్ళు అని ఓ ముక్క అంటాం అంతే..
అంతేగానీ పోరాడితే పోయేదేముంది బానిస సంకెళ్ళనుండి విముక్తి తప్ప అనుకోవద్దు..సంకెళ్ళ మాట దేవుడెరుగు..మీరే పోయేటట్టున్నారు...
నేనీమాట మామూలుగా రాయడం లేదు..2011 లో మహారాష్ట్ర లో యస్వంత్ అనే అడిషనల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ని సజీవదహనం చేసేసారు..ఎందుకంటే అక్రమంగా నిల్వ ఉంచిన కిరోసిన్,పెట్రోల్ ని బయటకు తీసారని ...ఇతనికి 42 యేళ్ళే.
మధ్యప్రదేశ్ లో అయితే గనుల అక్రమరవాణా చేస్తున్నవాళ్లని అడ్డుకున్నందుకు గాను ట్రాక్టర్స్ తో తొక్కించి చంపేసారు ఒక IPS ఆఫీసర్ని.
బీహార్ లో, ఒక రాజకీయనాయకుడు 1994 లో ఆంధ్రప్రదేశ్ కి చెందిన బీహార్ కేడర్ IAS ఆఫీసర్ కృష్ణయ్య ని కాల్చి మరీ చంపించారు.
ఇవి నాకు గుర్తున్నవి మాత్రమే...వెలుగులోకి రానివి ఎన్నో తెలీదు.
పెద్ద స్థాయి అధికారుల పరిస్థితి ఇలా ఉంటే నిజాయితీగా ఉండే చిన్న స్థాయి వాళ్ళ గురించి ఏం చెప్పాలి.
హంసలా బతకండీ..కాకిలా కలకాలం కాదు అనే చచ్చుపుచ్చు మాటలన్నా అవి వినద్దు...
మీరు ఏపోరాటం చేసినా పూర్తిగా ప్రజల మద్దతు తో చెయ్యండి,ప్రజల రక్షణ కూడగట్టుకోండి..మీకోసం ప్రజలు తిరగబడేలా చెయ్యండి...లేదంటే..మీరు జీతం తీసుకుంటున్నారు..జీతానికి తగ్గ పనిచేసుకుని హేపీగా ఇంటికెళ్ళి..రోజువారీ జీవితం జీవించండి.

ఉదయం 5 గంటలు దాటింది..ఇంతకుముందు అలారం కొట్టినా లేచేవాడ్నికాదు..అటూ ఇటూ
చేసి 5: 45 దాకా నిద్రపోయి ..అమ్మో ఆరవుతోంది అని అప్పుడు వాకింగ్ కి
వెళ్లేవాడ్ని...కానీ ఇవాళ అలాకాదు. ఎందుకంటే నిన్ననే వాకింగ్ కి వెళ్తూ ఒక
అమ్మాయిని చూశా..ఆ విశేషాలు మీకు వాకింగ్ చేస్తూ చెప్తాను...
ఇదివరకు రోజులయితే ,తెల్లవారుఝామున లేచి గుమ్మంలో ముగ్గులు పెట్టుకునేవారు...రాజమండ్రి లోనూ అంతే.కానీ రోజులు మారాకా అన్నిచోట్లలాగే ఇక్కడ కూడా మార్పులు వచ్చేసాయి..
అందుకే ఉదయం బయట మార్కెట్ కి వెళ్ళేవాళ్ళు,పనులకి వెళ్ళేవాళ్ళు,వాకింగ్ చేసేవాళ్ళు ఇలా కొంతమంది కనిపిస్తారు..
అలాంటిది నిన్ననే నా కళ్ళకి ఒక వెలుగు..నాకాళ్ళకి ఓదారి కనిపించాయి..
మా ఇల్లుదాటాకా,మూడోవీధి జానకమ్మగారింటిదగ్గర ఒక అమ్మాయి.. అదీ ముగ్గు వేస్తూ...ఎంతబావుందంటే...కళ్ళకి కాటుక పెట్టుకున్నట్టుంది..కొద్దిగా చెంపలమీద అంటింది,చిన్నబొట్టు,పెద్ద జడ.
ఆ జడకాస్తా ఆ అమ్మాయి నడుఒంపులో ఇరుక్కుందనుకోండీ అయినా బావుంది..మరి నాచూపుకూడా అక్కడే ఇరుక్కుపోయిందికదా.పరికిణీ ఓణీ వేసుకుంది...అదింకా బావుంది....
ఏదోపాట పాడుతోంది దగ్గరగా వెళ్ళాకా వినిపించింది..."తొలిజన్మలనోముకీ దొరనవ్వులసామికీ...." ఏ సినిమా అనుకుంటుంటే గుర్తొచ్చింది ..ఆ... ముద్దమందారం సినిమాలోది 'అలివేణీ ఆణిముత్యమా ' అనేపాట...
నన్ను చూసి కొద్దిగా వాల్యూం తగ్గించింది...ఈలోపల వాళ్ళింట్లోనుండి పెద్ద వాల్యూం తో మనోజ్ఞా ఇంకా ఎంతసేపు, పెట్టిన ముగ్గు చాలు, కాఫీ తాగుదుగానీ రా లోపలకి అంటూ...ఆ అమ్మాయి నన్నొకసారి చూసింది నాకయితే నవ్విందనిపించింది..లోపలకి వెళ్ళిపోయింది..నా మనసుకూడా ఆ అమ్మాయితో వెళిపోయింది...
............................................................
అమ్మో మూడోవీధి దగ్గరకొచ్చేసాను..ఇవాళ కనపడుతుందోలేదో...కనపడాలని నాతోపాటు మీరు కూడా కోరుకోండి
ఇంతకూ నాపేరు చెప్పలేదు కదూ..నాపేరు "నవీన్"

కేవలం మోహన్ బాబు నటన చూడటానికే, నేను దేవత సినిమా చూస్తాను ఇప్పటికీ...ఈ సినిమా లో నిర్మల మోహన్ బాబు mother.ఇలా అంటుంది...
ఒరేయ్ ఆ గాలి తిరుగుళ్ళుమానేసి..ఈ కొంపా-గోడు,చెట్టూ--చేమ,పొలం-పుట్రా అన్నీ దగ్గరుండి చూసుకోవచ్చుకదరా అయ్యా అంటుంది..
వెంటనే మోహన్ బాబు..అమ్మ..కొంప నాకు,గోడు నీకు,చెట్టూ నాకూ చేమ నీకు,పొలం నాకు..పుట్ర నీకు అంటూ భలే వెరైటీగా చెప్తాడు.
విలక్షణ నటుడు....అతని విశ్వరూపం... నటన లో ఎలాఉంటుందో చూడాలంటే "ఎం.ధర్మరాజు ఎం.ఏ" సినిమా చూసినవాళ్లకు అర్ధమవుతుంది....
నాకు మోహన్ బాబు డైలాగ్స్ అంటే చాలా ఇష్టం.అంతేకాదు అతను విలన్ గా చేస్తే మరీ ఇష్టం....ఇవాళ అతని పుట్టినరోజు...500 సినిమాలకు పైగా నటించిన మోహన్ బాబు కి జన్మదిన శుభాకాంక్షలు

ఊరికే టెన్షన్ పడకండి..మనవాళ్ళు గెలుస్తారు ..
ముందర 300 పరుగులు పైనే చేస్తారు..ఒక బేట్ ఇచ్చి ఒక బాల్ ని కొట్టడం అంతే కదా..ఒక్కడే వచ్చి వేస్తాడు ఆ బాల్ కూడా, ఇదేవన్నా పెద్ద పనా...అంచేత ఏం కంగారవసరంలేదు...
మళ్ళీ చెప్తున్నా ఆడేదీ మనమే,గెలిచేదీ మనమే..
అది జింబాబ్వే అయినా..బంగ్లాదేశ్ అయినా..పాకిస్తాన్ అయినా...
మన టీం మీద నాకు నమ్మకం ఉంది..మీరు కూడా ఉంచండి...
డియర్ టీం మెంబర్స్ మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకండి..మీకు నచ్చినట్టు ఆడండి..వచ్చినట్టు బాల్ వెయ్యండి.చాలు గెలుపు మనదే..
ఇంతవరకూ వచ్చాకా ఎలా ఆడాలో సలహాలిస్తే అంతకంటే తెలివితక్కువ మాటలు ఉండవు.
..............................
All the Best To The Team INDIA...
ఎప్పుడూ మీవెనకాలే ఉండే ...వైదేహి

ఉగాది అనగానే కొత్తపంచాగం గుర్తొస్తుంది..అందుకే...పంచాగం లో కన్యారాసి,
ఉత్తరఫల్గుణి నక్షత్రం ,మూడవపాదానికి జాతకం రాసేవారు జాగ్రత్తగా,శ్రద్ధగా
రాయండి...
ఆదాయం 14..వ్యయం 0 అని
రాజపూజ్యం 6..అవమానం 0 అని
రాయటం వీలయితే రాయండి..నేనేం నాగురించి అడగట్లేదు..మీరు రాసేది లక్ష్మీ దేవి,అర్జునుడు పుట్టిన నక్షత్రానికి అని మర్చిపోతారేమోనని గుర్తుచేస్తున్నా అంతే.
అంటే ..మీరేదో ఆ ముఖ్యమంత్రికీ, ఈ ముఖ్యమంత్రికీ,గుళ్ళలో,ఆధ్యాత్మిక కేంద్రాల్లో..పంచాంగ శ్రవణానికి ..అదే చెప్పడానికి వెళ్ళే హడావుడిలో ఉంటారని ఓ ముక్క మీ చెవిలో వేస్తున్నా
వర్షాలు బాగా కురుస్తాయని..కష్టాలు,నేరాలు ఉండవని...తప్పకుండా రాయండి...కాస్త హేపీగా పండగ చేసుకుంటాం..

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత జగన్ కి ...
అసెంబ్లీ టైం ని వేస్ట్ చేస్తూ..గొడవలు పడుతూ వ్యక్తిగత విమర్శలకే స్థానం ఇస్తున్న్నప్పుడు..ఒకసారి మీ ఆలోచన మార్చుకోవాలని మీకనిపించడం లేదా...
మీరు మాట్లాడుతున్న ప్రతిసారీ, కేసులు,జైల్ జీవితం గుర్తుకు రావడాన్ని ఎవరూ తప్పు
పట్టలేరు..ఎందుకంటే చరిత్ర ని ఎవరూ మార్చలేరు...
అందుకే, నిజంగా పార్టీ మనుగడ మీద దృష్టి పెట్టాలనుకున్నా,బలమైన ప్రతిపక్షం అని నిరూపించుకోవాలన్నా..నిజంగా సమస్యలపై పోరాడాలనుకున్నా ముందర పార్టీ అధ్యక్ష పదవి నుండి తప్పుకుని..ఎవరైనా ప్రజల్లో మంచిపేరున్న మీ వ్యక్తి కి అప్పచెప్పి..మీమీదున్న అన్ని కేసులకు సంబంధించి మీరే ముందరికి వెళ్ళి...పరిష్కార మార్గం వెతుక్కోండి..
ఎందుకంటే మీకు కూడా ఓట్లేసి నెగ్గించిన ప్రజలకు సమాధానం చెప్పాల్సిన భాద్యత మీకుంది కాబట్టి.
తెలంగాణా లో పార్టీ వ్యవహారాలను షర్మిళకు అప్పజెప్పి,Sakshi పేపర్ ని భారతి కి అప్పజెప్పిన మీకు, ఏ జ్యోతుల నెహ్రూలాంటి వ్యక్తికో మీ వ్యవహారాలు,మీ పదవి అప్పజెప్పడం వల్ల జరిగే నష్టం ఏమీ ఉండదు...
ఎందుకంటే ఏ రాజకీయపార్టీకీ అసమర్ధత అడ్డుగా ఉండకూడదు..ప్రజారాజ్యం పరిస్థితి చూసారు కదా..
కొత్తగా ఏర్పడిన ఒక రాష్ట్రం ఇలా వెనక్కీ,ముందుకూ వెళ్తూ ఉండకూడదు, పైగా ప్రజలు అయోమయానికి గురి కాకూడదు...
కుదరదూ.. నా ఎం ఎల్ ఎ లున్నారూ,నావాళ్ళున్నారు అనుకుంటే రాజకీయాల్లో ఎంతమంది స్థిరంగా ఒకపార్టీనే నమ్ముకుని ఉన్నారు అనేది నేను చెప్పక్కరకేదు..
ఒక్కసారి అసంతృప్తి మొదలయితే...ఏంజరుగుతుందో నాకంటే మీకే బాగా తెలుసు
.............................................................
నేను పైన రాసిన post లో "తుమ్మల కిరణ్ "రాసిన ఒక్ కామెంట్ లోని మాటల్ని ఉపయోగించాను..
Thanks to Kiran Tummala

అసలీ మావిడిచెట్లు,వేపచెట్లు ఉన్నవాళ్ళకి ఈ తెలివితేటలేంటండీ..ఆ... ప్రహారీ ఎత్తుగా కట్టిస్తారు..
అస్తమానూ వచ్చి చూసుకుంటూ ఉంటారు..రేపు పండగ కదా , ఇంట్లో పనులేవన్నా ఉంటే చూసుకోచ్చుగా..బొత్తిగా ఇరుగు పొరుగు అంటే జాలి లేదు సుమా...
ఏదో డిటెక్టివ్స్ లాగా చెక్ చేసుకుంటూ ఉంటే ,ఎలా కోసుకుంటామండీ,
ఆ ..కాస్త పట్టూ విడుపూ ఉండాలికదా...
అసలు గోడ ఎక్కి కొయ్యడం అంటే ఎంత కష్టమో తెలుసా అని వీళ్ళకి..
ఇప్పుడూ.. స్టూల్ తెచ్చుకోవాలి,సౌండ్ రాకుండా ఎక్కాలి,నెమ్మదిగా కొయ్యాలి...పైగా చెట్టు మీదుండే దుమ్ము కి తుమ్ములు రాకుండా ఆపుకోవాలి...
ఇవన్నీ దృష్టిలోపెట్టుకుని
కోతులేవన్నా వచ్చి కోసాయేమోనని అనుకోవాలి..సరిపెట్టుకోవాలి...అంతేగానీ మీవన్నీ కోతి బుద్ధులే అంటే, కోతులు ఫీలవ్వవా....
అయినా పొద్దున్నే పచ్చడిచేసి వాళ్ళకీ ఇస్తాం గా...కావాలంటే..
మొహమాటానికి వెళ్ళి మేమూ చేసుకున్నాం, వద్దంటే మానేస్తాం గానీ.
అంచేత చెట్లున్నవాళ్ళు..మనం కాబట్టి వీళ్ళకీ అవకాశం ఇస్తున్నాం అని గర్వం గా అనుకోండి.
.................................................
అందరికీ మన్మధ(ఏవిటో ఈ పేరు భలే వెరైటీగా ఉంది)నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండీ
వైదేహి

ఏవిటో నేను "గోవిందుడు అందరివాడేలే "సినిమా చూస్తున్నాను...సినిమా బావుంది అంటే బానేవుంది...హీరోయిన్ వచ్చినప్పుడల్లా బావుంటోంది..
ఒక్కోసారి అర్ధమవ్వట్లేదు..సినిమా నిండా రంగులెక్కువగా ఉన్నాయి..అందరూ పెద్ద పెద్ద బొట్లు పెట్టుకున్నారు..బాగా పసుపు రంగు రాసుకున్నారు..సినిమా అంతా అలాగే ఉంటారేమో మరి..
మొత్తానికి ఈ సినిమా, పల్లెటూర్లో హాస్పిటల్ పెట్టడం వల్ల లాభాలు,నష్టాలు .. గురించనే విషయం ఇప్పటికర్ధమయ్యింది నాకు..
మీరంతా తెలివైనవాళ్ళు కాబట్టి మీకు ముందరే అర్ధమయిపోయుంటుంది...ఇందాకటిదాకా కర్రసాము చేసారు..బావుంది ఇప్పుడు చెయ్యరేమో మరి..
కర్రసాము బావుంది చాలారోజులయ్యిందిచూసి. మావూర్లో చేసేవారుకానీ ఈ సినిమాలోలా కాకుండా వేరేగా ఉండేది...
ఏదోఒకటి మొత్తానికి తెలుగులో వచ్చిన నాలుగైదు సినిమాలు కలిపికొట్టేసినట్టున్నారు...
హిహిహి రాంచరణ్ పిలక భలే ఉంది..కికికి..హీరోయిన్ కి ఆకాస్త కూడా లేదు...అయినా బావుంది.
విపరీతమైన advt లమధ్య సినిమా చూస్తున్నా వీటి హడావుడిలో..ఒక్కోసారి ముందర జరిగింది గుర్తుకావట్లేదు...
అదీ విషయం ...మీరుకూడా చూడండి..ఖాళీగా ఉంటే

నిన్నరాత్రి మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు చూసా..
అప్పుడప్పుడు కన్నీళ్ళు పలకరించినా ఇది సినిమా అని సరిపెట్టుకున్నాను..
ఈ విషయం ఈటీవీ వాళ్ళు తెలుసుకోవాలి కదా..పనిగట్టుకుని మరీ "గీతాంజలి" వేస్తున్నారు..ఈ సినిమా ఎన్నిసార్లయినా చూడాల్సిందే..
పాటలు ఊటీ తీసుకెళ్తున్నాయి..మాటలు ఎన్నిసార్లయినా వినాలనే ఉంటాయి..సంగీతం.. హేట్సాఫ్ టూ ఇళయరాజా.
అద్భుతమయిన సాహిత్యం అందించిన వేటూరిగారికి..."దివీ,భువీ..కలా,నిజం"...ఇలారాస్తే అద్భుతమే అంటారు కదా...
నా అభినందనలు
ఓ కళాఖండం...మిస్ అయితే బాధ అనిపించేత కళాఖండం
సుత్తివేలు,శాంతి ఉండే సీన్స్ కట్ చేసారు...అప్పుడు కాబట్టి..
ఇప్పుడు వాటినిమించి ఉండే సినిమాలు ఉన్నాయి..
కానీ మణిరత్నం కదా రూలంటే రూలే...
వీలున్నవాళ్ళు చూడండి...
హీరోహీరోయిన్లు నా ఎదురుగుండా చచ్చిపోరుకాబట్టి నేనుకూడా చూస్తాను..ఈ సినిమాలో వాళ్ళ ఫ్యూచర్ వినడానికీ, చూట్టానికీ అస్సలు ఇష్టపడను

క్రూడాయిల్ ధరలు తగ్గినా...పెట్రోల్,డీజిల్ రేట్లు పెరిగాయి..వ్యాట్ కూడా
పెరిగింది..మనది రిచ్ స్టేట్ ..అందుకే కొత్తకొత్త బిల్డింగ్స్ కట్టి
సౌకర్యాలు పెంచి ప్రజలకు మేలు చెయ్యగలవాళ్ళం...అవసరం,అవకాశం తో సంబంధం
లేకుండా వందలకోట్ల రూపాయలు వితరణ చేసేంత పెద్ద మనసు...
అందుకే........... బంగారు పంట మనది.. మిన్నేరు గంగ మనది
ఎలుగెత్తి చాటుదామురా తమ్ముడూ
డబ్బుని అభివృద్ధి పేరుతో ఖర్చు పెట్టగలం.పోలీసు అధికారులందరికీ వాహనాలు ఇవ్వగల సమర్ధులం..వీలయినంతవరకూ కొత్త వాహనాలేకొనగల సత్తా ఉన్నవాళ్ళం..
అయినా విద్యుత్ చార్జీలు పెంచాం..డబ్బులేక కాదు...దిష్టి తగలకుండా
మన తల్లి అన్నపూర్ణ..మన అన్న దానకర్ణ
మనభూమి వేదభూమిరా తమ్ముడూ...
ఇందుకే.... మనకీర్తి మంచుకొండరా.....

ఏం తోచకా..పనీపాటు లేకా...ఖాళీగా కూర్చుంటే కోతికూడా ఇలాంటి పనులే చేస్తుంది
...............................
ఏదోసరదాకి.... ఫీలవకండీ...
.................................
సకల కళా వల్లభుడా
సరసం కోరే స్నేహితుడా
నాకధలో నాయకుడా
నా మదిలో మన్మధుడా
నువు చెయ్యివేస్తే శృంగారవీణా పదే పదే మోగాలా

ఇవాళ భారతదేశం లోని క్రికెట్ అభిమానులంతా, మీరు వేసుకునే డ్రసెస్ లో "నీలం
రంగు" ఉండేలా చూసుకోండి...సిడ్నీ వెళ్ళనివాళ్ళు ఉదయం 9 గంటలకల్లా రెడీ
అయిపోయి టీవీల ముందు కూర్చోండీ..
ఇవాళ ఆస్ట్రేలియా తో "సెమి ఫైనల్స్ కదా" మనకి.
ప్రపంచకప్ సెమీస్ లో భారత్ ,మొదటిసారి ఆస్ట్రేయాతో సెమీ ఫైనల్స్ ఆడుతోంది...
చరిత్ర ని పట్టించుకోవద్దు..పిచ్ గురించ్ టెన్షన్ వద్దు...
ధోనీ,రోహిత్,ధావన్,కోహ్లీ..వీళ్ళలో ఎవరో ఒకరు సెంచరీ దాటతారు...టాస్ గెలిచి బేటింగ్ మనదైతే మనవాళ్ళు 280 పైనే కొడతారు.ధోనీ సేన విజృంభిస్తుంది...
మీరు కూడాఇలాగే కోరుకోండి
ఆస్ట్రేలియా కెప్టన్ ...డియర్ క్లార్క్ వెళిపోయటప్పుడు ఎమోషన్ కి లోను కావద్దు
All The Best To The Team INDIA
మళ్ళీ చెప్తున్నా... ఆడేదీ మనమే గెలిచేదీ మనమే....రాసిపెట్టుకోండి...

రాంగోపాల్ వర్మ పాపం ఎప్పుడూ వార్తల్లో నిలవాలనుకుంటాడు..ఎక్కడ జనం తనని మర్చిపోతారోనని వల్లమాలిన బెంగ....
అందుకే సినిమా వాళ్ళని.దేవుళ్ళని,ఇదిగో ఇప్పుడు క్రికెట్ ని...అదే అతను "మనీ" సినిమాలో చెప్పినట్టు..."Same cards but names Different" అని...
ఒక్క తన శిష్యుల్ని మాత్రం ఏమీ అనడు, పైగా ప్రమోట్ చేస్తాడు...చెయ్యకపోతే తన పెద్దరికం కాస్తా పోతుందని భయం
Straight గా రాం గోపాల్ వర్మకి ఒక ప్రశ్న
బాబూ వర్మా నువ్వు అసహ్యించుకునే క్రికెట్ లో ఎవరు గెలిస్తే నీకెందుకూ,ఓడితే నీకెందుకు..నీకిష్టం లేనిదాని మీద మళ్ళీ నీ దిక్కుమాలిన అభిప్రాయం ఎందుకు..అసలు ఆటే ఇష్టం లేదు అని చెప్పి క్రికెట్ మీద నీ అభిప్రాయం చెప్పుకో ...అంతేగానీ ఆడేవాళ్ళమీదకాదు...
నీ ఖర్మ కొద్దీ ఎవర్నో టార్గెట్ చేద్దామనుకుంటావు..కానీ నువ్వే బుక్కయిపోతావు.
....Bad luck
అస్తమానూ నీమీద జాలి పడాలంటే కష్టం గా ఉంటోంది..ఈసారి కొంచెం బుర్ర ఉపయోగించి రాస్తూ ఉండు

ఇవాళ కేజ్రీవాల్ ఏం చేసినా తప్పే..ఎందుకంటే..67 సీట్లు గెలుచుకుని
ముఖ్యమంత్రి అయినవాడు, వెంటనే అతనిచ్చిన హామీలన్నీ నేరవేర్చలేదు
కాబట్టి....అతను నడిస్తే తప్పు,మాట్లాడితే తప్పు,దగ్గితే తప్పు. జ్వరం
వస్తే తప్పు,జలుబు చేస్తే తప్పు..ఇవన్నీ రాకూడదు ..
అయినా ఇంతవరకూ ఢిల్లీ కి ముఖ్యమంత్రి గా చేసినవాళ్ళెవరైనా ఈ బాధల బారీన పడ్డారా లేదే..
అంతర్గతంగా ప్రతీ పార్టీలోనూ గొడవలుంటాయి..కానీ కేజ్రీవాల్ ది మాత్రం చారిత్రాత్మక తప్పిదం కిందా కనపడుతుంది...
ఢిల్లీలో ఉండే ప్రజలు ఏం ఆలోచిస్తున్నారో ఇక్కడివాళ్ళు చెప్పేస్తారు..అవునుమరి ఇక్కడివాళ్ళని అడిగే ఢిల్లిలో వాళ్ళు ఓటేసారు కదా.
ఇంకెక్కడయినా అయితే రాత్రికిరాత్రి పదవిలోంచి తీసేస్తే తప్పే కాదు..అదే కేజ్రీవాల్ చేస్తే మహాతప్పు...ఎందుకంటే సామాన్యుడు కదా....
డియర్ కేజ్రీ...నువ్వు వీలయినంత త్వరగా స్టింగ్ ఆపరేషన్స్ చెయ్యడం నేర్చుకో...తేడా అనిపించినవాళ్ళ ని తీసిపడెయ్యి..నువ్వు నమ్మిన సిద్ధాంతాలని హాయిగా పాటించు...నీకు నచ్చినట్టు,వచ్చినట్టు నిర్ణయాలు తీసుకో...
అన్నింటికంటే ఒకటి చాలా Important ఏంటంటే ...రాజకీయం నేర్చుకో ...అస్సలు తప్పులేదు ఎందుకంటే..
రాముడు కూడా చెట్టుచాటునుండే "వాలి" ని చంపాడు....
నీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు.......

దయచేసి కల్యాణోత్సవం లో శ్రీరాముడి ని శ్రీరాముడు అని,సీతామహాదేవి ని సీతా
మహాసాధ్వి గానే చెప్తూ కల్యాణం చెయ్యండి...ఎందుకంటే భద్రాచలం లో క్రితంసారి
రామనారాయణుడు అంటూ కల్యాణ చేసేసినట్టు గుర్తు..ఆయనకు శ్రీరాముడనే నామకరణ
చేసారు...మనకు నచ్చినట్టు,మనం మెచ్చినట్టు చెయ్యడానికి ఇది ఎవరికి వారు
చేసుకునే పెళ్ళికాదు కదా....ఏదో మనలో మనవాడిగా కలిసిన దేవుడు కదా అని తోచిన
మార్పులు చెయ్యకండి...
మహానుభావుడు ధర్మాన్ని అనుసరించినవాడు.
శ్రీరాముడి కి జన్మదిన శుభాకాంక్షలు
ఆ శ్రీరామచంద్రమూర్తి కి, సీతామాహాసాధ్వికి పెళ్ళిరోజు శుభాకాంక్షలు.
ఇవాళ్టి పెళ్ళి భోజనాలకోసం మొన్నననగా కోయించిన గుమ్మడికాయ...శాస్త్రం ఆడవాళ్ళు గుమ్మడికాయ తరక్కూడదని చెప్తోంది..అందుకే మా మావయ్యగారి చేత పని కానిచ్చాం అన్నమాట..
అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు..

ఎందుకు
స్వామీ..కోరి కష్టాలని తెచ్చుకుంటున్నారని, అడిగిన భార్య 'మండోదరి' మాట,
పక్కనపెట్టి మరీ ముందుకెళ్ళిన 'రావణుడు'..అతిపరాక్రమవంతుడయైన కొడుకు'
ఇంద్రజిత్'చావుని సైతం చూశాకా పోయాడు...
అయినా రావణుడు మంచివాడే ఎందుకంటే..'సీత' ఇష్టంలేకుండా ఆమె వేలు కూడా తాకలేదు కాబట్టి, అనివాదించేవాళ్ళని చూశాను..అంతేకానీ అసలు వేరొకరి భార్య మీద చెడు ఆలోచన రావడమే పెద్ద తప్పయినప్పుడు..తప్పులో మళ్ళీ 'తప్పుడు నీతులు' వెతకటం ఎంతవరకూ కరెక్టో నాకు తెలీదు
వాదించే తెలివిని,వితండవాదాన్నీ సొంతం చేసుకుని రామాయణాన్ని,రాముడి ని విమర్శించేవాళ్ళు...అసలు రామాయణాన్ని ..'బాల కాండ' నుండి ఆఖరి 'ఉత్తరకాండ' వరకూ ఓపికగా అర్ధం చేసుకుని చదివితే..మనకొచ్చే అనుమానాలకి ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది అనే నమ్మకం ఉంది నాకు.
కేవలం విమర్శించడం వల్ల మనకి తృప్తిగా ఉంటుంది అనుకునేవాళ్ళు, ఎవరైయితే ఉంటారో వాళ్ళు ఎంతవరకు ప్రతీ విమర్శని సద్విమర్శగా తీసుకుని ముందుకెళ్తారో వాళ్ళ మనస్సాక్షికే వదిలేస్తున్నా.
రావణుడి భార్య మండోదరి కే తప్పనిపించింది మనకి ఒప్పెలా అవుతుంది..రాముడి భార్య సీతకే ఒప్పనిపించింది మనకి తప్పెలా అవుతుంది..
మనుషుల్లో మనిషిలా కష్టాలు అనుభవించినవాడు ..ధర్మానికి కట్టుబడినవాడు నా దృష్టిలో దేవుడే..
అందుకే త్యాగరాజంతటివాడు 'సీతమ్మ' మా అమ్మ,'శ్రీరాముడు' మాకు తండ్రి అయినా సరే... బంటురీతి కొలువియ్యవయ్య రామా అని ప్రాధేయపడి మరీ కోరుకున్నాడు.
నిత్యం రామనామం మాత్రమే పలికే రామదాసు..రాముడి పలుకే బంగారమాయెనా కాస్త మము బ్రోవమనీ చెప్పవే సీతమ్మ తల్లీ.. అని వాళ్ళ మీద తనకున్న నమ్మకాన్ని చూపించాడు
నాకు రామాయణం,రాముడు,సీత...వాళ్ళ బలగం అంటే చాలా ఇష్టం.

ఆశ్చర్యం ఎందుకు బాబూ...cool బాబూ cool....
ఇప్పుడూ జడ పెద్దదిగా ఉండి జుట్టు ఎక్కువగా ఉండటం వల్ల ఎన్ని నష్టాలో తెలుసుకో..
హెయిరాయిల్ ఖర్చు తగ్గుతుంది,షాంపూ తక్కువ పడుతుంది..అస్తమానూ అ జడ ఊపుతూ నిన్నేడిపించదు...
ఫ్యూచర్ లో అంటే ఓ పదేళ్ళు పోయాకా..హెన్నా,హెయిర్ డై లాంటివి ఎలాగూ బాగా రేట్ పెరుగుతాయి కాబట్టి..కానీ నీకు చాలావరకు డబ్బులు save చేస్తుంది.
చూసావా.. నీకెన్ని బంపర్ ఆఫర్స్ ఇస్తోందో....
ఒక్క జడ కోసం ఇవన్నీ వదులుకోకూడదమ్మా...
బాపూ బొమ్మ అనుకుంటే..శంకర్ హీరోయిన్ లా ఇలా ట్విస్ట్ ఇచ్చిందేంటా అని confuse అవకు..నీకు ఉన్నhair కాస్తా ఊడే ప్రమాదం ఉంది..
Be positive .....smile please..

ఇవాళ సాక్షి ఎడిటోరియల్ పేజ్ లో సీనియర్ జర్నలిస్ట్,కాంగ్రెస్ పార్టీ తఫున
1989-91 వరకు లోక్ సభ సభ్యుడిగా చేసి,ఇప్పుడు National spokesperson గా
బీజేపీ పార్టీ చేత నియమించబడిన శ్రీ ఎం. జె అక్బర్ గారు ఇలా రాసారు.
"కేజ్రీవాల్ తన అధికార బుట్టలోంచి ప్రతీ ఎం ఎల్ ఏ కి ఓ రొట్టెముక్కనో లేదా ఓ చేపనొ వేసారు,వారంతా మంత్రులో,కార్యదర్శులో అయ్యారు..ఇక వాళ్ళు చేసేదేంటి...ఎవరికి తెలుసు...తలా ఒక కారు,ఒక కార్యాలయం,సొంత డబ్బా కొట్టుకునే హక్కూ లభించాయి.
అరవింద్ ..ఎలెక్షన్స్ టైం లో మందు పంచారు..రెండుకోట్ల రూపాయల చెక్కులూ తీసుకున్నారు విరాళం కిందా"
............................
ఒకపెద్దస్థాయిలో ఉన్నమీరు ఇంత చిన్నవిషయాలు రాసారేంటి సర్..మీ స్థాయికి తగ్గ మాటలు రాయండి..రెండు పెద్ద పార్టీలతో పనిచేసిన అనుభవం మీదగ్గరుందికదా...
ఢిల్లీలోని 99% ప్రజలు ఇచ్చిన తీర్పు కేవలం 'మందు 'మీద ఆధారపడిందా...కారు,కార్యాలయం కోసం,పదవికోసం అయితే కాంగ్రెస్ తో జతకట్టి ముఖ్యమంత్రి అయినవాడు..ఆ పదవిలోనే ఏడవచ్చుగా బయటికొచ్చిమరీ పోటి చెయ్యాల్సిన అవసరంలేదే....
పోనీ మీరన్నట్టు మందు పంచినా,డబ్బు పంచినా ఇంకేవన్నా చేసినా కూడా రెండు కోట్లు ఏమూలకి సర్...ఓ వంద కోట్లయితే ఏదో జాగ్రత్తగా సర్దుకోచ్చు...అంచేత ఈసారి రాసేటప్పుడు ఎక్కువ మొత్తం రాయండి...
అరవింద్ కి తెలీదండీ ప్రశాంత్ భూషణ్ తండ్రి "శాంతి భూషణ్ "ఎలక్షన్స్ ముందు బయటికెళ్ళి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడే ఇతనిమీద కన్ను వెయ్యాలని...ఇప్పుడు తెలుసుకున్నాడు..అందుకే తప్పు చేసానని చెప్పాడుగా..ఇంక మీరు కొత్తగా చెప్పేదేంటండీ బాబూ..పాత సీసాలో కొత్త సారా పొయ్యడం తప్ప.
ఇకనుండి చాలా పకడ్బందీగా అరవింద్ ని ఎలా బుక్ చెయ్యాలా అని ఆలోచించి వీలయినంత తొందరగా అతన్ని దింపేసే ఏర్పాట్లలో ఉండండి..మీకసలే ఫోర్త్ ఎస్టేట్ లో అదేనండీ జర్నలిజం లో సుధీర్ఘ అనుభవం ఉందికూడాను.
All the Best

Hyderabad నుండి యానాం వెళ్ళే APSRTC నాన్ ఏసీ బస్ లో 31 సీట్లు ఉంటే
మామూలు రోజుల్లో టికెట్ రేట్ రూ 500 ..అదే ప్రైవేట్ బస్ అయితే మామూలు
రోజుల్లో రూ 600 ..పండగ రోజుల్లో రూ 999 ..సీట్లు 36.
అంటే ఒకరోజుకి 36*600=21,600
నెలకి 30*21,600=6,48,000
.......................................
ఇంతవరకూ బీజేపీ ప్రభుత్వం ...పదేళ్ళు ఉమ్మడిరాజధాని అనే మాట గురించి ఎక్కడయినా లిఖితపూర్వక హామీ ఇచ్చిందా...
తమిళనాడు,కర్ణాటకా..ఇంకా మిగిలిన రాష్ట్రాలకు మనం రోడ్ టేక్స్ కట్టడం లేదా..
విభజనచట్టం లో దీనిగురించి ప్రస్తావించినట్తు తెలుసు..విభజన జరిగినవెంటనే అమలు చెయ్యాలని అడిగింది తెలంగాణా ప్రభుత్వం.
ఇవ్వాళ గగ్గోలెత్తుతున్న కొంతమందిజనం పండగరోజుల్లో ఎందుకు 999 రూపాయలు వసూలు చేస్తున్నారని అడగలేకపోయారు..అప్పుడేం రోడ్ టేక్స్ ఎక్కువ కట్టలేదే...ఇక్కడ అంతరేటు పెట్టి ఎక్కడమా,మానడమా అనేదాని గురించి నేను మాట్లాడటం లేదు..రోడ్ టేక్స్ ఏవన్నా పెరిగిందా అనే అడుగుతున్నా..
ఒకరాష్ట్రం విభజన జరిగినప్పుడు ఏర్పడే సమస్యల్లో ఇది ఒకటికావచ్చు కానీ ఇదే తెలంగాణా రాష్ట్రం ప్లేస్ లో ఇంకే రాష్ట్రం ఉన్నా ఇలా కాకుండా కొత్తగా చేస్తుందా..వచ్చే ఆదాయాన్ని వదులుకుంటుందా...
కమర్షియల్ వాహనాల మీద టేక్స్ భారం ఉండటం ఇవాళ కొత్తకాదు..
APSRTC అధికారికంగా రెండు కార్పొరేషన్స్ కిందా ఇంకా విడిపోలేదు...ఒకవేళ విడిపోయుంటే రెండు ప్రభుత్వాలు ఇంతవరకు అధికారికంగా ప్రకటన చేసాయా?
ఇంకొకముఖ్యవిషయం ఈ విషయం మీద కోర్ట్ తీర్పు చెప్పింది...అంటే కోర్ట్ కి విభజన చట్టం మీద అవగాహన ఉన్నట్టేకదా...
.............................................
ఒకవేళ నేను కరీం నగర్ లో ఉంటూ ఒక బస్ సర్వీస్ విజయవాడకు start చేస్తే ఏపీ ప్రభుత్వం నాకు రోడ్ టేక్స్ విధిస్తే చాలా సంతోషంగా కడతాను..

మధ్యాన్నం పూట ఈ చానల్స్ లో వంటల కార్యక్రమాలొస్తుంటాయి కదా..అందులో anchor
తోపాటూ ఎక్కడెక్కడినుంచోవచ్చి participate చేసేవాళ్ళూ
కనిపిస్తుంటారు,వాళ్ళు వచ్చి వంటలు చేస్తారు..
అయితే participants ..బాగా ప్రిపేర్ అయి start చెయ్యగానే ..anchor కాస్తా...అదేంటీ ఉప్పెక్కువవ్వదా..బెల్లం వేస్తున్నారేంటీ..మీరు కారాలు తక్కువ తింటారా..ఇలా చేస్తున్నారు కదా ఇది ఎందులోకి బావుంటుంది..
ఇలా ప్రశ్నలు వేసి పాపం చాలా విసిగించేసి..చేసేవాళ్ళ సహనాన్ని తినేస్తే ..కొత్తగా కెమేరా ముందుకొచ్చినవాళ్ళకి ఇబ్బందిగా ఉండదా..
ఆల్రెడీ ingredients వేసేసాకా ఇంక ఈవిడ అడిగేదేంటీ..వాళ్ళు చేప్పేదేంటీ..
వంట చెయ్యడానికొచ్చినవాళ్ళని చెయ్యనివ్వండి..తర్వాత ఎలాగూ taste చేస్తారుగా అప్పుడు మీ అభిప్రాయాలు చెప్పండి..లేదా మీకేంకావాలో అవే చెయ్యాలని condition పెట్టి అవిచేసేవాళ్ళనే పిలవండి..
అంతేకానీ ఊరికే మధ్యలో వాయించేస్తే పాపం వాళ్ళు confuse అవుతారు..
ఇప్పుడూ ..ఈ anchors నాన్ స్టాప్ గా మాట్లాడేస్తుంటే మధ్యలో వాళ్ళ మాటలకి అడ్డుపడుతూ విసిగిస్తే ఊరుకుంటారా..ఎవరయినా అంతే... పని చేసేవాళ్లని చెయ్యనివ్వండి...
మామూలుగా మాట్లాడుతూ వాళ్ళకి సరదా వాతావరణం కల్పించడం వేరు..పనిగట్టుకుని criticize చేస్తూ మాట్లాడ్డం వేరు
తేడా తెలుసుకుని సామాన్యప్రజానీకానికి సహకారం అందించండి.

సభ్యత్వం ఇంతేనా ,అంటూ కాంగ్రెస్ నేతల అలసత్వం పై కాంగ్రెస్ రాష్ట్ర
వ్యవహారాల ఇన్ చార్జ్ రామచంద్ర కుంతియా పాపం చాలా ఆవేదన వ్యక్తం
చేస్తున్నారు...
ఏదో కనీసం లో కనీసం ఓ పాతిక లక్షలమందేనా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకుంటుందని ఓవర్ ఎక్పెక్టేషన్స్ లోఉన్నారు మన మాష్టారు...
తెలంగాణా ఇచ్చింది కాంగ్రెస్ కదా అలాంటప్పుడు ఎందుకు జాయిన్ అవరూ అనేది ఈయనగారి డౌట్..
గురువుగారూ ఇంకా ఎన్నిరోజులీపాట పాడతారు..ఆ..కొత్తవి ట్రై చెయ్యచ్చుగా..అస్తమానూ ఒకటే మాట్లాడకపోతే..
అంటే ప్రజల అభిప్రాయాలతో మీకు సంబంధం లేదా..మీ తృప్తి కోసం మీ జనం దొంగ సభ్యత్వాలు చూపించాలి, మీకు అప్పుడు హేపీనా .....అలా ఐతే మీకు బావుంటుందేమో...
సభ్యత్వం కంటే మీ విధానాలేంటో ప్రజలముందు పెట్టండి..తెలంగాణా ఇచ్చి చేతులు దులుపుకోలేదు అనే నమ్మకం కలిగించండి...
లక్ష్యం ఏంటో చెప్పడం లో పెద్ద గొప్పేముంది సార్...మార్గం చూపించండి..అది గొప్ప..
ఇవాళ మీరేం చేసారో గుర్తుపెట్టుకున్న ప్రజలు..చరిత్రని మర్చిపోరుగా..
పైగా నమోదు మీద నిర్లక్ష్యం చూపించేవాళ్ళ మీద చర్యలు తీసుకుంటార్ట...జోకులేస్తున్నారా మాష్టారూ..మీరు చర్యలు తిసుకునేదాకా wait చేయ్యడానికి వాళ్ళు టికెట్ తీసుకుని రైల్ ఎక్కిన పాసెంజర్స్ కాదు..
వాళ్ళు కూడా నాయకులు...వెంటనే అధికారపార్టీలోకి జంప్ చేసేస్తారు....రూల్ చెయ్యకండి...వెయిట్ చెయ్యడం తప్ప వేరేదారిలేదు మీకు
All the Best కుంతియా

చాలామంది వాస్తు నమ్మకాల్ని,దేవుళ్ళని,ఆచారాలని,సాంప్రదాయాల్ని...ఆఖరికి
గ్రహణాన్ని కూడా అన్నిటితోపాటూ నమ్మరు..అది వాళ్ళిష్టం అనుకోండి..
కానీ అలా చెయ్యడం ఆధునికత అంటే మాత్రం నేనొప్పుకోను ఎందుకంటే అదివాళ్ళ పర్సనల్ ఫీలింగ్ అంతే...ఆ ఫీలింగ్ తో ఇతరులకు ఇబ్బందిలేనప్పుడు నమ్మేవాళ్ళు.. నమ్మనివాళ్ళని తప్పు పట్టకూడదు..
నేను వాస్తుతో సంబంధంలేకుండా ఒక ఇల్లు కట్టాననుకోండి..ఖర్మకాలి నా టైం బాగాలేక అది అమ్మాల్సి వస్తే ..కొనేవాళ్ళు వాస్తు చూసుకునేవాళ్ళయితే...అప్పుడు నా పరిస్థితేంటీ..అందరూ నాలాగే ఆలోచించి కొనెయ్యరుకదా...
ఏదయినా అంతే..మనకి నచ్చకపోతే నమ్మద్దు....కానీ నమ్మేవాళ్ళని విమర్శించకూడదు..
నమ్మకపోవడానికి మనకి 100 కారణాలుంటే ...నమ్మేవాళ్ళు 101 ఆనవాళ్ళు చూపించచ్చు..
మనం సైన్స్ తో వివరంగా చెప్తే ...వాళ్ళు వివరించేవాటిలో సైన్స్ కూడా కనపడచ్చు...

ప్రధాని విందుకు హాజర్ కాని కురియన్...పవిత్రదినాల్లో సమావేశాలేంటంటూ ప్రశ్న.
.........................................
సార్..మీరు వెళ్ళి చేసుకోండి సార్... ..అసలే దేశంలో బోల్డన్ని మతాలు..బోల్డన్ని పవిత్రదినాలు...మధ్యలో వచ్చే బందులు..సమ్మెలు..గొడవలు..ఇలా అన్నిటికీ సెలవలిచ్చేసుకుంటూ పోతే ఇంకెప్పుడు సమావేశాలు ఏర్పాటుచేసుకోవాలి.. మిమ్మల్నివెళ్ళద్దు కంపల్సరీ ఉండాలి అని చెప్పలేదుగా.....అన్ని మతాల్ని గౌరవించాలి అని మీరే చెప్తున్నారు కదా..నిజమే ఒక్క పర్వదినాల్లో మాత్రమే సెలవుతీసుకుంటూ..ఉంటే..ఖచ్చితంగా అసలు పెండింగ్ కేసులే ఉండవు..పెద్దగా వాయిదాలూ ఉండవు...పెద్దపెద్దవాళ్ళకేసులు ముందర జడ్జిమెంట్ కి వచ్చి సామాన్యులవి వెనకబడే చాన్సూ ఉండదు...
మీరసలే సుప్రీంకోర్ట్ జడ్జ్ కదా...మీరు చెప్పినట్టే ముందుకు వెళ్దాం అండి..... ప్రింట్, ఎలెక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ లకి ఇలా అడగాలని తెలీదు సర్...ఆదివారాలు ప్రెస్ కాన్ ఫరెన్స్ ఉన్నా ...వెళ్ళి.. హాజరయివస్తారు...

ఓ నాలుగు ఇంగ్లీష్ సినిమాలని అటు తిప్పి ఇటు తిప్పి..ఓ సినిమా కిందా తీసేసి ప్రజలమీద పడేసాడు..
అది తెలీని మనం చూసి ఆహా ఓహో అనేసాం..విచిత్రం ఆ విషయం .... అతను చెప్పేదాకా తెలీదు మనకు...ఇంగ్లీష్ సినిమాలు చాలా బావుంటాయని కితాబిచ్చేస్తూ ఉంటాడు...భాషతో ఏవుంది బాబూ సినిమా బావుండాలికానీ....
తనలాంటి డైరెక్టర్స్ పదిమందిని తయారుచేసి వాళ్లని కూడా వదిలాడు..ఏవో కొన్ని సీన్లు..పాటలు...కొద్దిగా కధ నచ్చడం తో వాళ్లనీ భరిస్తున్నాం..
ఇక..హీరోయిన్లు.. వాళ్ళ costumes విషయం లో వీలయినంత పొదుపు పాటించి నిర్మాతకి ఖర్చు తగ్గించిన మేధావి...
ఇంకా పబ్లిసిటీ కోసం పరితపించే వ్యక్తి...
ఇంత వయసొచ్చినా అభిమానానికి,ప్రేమకి,ఆకర్షణకి తేడా తెలీని వ్యక్తి...
అయినా సరే నీమీద నాకు ఎలాంటి కోపం లేదు బాస్...నీ స్థాయి నీది కదా...
బేసిగ్గా నాకు ఎవరిమీద పట్టలేనంత కోపం ఉండదు.
మహా మహావాళ్ళే పుట్టినరోజులు జరుపుకుంటున్నాప్పుడు నీకు మాత్రం ఏం తక్కువ...నువ్వూ కానీ మరి
..............................
నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు....

నిజాయితీ ని మెచ్చుకోవాలి...
..................................
అశోక్ గజపతి రాజుగారు ...నేను మంత్రిని అయ్యాకా నన్ను చెక్ చెయ్యడంలేదు...నాతో అగ్గిపెట్టెలు కూడా ట్రావల్ చేస్తున్నా పట్టుకోవడంలేదు.అదే ఇంతకుముందయితే సిగరెట్ పెట్టెలు,అగ్గిపెట్టెలు స్వాధీనం చేసుకునేవారు....అంటూ నిజం చెప్పడం మెచ్చుకోవాలి...సిగరెట్లు విపరీతం గా కాల్చే అలవాటుందని చెప్తున్నారు...ఈయన...
..అతను చెప్తేకానీ తెలీని విషయం ఇది..ఇకనుండి చెక్ చేసుకోవద్దని అన్లేదు అశోక్ గజపతిరాజుగారు.......అగ్గిపెట్టెలు ఆయుధం కాబట్టి తప్పు అని అంటున్నారు కొంతమంది నిజమే..
ఏదయినా ఉపయోగించడాన్ని బట్టే ఉంటుంది
చేతిలో ఏమీలేకుండా కూడా యుద్ధాలు సృష్టించవచ్చని చరిత్ర చెప్తోంది...
అంచేత వస్తువు ని ఉపయోగించడాన్ని బట్టి ఉంటుంది....
అది గొడ్డలయినా,అగ్గిపెట్టెయినా..ఆఖరికి ఎన్ కౌంటర్ అయినా వికారుద్దీన్ టంగ్ అయినా....

అరవింద్ కేజ్రీవాల్...కాస్త నామాట విను బాబూ...అసలే మనకి ఆరోగ్యం
బావుండదు..అలా సమోసాలు..అవీ ఇవీ తినకు..రాష్ట్రపతిగారు సరదాగా తినమన్నారని
తినేస్తే మళ్ళీ ఆరోగ్యంలో తేడా వస్తే కష్టం ...అసలే నీ ఎజండా మన జెండా అంత
నీట్ గా ఉంది..
నువ్వుఅది కాస్తా మర్చిపోయీ ఇలా చిరుతిళ్ళకు కక్కుర్తి పడితే..నేను పొట్టలోకి వెళ్లే వాటిగురించే అంటున్నా...అపార్ధం చేసుకోకు...
నీమీద విపరీతమయిన హోప్స్ పెట్టుకున్న నేను...హర్ట్ అవుతా..
రాష్ట్రపతిగారు తినమన్నారని తినేసి...అతనెవరో కార్ ఇచ్చాడని తీసేసుకుని...వాళ్ళేవరో బాగా డబ్బులు డొనేట్ చేసారని ఆనందపడిపోతే... .రేపొద్దున్న కుర్చీ దిగి వెళ్ళమంటే వెళ్ళాల్సొచ్చేది నువ్వక్కడివేకాదు...అర్ధమయ్యిందా....తరవాత... కక్కలేక మిగలేక ఏడవాలి మనం..
అసలే ఢిల్లీ ప్రజల్లో 99% శాతం మీకు అనుకూలంగా వోట్లేసారు...ఇక్కడ..ఏ సంబంధం లేకపోయినా సపోర్ట్ చేసాను నేను..మా నమ్మకాన్ని నిలబెట్టు ...

ఈ జెమినీ టీవీవాళ్ళని మెచ్చుకోవాలి...కరెక్ట్ గా ఏ హీరో.. సినిమా రిలీజ్
అయితే ఆ హీరో పాత సినిమాల్లో ఏదో ఒకదాన్ని..అలాగే తన స్టార్
పరీక్షించుకోవడానికి ఏ డైరెక్టర్ తన కొత్త సినిమాని ప్రేక్షకులముందు
వుంచితే ఆ డైరెక్టర్ సినిమాని..హిట్ తో సంబంధం లేకుండా..వేస్తూ ఉంటారు
త్రివిక్రం డైలాగ్స్ ని,పంచ్ లని ఇష్టపడనివాళ్ళు చాలా రేర్ గా ఉంటారు...సినిమా ని ఎంజాయ్ చేస్తూ అతను వేసిన సెటైర్ ని మర్చిపోతాం కూడా...అయితే ఈ మధ్యన కొంచెం ఎమోషనల్ అవుతోంది, సినిమాలు సాగుతున్నాయనేది తెలిసినా కూడా ..హీరో ఇమేజ్ కూడా కొన్నిసార్లు కారణం కావచ్చేమో ...అతని మాటలని మెచ్చుకుంటాం...
జెమినీ లో ఖలేజా వస్తోంది.....ఈ సినిమా కమర్షియల్ గా హిట్ కాకపోయినా..ఎంజాయ్ చెయ్యడానికి బానే ఉంటుంది...
నాకు త్రివిక్రం spontaneity..అంటే ఇష్టం,
...మొన్న సమంత.. త్రివిక్రం ని ఇంటర్వ్యూ చేస్తూ ఒక ప్రశ్న అడిగింది.....మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను అని..
వెంటనే త్రివిక్రం... నాకు ఆన్సర్స్ తెలీని ప్రశ్నలేమీ లేవే...అని అనేసాడు
That is Trivikram

ఏ ముఖ్యమంత్రి అయినా సరే.. తను ఎప్పుడేనా కొన్నిరోజులు పరిపాలనకి దూరంగా
ఉండాల్సివస్తే ఎవరో ఒకరిని తన ప్లేస్ లో కూర్చోబెట్టడం సహజమే..తెలంగాణా
ముఖ్యమంత్రిగారు కనుక అలా చేయాలొస్తే ..అంటే, తను తాత్కాలికంగా సెలవులో
వెళ్తే..ఆయన తన స్థానం లో తన నమ్మినబంటు..మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంత
రావుగార్ని కూర్చొపెడతారేమోనని ఊహ...మొన్న వరంగల్ వెళ్ళినప్పుడు KCR
ఉన్నది ఈయనదగ్గరే ..కడియం గారు పదవిరాగానే వెళ్ళి ఈయన ఆశీర్వాదం కూడా
తీసుకున్నారు..సతీసమేతంగా...
మంచిపేరున్న వ్యక్తి...KCR గారిపధకాలకి విస్తృత ప్రచారం కల్పించడం లో ఈయన పేరు ఎక్కువగా వినిపిస్తుంది....ఈయన PV నరసిం హా రావు గారికి దగ్గర చుట్టం అవుతారా అనేది ఎవరేనా సీనియర్స్ కి తెలిస్తే చెప్పగలరు...
ఇప్పుడెందుకు ఈ చర్చ అనుకోవచ్చు ..
......................
.................................
..............
..........................................
వీకెండ్ కదా ..అని ...
తిట్టకండి...

S/o సత్యమూర్తి
cinema పై నా అభిప్రాయం ..
..................................
మనిషి శరీరంలో, హార్మోన్స్ సమతుల్యతలో మార్పు లు వల్ల
ఆరోగ్యం లో మార్పులుంటే..అతని నడవడిక వల్ల జీవన విధానం లో మార్పులొస్తాయి..నైట్రస్ ఆక్సైడ్ ని వాసన చూస్తే నవ్వొస్తుంది కానీ నవ్వడానికి వాడితే..యాంత్రిక జీవితానికి అలవాటుపడ్డట్టవుతుంది...ఇలాంటి ఆలోచనల సమాహారం ఈ సినిమా...
సత్యమూర్తి సినిమాలో ,సత్యమూర్తి కొడుకు అల్లు అర్జున్..తండ్రి తో, నాన్నా అపాత్రదానం చెయ్యకు అంటాడు...సత్యమూర్తి వెంటనే పదిమంది కి దానం చేస్తే ఒక్కడు సరిగా వాడుకున్నా మంచిదేగా.. అంటాడు...
సత్యమూర్తి తనకొడుకులకి ,బరువు బాధ్యతలు అప్పగించకుండా చనిపోతాడు..పెద్ద కొడుకు వెన్నెల కిషోర్ షాక్ లో ఉంటే..రెండో కొడుకు అల్లు అర్జున్ మాత్రం బరువు భాధ్యతలే జీవితం అనుకుంటాడు..తన తండ్రి కి ఉన్న మంచిపేరు ని అలాగే నిలపడం కోసం ఆస్థుల్ని వదిలేసుకుంటాడు...విలువలకోసం కోట్లు వదులుకుంటాడు.. మనిషికదా మరి..
...............అయినా సత్యమూర్తి కొడుకు, తండ్రి గొప్పదనం తలుచుకోవడం లో తండ్రిలేడనే వాస్తవాన్ని మర్చిపోతాడు...తండ్రి మంచితనాన్ని చాలా సంతోషంగా గర్వంగా ఫీలవుతూ ఉంటాడు...
బంధాలకోసం బరువులు ,బరువుగా అనిపించవు హీరోకి..భాద్యతలు కష్టం గా అనిపించవు...
ఈ క్రమం లోనే ఒక్కడు.. సత్యమూర్తి ని తప్పు పడతాడు..అది భరించలేడు కొడుకు...
..........అందుకే, కొడుకు ఫ్రెండ్ ఇలా అడుగుతాడు..ఒక్కడే కదరా మీ నాన్నని తప్పు పట్టిందీ అని
ఒక్కరే కదా సీతమ్మని తప్పు పట్టింది అని రాముడనుకుంటే....లవకుశులకి మాత్రమే రాముడు గుర్తుండేవాడు అని..
అందుకే రాజ్యం గెలిచినవాడు రాజు...రాజ్యాన్ని వదిలినవాడు రామచంద్రుడు
త్రివిక్రం...సాహసం ఏంటంటే..పనిగట్టుకుని రామాయణ,మహాభారతాల్ని విమర్శించే ఈకాలంలో వాటి గొప్పదనాన్ని చెప్పాలనుకోవడం..
నాకు నచ్చినట్టు..మాత్రమే బతుకుతాను అనేవాడు నా దృష్టిలో పదిమందిలో ఉన్నా ..ఒక్కడుగా ఉన్నా ఒకటే..కానీ త్రివిక్రం మాత్రం ఎలా ఉన్నా ఫరవాలేదు కానీ మనిషిలా బతకమంటాడు..అది నాకు బాగా నచ్చిన విషయం....
బంధాలు నిలుపుకోవడం కోసం..మాట్లాడుకోవాలి..అహాన్ని,హోదాని,డబ్బుని పక్కన పెట్టగలగాలి అంటాడు...సత్యమూర్తి కొడుకు..ఇదే అతను తన తండ్రి నుండి నేర్చుకున్నది.
ఇవాళ్టిరోజున చాలామంది మిస్ అయినవి..కన్వీనియంట్ గా మిస్ చేసుకునేవాటిని ప్రేక్షకులకి చెప్పే ప్రయత్నం చేసాడు త్రివిక్రం..
యూత్ కి కావల్సినవేమీ లేవు...మసాలా అసలేలేదు...మామూలు తెలుగు సినిమా ని కసి గా తీసాడు అంతే...
ఏ బంధం అయినా అమోదయోగ్యం కావాలికాని..స్వార్ధ జీవితానికి దారి కాకూడదంటాడు త్రివిక్రం
ఈ సినిమా, ఈరోజున నచ్చని వాళ్ళకి..రేపొద్దున్న తన పిల్లలతో మనవలతో ఉన్నప్పుడు గుర్తొస్తుంది...గమనించండి..నచ్చుతుంది అనడం లేదు నేను...గుర్తొస్తుందని మాత్రమే అంటున్నాను
సినిమా కదా లోపాలు ఉన్నాయి..కొన్ని పాత్రలు లేకపోయినా నడుస్తుంది కూడా..
.........................
సినిమాలో కేరక్టర్స్....
అల్లు అర్జున్ కి ఫలానా సినిమానే చేస్తాడనే ఇమేజ్ లేదుకాబట్టి బాగా చెయ్యగలిగాడు...సమంత అవసరం లేకపోయినా లోనెక్ వేసింది అయినా బావుంది..అంతే ఈజీగా ,ఇగోలకి, పోకుండా నటించింది..స్నేహ సన్నగా చలాకీ గా ఉంది...ఇక నిత్యామీనన్..ఇవాళ ట్రెండ్ జీరో సైజ్ అని తెలిసినా తన నటనముందు గ్లామర్ బలాదూర్ అనిపించింది...
వెన్నెల కిషోర్ ఇవాళ ఇండస్ట్రీకి వాంటెడ్ కమెడియన్...
మొట్టమొదటిసారి విలన్ ఉపేంద్రకి మంచి కత్తిలాంటిపాటపెట్టి ..గౌరవం పెంచే ప్రయత్నం చేసాడు..త్రివిక్రం
బ్రహ్మానందం,ఆలీ..గిరి...అందరూ వాళ్ళ పరిధిమేరకు నటించారు
కోటా,ప్రకాష్ రాజ్,ఎం ఎస్ నారాయణ,రావు రమేష్..లాంటివారి నటనకు పేరు పెట్టే ఆస్కారం వాళ్ళు ఇవ్వరు.ఇందులో హీరోకి ఉద్యోగం ఇచ్చే ఫ్రెండ్ కేరక్టర్ చేసినతను ఎవరో నాకు తెలీదు కానీ చాలాబాగా నటించాడు
ఇది పూర్తి కుటుంబ కధా చిత్రం అడుగడుగునా త్రివిక్రం మార్క్ మాటలు కనిపించే సినిమా..పాటలు మూడు బావున్నాయి.
నాకు ఈ సినిమాలో నచ్చిన డైలాగ్స్ లో మూడు గుర్తున్నాయి
1.అదృష్టం నీకు షేక్ హేండ్ ఇచ్చేలోపు..దురదృష్టం లిప్ కిస్ ఇచ్చి వెళిపోతోంది
2.ఏ అమ్మాయయితే నన్ను వద్దు అని వెళిపోయిందో ఇవాళ నేను మాత్రమే కావాలని వచ్చింది..అది నాకు గర్వంగాఉంది..
3.తలవంచుకున్న ప్రతీసారీ సిగ్గుపడినట్టుకాదు
కుటుంబ విలువలకి,సమాజం లో మంచి స్థానానికి లింక్ ఉంటుంది అని గట్టిగా నమ్మి తీసిన సినిమా..
S/o సత్యమూర్తి కి విలువలే ఆస్థి
నాకు త్రివిక్రం మాటలే స్ఫూర్తి
ముందరే చెప్పాను ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే...ఇట్లు
......................వైదేహి...W/o సీతారామమూర్తి
cinema పై నా అభిప్రాయం ..
..................................
మనిషి శరీరంలో, హార్మోన్స్ సమతుల్యతలో మార్పు లు వల్ల
ఆరోగ్యం లో మార్పులుంటే..అతని నడవడిక వల్ల జీవన విధానం లో మార్పులొస్తాయి..నైట్రస్ ఆక్సైడ్ ని వాసన చూస్తే నవ్వొస్తుంది కానీ నవ్వడానికి వాడితే..యాంత్రిక జీవితానికి అలవాటుపడ్డట్టవుతుంది...ఇలాంటి ఆలోచనల సమాహారం ఈ సినిమా...
సత్యమూర్తి సినిమాలో ,సత్యమూర్తి కొడుకు అల్లు అర్జున్..తండ్రి తో, నాన్నా అపాత్రదానం చెయ్యకు అంటాడు...సత్యమూర్తి వెంటనే పదిమంది కి దానం చేస్తే ఒక్కడు సరిగా వాడుకున్నా మంచిదేగా.. అంటాడు...
సత్యమూర్తి తనకొడుకులకి ,బరువు బాధ్యతలు అప్పగించకుండా చనిపోతాడు..పెద్ద కొడుకు వెన్నెల కిషోర్ షాక్ లో ఉంటే..రెండో కొడుకు అల్లు అర్జున్ మాత్రం బరువు భాధ్యతలే జీవితం అనుకుంటాడు..తన తండ్రి కి ఉన్న మంచిపేరు ని అలాగే నిలపడం కోసం ఆస్థుల్ని వదిలేసుకుంటాడు...విలువలకోసం కోట్లు వదులుకుంటాడు.. మనిషికదా మరి..
...............అయినా సత్యమూర్తి కొడుకు, తండ్రి గొప్పదనం తలుచుకోవడం లో తండ్రిలేడనే వాస్తవాన్ని మర్చిపోతాడు...తండ్రి మంచితనాన్ని చాలా సంతోషంగా గర్వంగా ఫీలవుతూ ఉంటాడు...
బంధాలకోసం బరువులు ,బరువుగా అనిపించవు హీరోకి..భాద్యతలు కష్టం గా అనిపించవు...
ఈ క్రమం లోనే ఒక్కడు.. సత్యమూర్తి ని తప్పు పడతాడు..అది భరించలేడు కొడుకు...
..........అందుకే, కొడుకు ఫ్రెండ్ ఇలా అడుగుతాడు..ఒక్కడే కదరా మీ నాన్నని తప్పు పట్టిందీ అని
ఒక్కరే కదా సీతమ్మని తప్పు పట్టింది అని రాముడనుకుంటే....లవకుశులకి మాత్రమే రాముడు గుర్తుండేవాడు అని..
అందుకే రాజ్యం గెలిచినవాడు రాజు...రాజ్యాన్ని వదిలినవాడు రామచంద్రుడు
త్రివిక్రం...సాహసం ఏంటంటే..పనిగట్టుకుని రామాయణ,మహాభారతాల్ని విమర్శించే ఈకాలంలో వాటి గొప్పదనాన్ని చెప్పాలనుకోవడం..
నాకు నచ్చినట్టు..మాత్రమే బతుకుతాను అనేవాడు నా దృష్టిలో పదిమందిలో ఉన్నా ..ఒక్కడుగా ఉన్నా ఒకటే..కానీ త్రివిక్రం మాత్రం ఎలా ఉన్నా ఫరవాలేదు కానీ మనిషిలా బతకమంటాడు..అది నాకు బాగా నచ్చిన విషయం....
బంధాలు నిలుపుకోవడం కోసం..మాట్లాడుకోవాలి..అహాన్ని,హోదాని,డబ్బుని పక్కన పెట్టగలగాలి అంటాడు...సత్యమూర్తి కొడుకు..ఇదే అతను తన తండ్రి నుండి నేర్చుకున్నది.
ఇవాళ్టిరోజున చాలామంది మిస్ అయినవి..కన్వీనియంట్ గా మిస్ చేసుకునేవాటిని ప్రేక్షకులకి చెప్పే ప్రయత్నం చేసాడు త్రివిక్రం..
యూత్ కి కావల్సినవేమీ లేవు...మసాలా అసలేలేదు...మామూలు తెలుగు సినిమా ని కసి గా తీసాడు అంతే...
ఏ బంధం అయినా అమోదయోగ్యం కావాలికాని..స్వార్ధ జీవితానికి దారి కాకూడదంటాడు త్రివిక్రం
ఈ సినిమా, ఈరోజున నచ్చని వాళ్ళకి..రేపొద్దున్న తన పిల్లలతో మనవలతో ఉన్నప్పుడు గుర్తొస్తుంది...గమనించండి..నచ్చుతుంది అనడం లేదు నేను...గుర్తొస్తుందని మాత్రమే అంటున్నాను
సినిమా కదా లోపాలు ఉన్నాయి..కొన్ని పాత్రలు లేకపోయినా నడుస్తుంది కూడా..
.........................
సినిమాలో కేరక్టర్స్....
అల్లు అర్జున్ కి ఫలానా సినిమానే చేస్తాడనే ఇమేజ్ లేదుకాబట్టి బాగా చెయ్యగలిగాడు...సమంత అవసరం లేకపోయినా లోనెక్ వేసింది అయినా బావుంది..అంతే ఈజీగా ,ఇగోలకి, పోకుండా నటించింది..స్నేహ సన్నగా చలాకీ గా ఉంది...ఇక నిత్యామీనన్..ఇవాళ ట్రెండ్ జీరో సైజ్ అని తెలిసినా తన నటనముందు గ్లామర్ బలాదూర్ అనిపించింది...
వెన్నెల కిషోర్ ఇవాళ ఇండస్ట్రీకి వాంటెడ్ కమెడియన్...
మొట్టమొదటిసారి విలన్ ఉపేంద్రకి మంచి కత్తిలాంటిపాటపెట్టి ..గౌరవం పెంచే ప్రయత్నం చేసాడు..త్రివిక్రం
బ్రహ్మానందం,ఆలీ..గిరి...అందరూ వాళ్ళ పరిధిమేరకు నటించారు
కోటా,ప్రకాష్ రాజ్,ఎం ఎస్ నారాయణ,రావు రమేష్..లాంటివారి నటనకు పేరు పెట్టే ఆస్కారం వాళ్ళు ఇవ్వరు.ఇందులో హీరోకి ఉద్యోగం ఇచ్చే ఫ్రెండ్ కేరక్టర్ చేసినతను ఎవరో నాకు తెలీదు కానీ చాలాబాగా నటించాడు
ఇది పూర్తి కుటుంబ కధా చిత్రం అడుగడుగునా త్రివిక్రం మార్క్ మాటలు కనిపించే సినిమా..పాటలు మూడు బావున్నాయి.
నాకు ఈ సినిమాలో నచ్చిన డైలాగ్స్ లో మూడు గుర్తున్నాయి
1.అదృష్టం నీకు షేక్ హేండ్ ఇచ్చేలోపు..దురదృష్టం లిప్ కిస్ ఇచ్చి వెళిపోతోంది
2.ఏ అమ్మాయయితే నన్ను వద్దు అని వెళిపోయిందో ఇవాళ నేను మాత్రమే కావాలని వచ్చింది..అది నాకు గర్వంగాఉంది..
3.తలవంచుకున్న ప్రతీసారీ సిగ్గుపడినట్టుకాదు
కుటుంబ విలువలకి,సమాజం లో మంచి స్థానానికి లింక్ ఉంటుంది అని గట్టిగా నమ్మి తీసిన సినిమా..
S/o సత్యమూర్తి కి విలువలే ఆస్థి
నాకు త్రివిక్రం మాటలే స్ఫూర్తి
ముందరే చెప్పాను ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే...ఇట్లు
......................వైదేహి...W/o సీతారామమూర్తి
సభ్యత్వం ఇంతేనా ,అంటూ కాంగ్రెస్ నేతల అలసత్వం పై కాంగ్రెస్ రాష్ట్ర
వ్యవహారాల ఇన్ చార్జ్ రామచంద్ర కుంతియా పాపం చాలా ఆవేదన వ్యక్తం
చేస్తున్నారు...
ఏదో కనీసం లో కనీసం ఓ పాతిక లక్షలమందేనా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకుంటుందని ఓవర్ ఎక్పెక్టేషన్స్ లోఉన్నారు మన మాష్టారు...
తెలంగాణా ఇచ్చింది కాంగ్రెస్ కదా అలాంటప్పుడు ఎందుకు జాయిన్ అవరూ అనేది ఈయనగారి డౌట్..
గురువుగారూ ఇంకా ఎన్నిరోజులీపాట పాడతారు..ఆ..కొత్తవి ట్రై చెయ్యచ్చుగా..అస్తమానూ ఒకటే మాట్లాడకపోతే..
అంటే ప్రజల అభిప్రాయాలతో మీకు సంబంధం లేదా..మీ తృప్తి కోసం మీ జనం దొంగ సభ్యత్వాలు చూపించాలి, మీకు అప్పుడు హేపీనా .....అలా ఐతే మీకు బావుంటుందేమో...
సభ్యత్వం కంటే మీ విధానాలేంటో ప్రజలముందు పెట్టండి..తెలంగాణా ఇచ్చి చేతులు దులుపుకోలేదు అనే నమ్మకం కలిగించండి...
లక్ష్యం ఏంటో చెప్పడం లో పెద్ద గొప్పేముంది సార్...మార్గం చూపించండి..అది గొప్ప..
ఇవాళ మీరేం చేసారో గుర్తుపెట్టుకున్న ప్రజలు..చరిత్రని మర్చిపోరుగా..
పైగా నమోదు మీద నిర్లక్ష్యం చూపించేవాళ్ళ మీద చర్యలు తీసుకుంటార్ట...జోకులేస్తున్నారా మాష్టారూ..మీరు చర్యలు తిసుకునేదాకా wait చేయ్యడానికి వాళ్ళు టికెట్ తీసుకుని రైల్ ఎక్కిన పాసెంజర్స్ కాదు..
వాళ్ళు కూడా నాయకులు...వెంటనే అధికారపార్టీలోకి జంప్ చేసేస్తారు....రూల్ చెయ్యకండి...వెయిట్ చెయ్యడం తప్ప వేరేదారిలేదు మీకు
All the Best కుంతియా
ఏదో కనీసం లో కనీసం ఓ పాతిక లక్షలమందేనా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకుంటుందని ఓవర్ ఎక్పెక్టేషన్స్ లోఉన్నారు మన మాష్టారు...
తెలంగాణా ఇచ్చింది కాంగ్రెస్ కదా అలాంటప్పుడు ఎందుకు జాయిన్ అవరూ అనేది ఈయనగారి డౌట్..
గురువుగారూ ఇంకా ఎన్నిరోజులీపాట పాడతారు..ఆ..కొత్తవి ట్రై చెయ్యచ్చుగా..అస్తమానూ ఒకటే మాట్లాడకపోతే..
అంటే ప్రజల అభిప్రాయాలతో మీకు సంబంధం లేదా..మీ తృప్తి కోసం మీ జనం దొంగ సభ్యత్వాలు చూపించాలి, మీకు అప్పుడు హేపీనా .....అలా ఐతే మీకు బావుంటుందేమో...
సభ్యత్వం కంటే మీ విధానాలేంటో ప్రజలముందు పెట్టండి..తెలంగాణా ఇచ్చి చేతులు దులుపుకోలేదు అనే నమ్మకం కలిగించండి...
లక్ష్యం ఏంటో చెప్పడం లో పెద్ద గొప్పేముంది సార్...మార్గం చూపించండి..అది గొప్ప..
ఇవాళ మీరేం చేసారో గుర్తుపెట్టుకున్న ప్రజలు..చరిత్రని మర్చిపోరుగా..
పైగా నమోదు మీద నిర్లక్ష్యం చూపించేవాళ్ళ మీద చర్యలు తీసుకుంటార్ట...జోకులేస్తున్నారా మాష్టారూ..మీరు చర్యలు తిసుకునేదాకా wait చేయ్యడానికి వాళ్ళు టికెట్ తీసుకుని రైల్ ఎక్కిన పాసెంజర్స్ కాదు..
వాళ్ళు కూడా నాయకులు...వెంటనే అధికారపార్టీలోకి జంప్ చేసేస్తారు....రూల్ చెయ్యకండి...వెయిట్ చెయ్యడం తప్ప వేరేదారిలేదు మీకు
All the Best కుంతియా
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)