పొద్దున్నే ఓ Good Morning పోస్ట్ ..తర్వాత ఆరోజు ని, ఏ దేవుడి
రోజనుకుంటామో ఆ దేవుడి ఫొటో తోపాటు పోస్ట్.వెంటనే break fastకి
సంబంధించీ..ఇడ్లీ,దోశ,పూరీ ఆ మర్చిపోయాను.. పెసరట్టు ఉప్మా ఇలాంటివాటి
ఫొటోస్ తో ఉన్న ఒకపోస్ట్..ఇవన్నీ చూస్తుంటే మధ్యలో AP తెలంగాణా,కేంద్రానికి
సంబంధించినవార్తలు కొన్ని..అక్కడక్కడ,పులులు,పిల్లులు,గులాబీలు..కూడా
కనపడుతున్నాయి...నిజంగా ఇంత శ్రద్ధగా పోస్ట్లు పెట్టేవాళ్ళకి
వందనాలు...ఎందుకంటే..ఇవేమీ నాకులేవు..కనీసం నేర్చుకోవాలని కూడా ఉండట్లేదు
ఎందుకంటే..ఆ ఎలాగూ, ఎవరోఒకరు ఈ శ్రమ పడుతున్నారుకదా..అని కావచ్చు..సహజంగానే నాకూ ఆసక్తి తక్కువనేది కూడా ఒకకారణం అవ్వచ్చు.
కానీ సాక్షిపేపర్ కి నాకులేని మంచిలక్షణాలు చాలా ఉన్నాయి..అదేంటంటే
ఆల్రెడీ వర్షాలు లేవని తెలుసు..ఎండాకాలం అంటే ఎండ ఎక్కువ ఉంటుందనీ
తెలుసు.భూగర్భ జలాలు ఇంకిపోయాయనీ తెలుసు...నీటి కష్టాలు ఉంటాయనీ
తెలుసు...నేను తెలంగాణా గురించి మాట్లాడుతున్నానండి...ఈ సమస్య గురించి
రాస్తూ ఓ ఫొటో కూడా పెట్టింది..దయచేసి ఎవరయినా ఆ ఫొటో చూస్తే కనుక తెలంగాణా
లో ఆ ఫొటో ఉన్న ప్రాంతం ఎక్కడుందో చెప్పండి..నాకయితే
తెలీదు..తెలుసుకుందామని మాత్రమే అడుగుతున్నాను...అంతకుమించి వేరే ఏమీ కాదు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి