ఆంధ్రప్రదేశ్ ...తెలంగాణా,ఆంధ్రా అని రెండు రాష్ట్రాలుగా విడిపోయాకా
మొట్టమొదటి తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
గారి పుట్టినరోజు సందర్భంగా రెండు మాటలు..
ఫిబ్రవరి 17, 1954 లో మెదక్
జిల్లా లో పుట్టిన KCR తెలుగు లిటరేచర్ లో ఉస్మానియా యూనివర్సిటీ నుండి
మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నారు..1970 లో యూత్ కాంగ్రెస్ సభ్యుడిగా సంజయ్
గాంధీ నాయకత్వం లో పనిచేసారు..1983 లో TDP లో చేరారు..అప్పట్నుండీ అంటే..
ఎన్ టీ రామారావు గారి నాయకత్వం లోనూ, బాబు గారి నాయకత్వం లో కూడా పనిచేసి..2000-2001
లో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా కూడా పనిచేసిన KCR ..ప్రత్యేక తెలంగాణా
రాష్ట్రం ఎలాగైనా సాధించాలనే కసి,పట్టుదలతో తెలంగాణా రాష్ట్ర సమితి
స్థాపించారు..
2004 లో కాంగ్రెస్ తో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిందీ ,..2009 లో TDP తో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిందీ...ఈ TRS పార్టీనే
అయినా ..లక్ష్యం మాత్రం ప్రత్యేక తెలంగాణా మాత్రమే
మొత్తానికి విపరీతమయిన కృషి,పట్టుదలతో ..సోనియాగాంధీ ని మెప్పించి తెలంగాణా సాధనలో సఫలం అయ్యారు..KCR
తెలంగాణా ప్రజలు ఈయన కష్టాన్ని గుర్తించి ముఖ్యమంత్రిని చేసారు
ఇప్పటికీ ఎంతసేపు మాట్లాడాల్సివచ్చినా ఎదురుగుండా script పెట్టుకోని వ్యక్తి..
సమయానుకూలంగా సెటైర్స్ వెయ్యగల తెలివి..
విపరీతంగా చదివే అలవాటు ఉన్న KCR కి
జన్మదిన శుభాకాంక్షలు...
..........వైదేహి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి