Translate

15, ఏప్రిల్ 2015, బుధవారం

మధ్యాన్నం పూట ఈ చానల్స్ లో వంటల కార్యక్రమాలొస్తుంటాయి కదా..అందులో anchor తోపాటూ ఎక్కడెక్కడినుంచోవచ్చి participate చేసేవాళ్ళూ కనిపిస్తుంటారు,వాళ్ళు వచ్చి వంటలు చేస్తారు..
అయితే participants ..బాగా ప్రిపేర్ అయి start చెయ్యగానే ..anchor కాస్తా...అదేంటీ ఉప్పెక్కువవ్వదా..బెల్లం వేస్తున్నారేంటీ..మీరు కారాలు తక్కువ తింటారా..ఇలా చేస్తున్నారు కదా ఇది ఎందులోకి బావుంటుంది..
ఇలా ప్రశ్నలు వేసి పాపం చాలా విసిగించేసి..చేసేవాళ్ళ సహనాన్ని తినేస్తే ..కొత్తగా కెమేరా ముందుకొచ్చినవాళ్ళకి ఇబ్బందిగా ఉండదా..
ఆల్రెడీ ingredients వేసేసాకా ఇంక ఈవిడ అడిగేదేంటీ..వాళ్ళు చేప్పేదేంటీ..
వంట చెయ్యడానికొచ్చినవాళ్ళని చెయ్యనివ్వండి..తర్వాత ఎలాగూ taste చేస్తారుగా అప్పుడు మీ అభిప్రాయాలు చెప్పండి..లేదా మీకేంకావాలో అవే చెయ్యాలని condition పెట్టి అవిచేసేవాళ్ళనే పిలవండి..
అంతేకానీ ఊరికే మధ్యలో వాయించేస్తే పాపం వాళ్ళు confuse అవుతారు..
ఇప్పుడూ ..ఈ anchors నాన్ స్టాప్ గా మాట్లాడేస్తుంటే మధ్యలో వాళ్ళ మాటలకి అడ్డుపడుతూ విసిగిస్తే ఊరుకుంటారా..ఎవరయినా అంతే... పని చేసేవాళ్లని చెయ్యనివ్వండి...
మామూలుగా మాట్లాడుతూ వాళ్ళకి సరదా వాతావరణం కల్పించడం వేరు..పనిగట్టుకుని criticize చేస్తూ మాట్లాడ్డం వేరు
తేడా తెలుసుకుని సామాన్యప్రజానీకానికి సహకారం అందించండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి