KCR
కి తెలంగాణా..అందులోనూ హైదరాబాద్ మీదున్న ప్రేమాభిమానాలకు
జోహార్లు..ఏంటండీ మాట్లాడితే వంద కోట్లు అంటున్నారు మరి...నిజంగా తెలంగాణా
ఆర్ధికంగా అంత మంచిపొజిషన్ లో ఉందని నాకు తెలీనేలేదు..
మిషన్
కాకతీయ,హుస్సేన్ సాగర్ చుట్టూ బిల్డింగ్స్,వినాయక నిమజ్జనానికి..ప్రత్యేక
చెరువు,కొత్త సచివాలయం అదీ పర్ఫెక్ట్ వాస్తు తో..ఇవే కాకుండా కోట్లాది
రూపాయల మొక్కుబడులు...
నాకోవిషయం అర్ధమయ్యింది..ఈయన ఎక్కడ అడుగుపెడితే అక్కడ వరాలిస్తున్నారు..అన్నిటికంటే కూడా నిన్న యాదగిరిగుట్ట కిచ్చిన వరం మాత్రం అసామాన్యం..ఏడాదికి
100 కోట్లు సేంక్షన్ చేసారు..ఆధ్యాత్మిక కేంద్రంగా డెవలప్
చెయ్యడానికి..ఏడాదికి వందకోట్లండీ సరిగ్గా వింటున్నారుకదా నేను
చెప్పేది..అదీ విషయం మరి.
ఐతే మా KTR ఏవన్నా
తక్కువనుకుంటున్నారా..అదేనండీ తెలంగాణా IT మినిష్టర్..తండ్రికి తగ్గ కొడుకు
ఈయన..ఏకంగా లక్షకోట్ల ఎగుమతులు మాలక్ష్యం అని చెప్పేసారు.
ఒకప్పుడు IT ఎగుమతుల్లో బెంగుళూర్ తర్వాతి స్థానం లో నిలిచిన హైదరాబాద్ కు పూర్వ వైభవాన్ని తెచ్చేప్రయత్నం లో KTR బిజీగా ఉన్నారు
అందుచేత తెలంగాణా ముఖ్యమంత్రిగారు..శ్రీ KCR ,IT మినిష్టర్ శ్రీ
KTR..మీఇద్దరూ మా ఆతిధ్యం స్వీకరించీ..మమ్మల్ని ఆశీర్వదించి..అదీ మీ
స్టైల్లో..మదర్పితచందనతాంబూలాలు స్వీకరించ ప్రార్ధన
............................................ఇట్లు వీరవిధేయురాలు .....................వైదేహి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి