Translate

16, ఏప్రిల్ 2015, గురువారం

పవన్ కల్యాణ్... బాబుగార్ని కలవటం అయిపోందా..సరే భోజనం టైం అవుతోందికదా..మా ఇంటికి వచ్చెయ్..
తినేసాకా ఢిల్లి వెళ్దాం...నేను చెప్పేది విను..ఇప్పుడు మన ప్రధానమంత్రి ని పదిసార్లు వెళ్లి కలవటం ,20 సార్లు మన సమస్యలు చెప్పటం తప్పేమీ కాదు..పౌరుషానికెందుకు వెళ్లటం చెప్పు..మనం ఓట్లేస్తేనేకదా ఆయన ప్రధాని అవుతా..
ఆయనకేవన్నా పిల్లలా,సంసారామా..ఏవీలేవుకదా..మనల్ని కాక ఇంకెవర్ని చూడాలి ..కాకపోతే గజనీ లాగా ఏంచెయ్యాలో మర్చిపోయారు..మనం గుర్తుచేద్దాం..అవసరం మనది...
పోలవరానికి లాస్ట్ యియర్ 250 కోట్లు ఇచ్చారు ఇప్పుడు 100 కోట్లే ఇచ్చారేంటండీ అని అడుగుదాం..తెలంగాణా ముఖ్యమంత్రి అయితే సంవత్సరానికి యాదగిరిగుట్ట అభివృద్ధికే 100 కోట్లిస్తానన్నారనే విషయం ఆయనికి తెలీదేమో మనమే చెప్దాం...అంతేనా ..ఇంకా చాలాఉన్నాయి అవన్నీ మాట్లాడుకుని...
అమ్మో ఇప్పటికే ఒంటిగంట అయ్యింది త్వరగా రా నీకోసం చిట్టిముత్యాలు రైస్ తో బిర్యానీ చేసాను..తినేసి ఢిల్లీ వెళదాం సరేనా...నువ్వేం మొహమాటపడకు నేనూ నీతో వస్తాను కదా..

1 కామెంట్‌:

  1. ఫుల్ మీల్స్ అయితే పంచుకుందాం.. ప్లేట్ మీల్ అయితే నంజుకుందాం..
    ఎక్కువైతే గుంజుకుందాం.. కాకుంటే గింజుకుందాం..

    రిప్లయితొలగించండి