ఈ జెమినీ టీవీవాళ్ళని మెచ్చుకోవాలి...కరెక్ట్ గా ఏ హీరో.. సినిమా రిలీజ్
అయితే ఆ హీరో పాత సినిమాల్లో ఏదో ఒకదాన్ని..అలాగే తన స్టార్
పరీక్షించుకోవడానికి ఏ డైరెక్టర్ తన కొత్త సినిమాని ప్రేక్షకులముందు
వుంచితే ఆ డైరెక్టర్ సినిమాని..హిట్ తో సంబంధం లేకుండా..వేస్తూ ఉంటారు
త్రివిక్రం డైలాగ్స్ ని,పంచ్ లని ఇష్టపడనివాళ్ళు చాలా రేర్ గా
ఉంటారు...సినిమా ని ఎంజాయ్ చేస్తూ అతను వేసిన సెటైర్ ని మర్చిపోతాం
కూడా...అయితే ఈ మధ్యన కొంచెం ఎమోషనల్ అవుతోంది, సినిమాలు సాగుతున్నాయనేది
తెలిసినా కూడా ..హీరో ఇమేజ్ కూడా కొన్నిసార్లు కారణం కావచ్చేమో ...అతని మాటలని మెచ్చుకుంటాం...
జెమినీ లో ఖలేజా వస్తోంది.....ఈ సినిమా కమర్షియల్ గా హిట్ కాకపోయినా..ఎంజాయ్ చెయ్యడానికి బానే ఉంటుంది...
నాకు త్రివిక్రం spontaneity..అంటే ఇష్టం,
...మొన్న సమంత.. త్రివిక్రం ని ఇంటర్వ్యూ చేస్తూ ఒక ప్రశ్న అడిగింది.....మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను అని..
వెంటనే త్రివిక్రం... నాకు ఆన్సర్స్ తెలీని ప్రశ్నలేమీ లేవే...అని అనేసాడు
That is Trivikram
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి