Translate

15, ఏప్రిల్ 2015, బుధవారం

ఏవిటో నేను "గోవిందుడు అందరివాడేలే "సినిమా చూస్తున్నాను...సినిమా బావుంది అంటే బానేవుంది...హీరోయిన్ వచ్చినప్పుడల్లా బావుంటోంది..
ఒక్కోసారి అర్ధమవ్వట్లేదు..సినిమా నిండా రంగులెక్కువగా ఉన్నాయి..అందరూ పెద్ద పెద్ద బొట్లు పెట్టుకున్నారు..బాగా పసుపు రంగు రాసుకున్నారు..సినిమా అంతా అలాగే ఉంటారేమో మరి..
మొత్తానికి ఈ సినిమా, పల్లెటూర్లో హాస్పిటల్ పెట్టడం వల్ల లాభాలు,నష్టాలు .. గురించనే విషయం ఇప్పటికర్ధమయ్యింది నాకు..
మీరంతా తెలివైనవాళ్ళు కాబట్టి మీకు ముందరే అర్ధమయిపోయుంటుంది...ఇందాకటిదాకా కర్రసాము చేసారు..బావుంది ఇప్పుడు చెయ్యరేమో మరి..
కర్రసాము బావుంది చాలారోజులయ్యిందిచూసి. మావూర్లో చేసేవారుకానీ ఈ సినిమాలోలా కాకుండా వేరేగా ఉండేది...
ఏదోఒకటి మొత్తానికి తెలుగులో వచ్చిన నాలుగైదు సినిమాలు కలిపికొట్టేసినట్టున్నారు...
హిహిహి రాంచరణ్ పిలక భలే ఉంది..కికికి..హీరోయిన్ కి ఆకాస్త కూడా లేదు...అయినా బావుంది.
విపరీతమైన advt లమధ్య సినిమా చూస్తున్నా వీటి హడావుడిలో..ఒక్కోసారి ముందర జరిగింది గుర్తుకావట్లేదు...
అదీ విషయం ...మీరుకూడా చూడండి..ఖాళీగా ఉంటే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి