అసలు, ఏరాష్ట్ర బడ్జెట్ లో అయినా ప్రణాళికేతరవ్యయం ఎందుకు ఎక్కువగా
ఉంటుంది...అంటే ..ఎందుకేనా మంచిదని ఎక్కువ amount చెప్తారా..అదికూడా
ప్రణాళికా వ్యయం కంటే ఎక్కువ గా ఉంటుంది...
రాష్ట్ర ఆదాయం అనూహ్యం గా
పెరిగే అవకాశం ఉన్నా.. అంటే 100% పెరిగితే తప్ప ఈ లోటు పూడదు..ఎంత పన్నులు
పెంచినా..ఆదాయం కోసం ప్రభుత్వ భూములు అమ్మినా కూడా ఇంత డబ్బు సమకూర్చడం
జరుగుతుందా...కేంద్రం సాయం అనేమాట పక్కనపెడితే ఇది ఎంతవరకూ కరెక్ట్ అనేది
నాకు తెలీదు.
క్రితం సంవత్సరం 1,00.637 కోట్లు.. బడ్జెట్ అయితే అందులో ప్రణాళికా వ్యయం...48,648.47 కోట్లు
ప్రణాళికేతర వ్యయం 51,648.47 కోట్లు
ఈ సంవత్సరం 1,15,689.19 కోట్లు అయితే
అందులో ప్రణాళికా వ్యయం 52,383.19 కోట్లు
ప్రణాళికేతర వ్యయం 63,306..00 కోట్లు
పోనీ ప్రకృతి వైపరిత్యాలు,అనుకోని కష్టాలు ఉంటాయికదా అనచ్చు..దానిని
ప్రణాళికేతర వ్యయం లో చూపిస్తారోలేదో నాకు తెలీదు...ఒకవేళ చూపిస్తే
అప్పుడది కేంద్ర సాయం లోకొస్తుందా రాదా...
నాకిది ముందుజాగ్రత్తలా
అనిపించడం లేదు...ఖర్చులు పెంచుకుని పన్నులు పెంచడం కరెక్టా...సరే
భూములమ్మేస్తాం...మరిnext బడ్జెట్ లో కూడా ఇలాగే ఉంటే అప్పుడింకేం
అమ్ముతాం
300 ఎకరాలున్నవాడు ఖర్చులు పెరిగాయి ..సరిపోవడం లేదని ఒక ఎకరం
అమ్మితే 299 ఎకరాలు మాత్రం సరిపోతాయా... ఖర్చులు తగ్గనప్పుడు..అంచేత
అమ్ముకోవడం మాత్రమే మిగులుతుంది..మన బడ్జెట్ ని తగ్గించలేనప్పుడు ఆదాయం
పెరిగే మార్గం చూసుకోవాలి.
ఇదెలా ఉందంటే suppose నాకు ఒక లక్షరూపాయలు నెలకు ఆదాయం ఉంది కానీ నా ఖర్చులు 2 లక్షలున్నాయి అన్నట్టే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి