ఇంగ్లాండ్ పర్యటనలో విరాట్ కోహ్లీ వైఫల్యానికి నన్ను కారణం అనడం తగదు...అనుష్క శర్మ.
అనుష్కా, అతను గెలిచినప్పుడు బేట్ ఎత్తి నీకు చూపించాకే కదా మాకు
చూపించాడు..అప్పుడు, ముందర అభిమానులు ఆతర్వాత నేను అని చెప్పావా లేదు పైగా
ముసిముసినవ్వులు నవ్వుకున్నావు...
అతను బాగా ఆడినప్పుడు..అనుష్క ఎంకరేజ్ చెయ్యటం వల్లే ఆడాడు అని పేపర్లలో వస్తే నువ్వేమయినా కాదు అన్నావా..హేపీ ఫీలయ్యావు..
అదిగో అప్పుడలాఉంటే..ఇప్పుడిలా ఉండాల్సివస్తుంది మరి...
అతను ఆడుతుంటే విపరీతం గా ఎంకరేజ్ చేసావాలేదా..ఏదో నీకు ఖాళీ లేక ఈ మధ్యన కనిపించడం లేదు గానీ అతని వెనక్కాల నువ్వున్నావనేది ఓపెన్ సీక్రెట్ కదా.
.క్రికెటర్లని పరిణతి చెందిన వ్యక్తులుగా చూడండి అంటున్నావు బానేవుంది....ఇక్కడ అతన్నెవరూ ఏమీ అనలేదు....
కానీ ఒక సెలెబ్రిటీ కి సంబంధింతవరకూ సమాజం ఇలాగే ఉంటుంది...నువ్వు దానికి అలవాటుపడిపో..నీకు బాధ అనిపించినా తప్పదు.
.ఎందుకంటే ఎవరు అవునన్నా కాదన్నా..ఒకసారి సెలబ్రిటీ అయితే ఇంక
వాళ్ళకి,ప్రైవేట్ పబ్లిక్ అనే రెండు జీవితాలుండవు...ఇదీ లోకం తీరు..ఇలాగే
ఉంటుంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి