దేశం లో మొట్టమొదటిసారి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి జిల్లా కలెక్టర్ కి
పది కోట్లిచ్చి అభివృద్ధి కి ఖర్చు పెట్టమన్నారు..బావుంది కేసీ ఆర్ గారు..
జిల్లాకి పది కోట్లంటే వందకోట్లు...మొన్నామధ్యన మేయర్స్ కి ,కార్పొరేటర్స్ కీ కూడా భారీ గా జీతాలు కూడా పెంచారు..
నాకయితే ఒక్కసారి కలెక్టర్లు వాళ్ళ జిల్లాలో విస్తృతంగా తిరిగి..ఒక్కసారి
నీటి సమస్య..డ్రైనేజ్ సమస్య గురించి ఒక అవగాహన కొచ్చి నివేదికలివ్వడం
అవసరమయితే డబ్బు ని ఖర్చు పెట్టడం లాంటివి చేస్తే బావుంటుందనేది నా
అభిప్రాయం..
వాటికి ఆ శాఖల మంత్రులున్నారని అనచ్చు...ముఖ్యమంత్రే ముందుకొచ్చినప్పుడు వీరు కూడా ఇలా చెయ్యటం తప్పుకాదు...
కలెక్టర్ స్థాయి వ్యక్తులు ముందుకొస్తే సమస్యలు కొంతవరకూ
తీరచ్చు...ఇందులోకూడా అవినీతి జరుగుతుందనేవాళ్లకు నేనేమీ
చెప్పలేను...అవినీతి చెయ్యాలంటే ఎలాగయినా చెయ్యచ్చు...అది విషయం కాదు.
ఇప్పటికే వెనకబడిన అదిలాబాద్ లాంటి జిల్లాను ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉందని నా ఫీలింగ్.
#All the Best To the collectors#
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి