Translate

15, ఏప్రిల్ 2015, బుధవారం

ఉగాది అనగానే కొత్తపంచాగం గుర్తొస్తుంది..అందుకే...పంచాగం లో కన్యారాసి, ఉత్తరఫల్గుణి నక్షత్రం ,మూడవపాదానికి జాతకం రాసేవారు జాగ్రత్తగా,శ్రద్ధగా రాయండి...
ఆదాయం 14..వ్యయం 0 అని
రాజపూజ్యం 6..అవమానం 0 అని
రాయటం వీలయితే రాయండి..నేనేం నాగురించి అడగట్లేదు..మీరు రాసేది లక్ష్మీ దేవి,అర్జునుడు పుట్టిన నక్షత్రానికి అని మర్చిపోతారేమోనని గుర్తుచేస్తున్నా అంతే.
అంటే ..మీరేదో ఆ ముఖ్యమంత్రికీ, ఈ ముఖ్యమంత్రికీ,గుళ్ళలో,ఆధ్యాత్మిక కేంద్రాల్లో..పంచాంగ శ్రవణానికి ..అదే చెప్పడానికి వెళ్ళే హడావుడిలో ఉంటారని ఓ ముక్క మీ చెవిలో వేస్తున్నా
వర్షాలు బాగా కురుస్తాయని..కష్టాలు,నేరాలు ఉండవని...తప్పకుండా రాయండి...కాస్త హేపీగా పండగ చేసుకుంటాం..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి