ప్రతీ సెకన్ ని పట్టించుకుంటూ..చాలా జాగ్రత్తగా ఉంటూ..మంచి బిజినెస్ మైండ్ ఉన్నవాడు ప్రేమిస్తే..
.........................................
ప్రియమైన నీకు...
నేను నిన్ను జనవరి 2, 2015 న ఉదయం 7:45 నిమిషాలకి పంజాగుట్ట సాయిబాబా
గుళ్ళో చూసాను..నీకుభక్తి మరీ ఎక్కువనుకుంటా..ప్రదక్షిణాలమీద ప్రదక్షిణాలు
చేసి నువ్వు బయటికొచ్చేసరికి టైం కాస్తా 9:30..అయినా నా విలువైన టైం ని
వేస్ట్ చేసుకుని ఉన్నానంటే కారణం నువ్వు అందంగా ఉండటం ఒకటైతే ..నాకిష్టమైన
లంగా ఓణీ వేసుకు రావడం మరొకటి.సరే నాకు ఆఫీస్ కి టైం అయ్యిందని నేను వెళిపోయాననుకో .
మళ్ళీ నువ్వు వారం రోజులకి అంటే జనవరి 9 సాయంత్రం 5:20 కి "బిగ్
సినిమాస్"దగ్గర కనిపించావు..అప్పుడూ బానే ఉన్నావనుకో ..నేనే వెంటనే, నీ
దగ్గరకొచ్చి మాట్లాడదామనుకుంటే ..నువ్వెవరో కోన్ కిస్కాతో
మాట్లాడుతున్నావ్(of course ..నేను తప్ప ఎవరున్నా నీతో, నాకలాగే
అనిపిస్తుంది ఆ టైం లో )
సరే అక్కడికొచ్చి ,నా హీరోయిజం ప్రదర్శించి
,అతన్ని బాధపెట్టి నా విలువైన టైం వేస్ట్ చేసుకుంటూ నిన్నూ,నీ సోదిని
భరించడం కష్టమనిపించి wait చేసాను
ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి తింటూ 70 కేజీలున్న నేను ఇంకోరెండు కేజీలు పెరిగాను.
సరే మొత్తానికి నిన్ను ఫాలో అయి జాగ్రత్తగా మీ ఇంటిముందు ఐరన్ చేసేవాడి దగ్గర details కనుక్కుని నీకీ ఉత్తరం రాస్తున్నా...
నేను నిన్ను ప్రేమిస్తున్నాను..ఏం చూసి అని అడక్కు..ఎవడయినా ముందర అందమే చూస్తాడు..అది నీకు కావల్సినంత ఉంది..
నేను సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నా..అన్నీ పోను చేతికి లక్షరూపాయలు
వస్తాయి..మార్కెట్ లో నాకు దగ్గరదగ్గర ఓ 50 లక్షలు కట్నం వచ్చే అవకాశం
ఉందని టాక్..నువ్వంత ఇవ్వక్కరలేదు ఓ 49 లక్షలు చూసుకో చాలు..
కానీ
ముందర నన్నో మూణ్ణెళ్ళు ప్రేమించాలి..ఎందుకంటే నేను కట్నానికి,నీ అందానికి
పడిపోయానని గానీ ,నువ్వు నా ఉద్యోగానికి పడిపోయావని గానీ ప్రజలు
అనుకోకూడదు...ఈ మూణ్ణెళ్ళ టైంలో నేను నిన్ను ముద్దులు మాత్రమే
పెట్టుకుంటాను అదీ అప్పుడప్పుడు..ఎందుకంటే నా టైం వేస్ట్ అవకూడదు
కదా..నీకిష్టం లేకపోతే తిరిగి ఇచ్చెయ్యచ్చు వాటిని..
ఒకరకంగా నీకూ,నాకూ
"probation for a period " అనుకో ..మూణ్ణెల్ల తర్వాత నిన్ను పర్మనెంట్
చేస్తాను...అదే పెళ్ళి చేసుకుంటాను..తర్వాత నీకు..ప్రమోషన్లు,అవీ ఇవీ
ఉంటాయనుకో..
నీకు నా బంపర్ ఆఫర్స్ నచ్చితే నువ్వు అప్లై చెయ్యచ్చు అదే
నువ్వుకూడా ఒక లెటర్ రాసి పంపించు..లేదంటే నేను మళ్ళీ సాయిబాబా గుడికి
వెళ్తాను.
Best regards
నీ ప్రేమికుడు
.....
ఈ post Santosh Patnaik రాసిన ఒక post చూసి సరదాగా రాసాను...కాపీ చెయ్యలేదు..ఉపయోగించుకున్నాను అంతే.
ముందరే చెప్తున్నా ...సరదాగా తీసుకోండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి