Translate

30, జులై 2015, గురువారం

వేమూరి రాధాకృష్ణ గారూ మీకు కోపం KCR మీద,గవర్నర్ మీద..అంతేనా లేక గవర్నర్ గారి కులం మీద జంధ్యం వేసుకునే వాళ్లమీద కూడానా..
కంచె ఐలయ్యగారు మీకు కోపం KCR మీద, జంధ్యం వేసుకునేవాళ్ళమీదా...అంతేనా లేక గవర్నర్ మీద కూడానా
Transitive Property of Equality(A=B,B=C..then A=C) అనే సిద్ధాంతం ప్రకారం మీ ఇద్దరికీ రెండు పాయింట్ల మీద అభిప్రాయాలు కలిసాయి 
అని తెలుస్తోంది..
ఇవాళ చాలా అద్భుతంగా కంచె ఐలయ్య అనే మహానుభావుడు గారు, శ్రీ శ్రీ శ్రీ వేమూరి రాధాకృష్ణ గారి పేపర్ ఐన ఆంధ్రజ్యోతి లో అసలు KCR అనే ఆయన కేవలం గవర్నర్ గుండెల మీద ఉన్న జంధ్యం చూసి మాత్రమే గవర్నర్ కాళ్ళకి దండం పెట్టినట్టు చక్కగా సమీక్ష రాసారు...తెల్లారిలేచి తెలంగాణా లో ఎంతమంది బ్రాహ్మల పాదాలకి KCR దండం పెట్టడం ఈ ఐలయ్య చూశారో మరి.. నాకయితే తెలీదు.
ఇక వేమూరి అయితే బ్రాహ్మలు అల్ప సంతోషులు..అందుకే KCR అలా చేసారు అని మొన్న స్టేట్ మెంట్ ఇచ్చేసారు..
వాళ్ళ సంతోషం గురించి మీకెందుకు రాధాకృష్ణగారు ..మీ ప్రాబ్లం KCR, గవర్నర్ కదా వాళ్ళ గురించి పట్టించుకోండి చాలు.
ఒకవేళ గవర్నర్ మారితే అప్పుడు కూడా KCR ముఖ్యమంత్రిగా ఉంటే..కంచె ఐలయ్య గారు ఆయన ధోరణిలోనే వేమూరి రాధాకృష్ణ గారికి ఇలాగే సమీక్ష రాస్తారా..లేక.. అప్పుడు ఇద్దరికీ పొత్తులుండవా..నన్ను వేధించే ప్రశ్న ఇది
ఒక మీడియా ప్రతినిధి మెప్పు పొందడానికి ఒక కులం మీద విషం కక్కే కంచె ఐలయ్యగారు, ఒక ముఖ్యమంత్రి మీద, ఒక గవర్నర్ మీద కోపం తో అదే కులాన్ని టార్గెట్ చేసే వేమూరి రాధాకృష్ణ గారికి ప్రత్యేక అభినందనలు.
మీరిద్దరూ ఇలాగే ముందుకుపొండి..

రాజకీయమే బెటర్ కెరీర్.....

ఏ ఉద్యోగం లోనూ లేని బోల్డన్ని ఫెసిలిటీస్ ఒక రాజకీయం లోనే ఉన్నాయి..రిటైర్ మెంట్ లేదు..అన్ని పార్టీల డోర్స్ తెరిచే ఉంటాయి..మనకి ఇష్టం వచ్చినన్ని రోజులు సేవ చేస్తూనే ఉండచ్చు..నెమ్మదిగా ఎదగచ్చు..ఒక్కోసారి పార్టీ మారినప్పుడు ఇంక్రిమెంట్స్ అదే..పదవులు కూడా వరిస్తాయి..బలవంతంగా ఉండమని ఎవ్వరూ ఫోర్స్ చెయ్యరు.
అయితే ఒకవేళ ఉన్న పార్టీ లోంచి వేరే పార్టీ లోకి మారినప్పుడు మేం ఫలానా పార్టీ మారుతున్నాం అని మీడియాకి చెప్పాలి లేదంటే వాళ్లే మార్చేస్తారు..
ఇందాకా Ntv లో డి..శ్రీనివాస్ TRS లో జాయిన్ అవడం గురించి మాట్లాడుతూ ..ఆల్మోస్ట్ ఆంధ్రా లోకాంగ్రెస్ భూస్థాపితం అయిపోయిందని చెప్తూ..హర్ష కుమార్,ఉండవల్లి కూడా BJP లోకి జాయిన్ అయిపోయారు అని చెప్తున్నారు..వీళ్ళిద్దరూ నాకు తెలీకుండా ఎప్పుడు BJP లో జాయిన్ అయ్యారు..అందుకే ముందర మీడియాకి చెప్పడం మర్చిపోకూడదు.
ఇక ..ముందర ఒక పార్టీలోకి చేరాకా ..కొన్నాళ్ళు అందులో ఉండి..ఏవో కారణాలతో అది నచ్చక మళ్ళీ ముందున్న పార్టీలోనే చేరాలీ అనుకుంటే..అప్పుడు ఇలా మాట్లాడాలి..
ఏదో రాజకీయ గ్రహణం పట్టి పార్టీ వీడాను..అంతేకానీ నాకెలాంటి అభ్యంతరాలు లేవు..పార్టీ అధ్యక్షుడు ఒప్పుకుంటే మళ్ళీ వచ్చేస్తాను అని చెప్తూ వీలయితే ప్రస్తుతం వీడుతున్న పార్టీ మీద మాటల "దాడి" చేస్తే ఇంకా మంచిది
ఆవిధం గా ప్రతిఒక్కరూ నేను చెప్పిన పాయింట్స్ అన్నీ ఆలోచించి అందరూ విరివిగా రాజకీయాల్లో చేరి..సేవలు చెయ్యండి
............................
మన రాజకీయం..మన ప్రజలు..మన పార్టీలు
— feeling happy.

చాగంటి, మీకు మీరే సాటి

నిండు గోదావరిలా గంభీరంగా ఉండే ఆయన మాట్లాడుతూ ఉంటే..ఇంకా ఇంకా వినాలనే ఉంటుంది..సనాతన ధర్మం మీద ఆయనకున్న పట్టు చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది..మహనుభావుడు "చాగంటి కోటేశ్వర రావు"గారి ప్రవచనాలు ఎప్పటికీ పాఠాలే..ప్రతిఒక్కరూ అభినందించాల్సిందే ఆయన ప్రయత్నాన్ని..
ఆయనకున్న జ్ఞాపకశక్తికి,ఇతిహాసాలమీదున్న ప్రేమకి,గురువులమీదున్న గౌరవానికి..సమాజానికి పంచాలి అనే అభిమతానికి ఎన్ని సార్లు జోహార్లు చెప్పినా తక్కువే..
నిజానికి నాకు చాలాసార్లు ఈయనని ప్రభుత్వం గుర్తించలేదు అనే బాధ ఉండేది కానీ "జగమెరగిన బ్రాహ్మణుడికి జంధ్యమేల" అని ..ఈయనకి ప్రభుత్వ గుర్తింపు ఎందుకు..ప్రజల గుండెల్లో ఉన్నవారికి..
కైలాష్ సత్యార్ధిని మన ప్రభుత్వం గుర్తించలేదు..కానీ నోబెల్ బహుమతి గుర్తించింది..
నేను 12 యేళ్ళగా వింటూనే ఉన్నాను..అప్పుడప్పుడూ చూస్తూనే ఉన్నా..ఇంకా ఈయన దగ్గరున్న విజ్ఞాన సంపద మీద అభిమానం పెరుగుతూనే ఉంది
శ్రీనగర్ కాలనీ సత్యసాయి నిగమాగమం లో మొన్నటినుండి సంగీత,సాహిత్య,నృత్య సమ్మేళనం జరుగుతోంది ఈయన ఆధ్వర్యం లో..వ్యాఖ్యానం కూడా అంతే అద్భుతంగా ఉంది..అక్కడికి రాలేనివాళ్ళుTTD వారి SVBC లో LIVE ఇస్తున్నారు..చూడచ్చు..
రేపు గోదావరి పుష్కరాల్లో కూడా చాగంటి వారి ప్రవచనాలు..పుష్కర విశేషాలతో కూడిన కార్యక్రమం పెడితే బావుంటుంది
ఈ మహానుభావుడు ఉన్న రోజుల్లో నేనూ ఉన్నాను చాలు...
నిండు గోదావరిలా గంభీరంగా ఉండే ఆయన మాట్లాడుతూ ఉంటే..ఇంకా ఇంకా వినాలనే ఉంటుంది..సనాతన ధర్మం మీద ఆయనకున్న పట్టు చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది..మహనుభావుడు "చాగంటి కోటేశ్వర రావు"గారి ప్రవచనాలు ఎప్పటికీ పాఠాలే..ప్రతిఒక్కరూ అభినందించాల్సిందే ఆయన ప్రయత్నాన్ని..
ఆయనకున్న జ్ఞాపకశక్తికి,ఇతిహాసాలమీదున్న ప్రేమకి,గురువులమీదున్న గౌరవానికి..సమాజానికి పంచాలి అనే అభిమతానికి ఎన్ని సార్లు జోహార్లు చెప్పినా తక్కువే..
నిజానికి నాకు చాలాసార్లు ఈయనని ప్రభుత్వం గుర్తించలేదు అనే బాధ ఉండేది కానీ "జగమెరగిన బ్రాహ్మణుడికి జంధ్యమేల" అని ..ఈయనకి ప్రభుత్వ గుర్తింపు ఎందుకు..ప్రజల గుండెల్లో ఉన్నవారికి..
కైలాష్ సత్యార్ధిని మన ప్రభుత్వం గుర్తించలేదు..కానీ నోబెల్ బహుమతి గుర్తించింది..
నేను 12 యేళ్ళగా వింటూనే ఉన్నాను..అప్పుడప్పుడూ చూస్తూనే ఉన్నా..ఇంకా ఈయన దగ్గరున్న విజ్ఞాన సంపద మీద అభిమానం పెరుగుతూనే ఉంది
శ్రీనగర్ కాలనీ సత్యసాయి నిగమాగమం లో మొన్నటినుండి సంగీత,సాహిత్య,నృత్య సమ్మేళనం జరుగుతోంది ఈయన ఆధ్వర్యం లో..వ్యాఖ్యానం కూడా అంతే అద్భుతంగా ఉంది..అక్కడికి రాలేనివాళ్ళుTTD వారి SVBC లో LIVE ఇస్తున్నారు..చూడచ్చు..
రేపు గోదావరి పుష్కరాల్లో కూడా చాగంటి వారి ప్రవచనాలు..పుష్కర విశేషాలతో కూడిన కార్యక్రమం పెడితే బావుంటుంది
ఈ మహానుభావుడు ఉన్న రోజుల్లో నేనూ ఉన్నా.

బర్త్ డే బాయ్...రాహుల్

ఎప్పటికయినా ప్రధాని అయ్యే లక్షణాలున్నాయంటే మీరు నమ్మకపోవచ్చు,నేనూ నమ్మకపోవచ్చు.. కానీ కాలం పొలిటీషియన్స్ లో,ప్రజల్లో,పాలిటిక్స్ లో చాలా మార్పులు చూపెడుతున్నప్పుడు..రాహుల్ గాంధీలాంటి వ్యక్తి ప్రధాని అవ్వచ్చు..
అయితే ఈ విషయం కనుక నిజంగా జరిగితే తొమ్మిదో వండర్ అవుతుందనీ ..హటాత్తుగా..ప్రధాని అయితే ప్రజల్లో ఆరోగ్య సమస్యలేవన్నా రావచ్చనే ఉద్దేశం తో మాత్రమే ఆ పదవికి "కావాలనే"(దేవుడా..నా కామెడీకి హద్దులేకుండా పోతోంది)..దూరం గా ఉన్నాడు రాహుల్ అని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చెప్తున్నాయి..
.పెళ్ళయితే ప్రధాని అవుతాడో లేదో అని ..అంతే కాకుండా ఇంత చిన్న వయసులో పెళ్ళి చేసుకోకూడదని(?) చట్టం కూడా చెప్తున్నందున bachelor గానే ప్రధాని పదవికి ప్రయత్నం చేస్తున్న..ఆరడుగుల రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు....

హైవే రోడ్డూ, నా స్మార్ట్ ఫోనూ.....

తెలంగాణా R &B శాఖ మినిస్టర్ శ్రీ తుమ్మల నాగేశ్వర రావుగారికి ...
కూకట్ పల్లి నుండి అమీర్ పేట్ వరకూ వచ్చే రోడ్(ముంబై జాతీయ రహదారి )చాలా గతుకులతో నిండిపోయింది..దయచేసి వాటిని పూడ్చండి..అయితే అమీర్ పేట్ నుండి కూకట్ పల్లి వెళ్ళే రోడ్ బానేఉంది...
ఇవాళ నేను కూకట్ పల్లి నుండి అమీర్ పేట్ బండి మీద వస్తుంటే(మావారు డ్రైవ్ చేస్తున్నారు) నా ఫోన్ మోగింది..
ఆన్ చేసి మాట్లాడే లోపల, చిన్న గుంతలో పడిలేచిన మా బండి నిలకడగా బానే ఉంది కానీ ...నా ఫోన్ కిందపడి రెండు ముక్కలయ్యింది..
దీనికంతటికీ మీరే కారణం కాబట్టి నాకో "ఫోన్" కొనివ్వాల్సిన భాద్యత మీదే..same నా ఫోన్ లాంటిదే నాకు కొన్నివ్వక్కరలెద్దు..మీరు మీ స్థాయికి తగ్గట్టు ఒక లేటెస్ట్ మోడల్ "I Phone "కొనిచ్చినా సర్దుకుంటాను....నీకు నేనెందుకు ఇవ్వాలి అని మీరడగచ్చు...
"నా ఫోన్ ఇక్కడే కొన్నాను..నాకు కాల్ ఇక్కడే వచ్చింది...కూకట్ పల్లి,అమీర్ పేట్ ఇక్కడే ఉన్నాయి ..నాకు ఆధార్ కార్డ్ ఇక్కడే ఉంది..మీకూ ఆధార్ కార్డ్ ఇక్కడే ఉంది..ఇన్ని వివరాలు చాలని నా ఫీలింగ్..".
నా ఫీలింగ్ కి మీరు respect ఇవ్వడం మాత్రమే కాదు..gift గా ఫోన్ ఇవ్వడం మర్చిపోవద్దు..
అస్తమానూ నాకే ఎందుకు రాస్తున్నావ్ అని అడగచ్చు మీరు...మీ దగ్గర ఉన్న రెండు శాఖలే వీటికి సమాధానం...
నేను చాలా మంచిదాన్ని కాబట్టి నాకో కార్ కొనివ్వండి అని అడగటం మానేసి..ఫోన్ మాత్రమే అడుగుతున్నా..గమనించండి..(అలాగని ఫోన్ ఇచ్చి రోడ్లు పూడ్చడం మానకండి..అస్తమానూ ఫోన్లు,కార్లు కొనివ్వడం కంటే రోడ్లు పూడ్చడమే బెటర్ కదా)

డియర్ జగన్.....


నీ టైం ని ఎలా ఉపయోగించుకోవాలో నాలుగుమాటల్లో....
ల.పా ని అస్సలు మాట్లాడ్డానికి allow చెయ్యకు..ఎందుకంటే..మాట్లాడితే టీడీపీ మీద కోపం చూపించడం తప్ప తనుచేసేదేమీలేదు..అంటే నీ విధానాలు ప్రమోట్ చెయ్యడం లేదని చెప్పడం నా ఉద్దేశం..
ఇక బొ.స..అతను కూడా కాంగ్రెస్ ని,బాబు ని విమర్శించడానికి తనకొక ప్లాట్ ఫాం కోసం వచ్చాడని తనే చెప్పుకున్నాడు..నాకు బాబు అంటే ఇష్టం లేదు కాబట్టి నీ దగ్గరకొచ్చాను...అంటే..ఆ మాట ఎలాఉందంటే..."తమన్నా అంటే ఇష్టం కాబట్టి బాహుబలి చూస్తాను .అన్నట్టుంది".
అది నీ పార్టీకి ఏవిధంగా ఉపయోగపడుతుంది..ఇక రోజా,కొడాలి నానీ ఏం మాట్లాడినా అస్సలు పట్టించుకోకు..వీళ్ళిద్దరు కూడా నోటి పవర్ ఉన్నవాళ్ళే...వీలయితే వాళ్లని సపోర్ట్ చెయ్యి..
ఇక విషయం..ఓటు కి నోటు..ఇది టీ ఆర్ ఎస్,కి,తెలుగుదేశానికి జరిగే యుద్ధం . ఏం మాట్లాడకపోయినా నీకు ఆటోమేటిక్ గా లాభమే జరుగుతుంది...
at last...ప్రతిపక్షం అంటే అధికారపక్షాన్ని చేసేపనుల మీద మాత్రమే దృష్టి పెట్టేది కాదు..ప్రజల సమస్యల మీద కూడా మాట్లడగలగాలి.
రుణమాఫీ మీద మాట్లాడే అవకాశం ఎలాగూ ఉంది.
ప్రభుత్వ..విశ్రాంత,అవిశ్రాంత ఉద్యోగులకు సంబంధిన సమస్యలు...వీటిమీద మాట్లాడితే కూడా మంచిదే...

థ్యాంక్యూ, మంత్రి తుమ్మల గారూ

క్రిందటి బుధవారం(3/6/2015) స్టేట్ హోం నుండి 11 మంది అమ్మాయిలు తప్పించుకుని పారిపోతే అందులో ,ఇద్దరు గురువారం ఉదయం దొరికితే అదేరోజు మంత్రి "తుమ్మల నాగేశ్వరరావు గారు"..స్టేట్ హోం సమస్యల పై మాట్లాడారు..
ఈ విషయం మీద శుక్రవారం(5/6/2015)..నాడు నేను నా వాల్ మీద స్టేట్ హోం లోనే ఉండే రెస్క్యూ హోం ని వేరేచోటకి తరలించితే బావుంటుందని ఉచిత సలహా ఇచ్చాను...
ఈ విషయం ఎంతమందికి గుర్తుందో చేతులెత్తండి..
ఆ గుర్తుందికదా..ఇవాళ రెస్క్యూ హోం ని వేరేచోటకి మార్చుతున్నట్టు స్టేట్ మెంట్ ఇచ్చింది తెలంగాణా ప్రభుత్వం..చాలామంచిపని ఇది
..............................
నాలాంటి మధ్యతరగతి మహిళ సలహా స్వీకరించి..ప్రభుత్వం అమలు చేసిందంటే నమ్మలేకపోతున్నాను...ఇప్పుడు నాకు డాక్టరేట్ ఇవ్వడం కానీ..ఓ రెండు కోట్లు బహుమతి ఇవ్వడం కానీ జరుగుతుందో ఏవిటో..ఈ రెండూ చాలా తక్కువే అని ఏ పద్మశ్రీ నో ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చెయ్యరు కదా...
ఈ ఆలోచనలతో ఉదయం పేపర్ చూసిందగ్గరనుండీ బుర్ర పనిచెయ్యడం లేదంటే నమ్మండి...(అసలుంటే కద పనిచెయ్యడానికి..ఎవరో పక్కనుండి)..ఎవరదీ ఎవరక్కడ...నాకేం వినిపించడం లేదు...మరీ అలా పొగడకండి..మొహమాటం గా ఉంటుంది
— feeling silly.

ఆలస్యం అమృతం..విషం



2013 జూలై 1 వ తేదీ రామచంద్ర శాస్త్రి గారు పొద్దున్నే లక్ష్మీదేవిని స్మరించుకుంటూ లేచారు.కాలకృత్యాలు ముగించుకుని బయట వరండాలో పేపర్ చదవడం లో నిమగ్నమయ్యారు..వార్తల్లో కొత్తదనమేదీ కనపడలేదు ఆయనకు..ఓపక్కన టి వి లో ఏవన్నా తమకు సంబంధించిన వార్తలొస్తాయేమోనని ఓకన్ను,చెవీ కూడా అటువేపు వేసుంచారు.
శాస్త్రిగారిలాంటి ప్రభుత్వ విశ్రాంత,అవిశ్రాంత ఉద్యోగులకి 5 సంవత్సరాలకి ఒకసారి వచ్చేరోజది.ఆరోజునుండి ఎంతోకొంత పెన్షన్ పెరుగుతుందనే సంతోషం తెచ్చేరోజు కాబట్టి..రోజులు గడుస్తున్నాయి..ఇంతలో ఒక పెనుమార్పు..ఒకటిగా ఉన్న రాష్ట్రం రెండు ముక్కలయ్యింది..ఈలోపల నిలద్రొక్కుకునే సమయం ఇవ్వకుండా తుఫానురూపంలో ప్రకృతి కూడా విలయతాండవం చేసింది..అలా ఒక సంవత్సరం గడిచింది.అలా జీతాలు,పెన్షన్లు సవరించే 5 సంవత్సరాల కాలంలో రెండేళ్ళు గడిచిపోయాయి.
మళ్ళీ యధావిధిగా కాలచక్రంలో ఇంకో సంవత్సరం మొదలయ్యింది..రోజూలాగానే ఆరోజూ శాస్త్రిగారు మధ్యాన్నం కాఫీ తాగుతూ గతాన్ని నేమరువేసుకుంటున్నారు.ఈలోపల శాస్త్రిగారి భార్య ఏవండీ! అంటూ ఆదుర్దాగా వచ్చింది.ఏవిటీ! ఏవయ్యింది అంత కంగారుగా పిలిచావ్ అంటూ హడావుడిగా కుర్చీలోంచి లేచి అడిగారు శాస్త్రిగారు.
ఇప్పుడే టీవీ లో చూసాను పక్క రాష్ట్రం లో మీలాంటివాళ్ళకి ఫిట్ మెంట్ పెరిగిందని వార్తల్లో చూపిస్తున్నారు అని శెలవిచ్చిందావిడ.
ఔనా!..నేను తెలుసుకుంటానులే అని ఊరుకున్నారు శాస్త్రిగారు
ఆ తర్వాత చాలా స్వల్ప వ్యవధిలో తమకూ తమ ప్రభుత్వం అలాంటి ఉత్తర్వులు జారీ చేసిందనే వార్త విని చాలా సంతోషించారు శాస్త్రిగారు.
పూర్తి సమాచారం చేరేటప్పటికి టైం పట్టింది.ఈ లోపల ఉత్తర్వులు జారీ అయినప్పటినుండీ ప్రతీనెలా శాస్త్రిగారు పెన్షన్ పెరిగిందేమోనని చూసుకోవడం తో నెలలు గడుస్తున్నాయి..
ఎందుకిలా జరుగుతోంది ఇప్పటివరకూ ప్రభుత్వమేదయినా విశ్రాంత,అవిశ్రాంత ఉద్యోగుల పట్ల బాగానే వ్యవహరించేది..ఉత్తర్వులు లేటయినా..అందవలసిన సొమ్ము విషయంలో తప్పు పట్టేవిధంగా ప్రభుత్వ స్పందన ఉండేదికాదు..ప్రభుత్వం వ్యవహరించేదికాదు..ఇప్పుడెందుకిలా జరుగుతోంది.చాలామంది ప్రభుత్వేతరులు,ప్రజలు .. హైద్రాబాద్ నుండి రావల్సిన ఉద్యోగులు రావడం లేదుకాట్టి ఫిట్ మెంట్ పెంచడం కరెక్ట్ కాదు అంటున్నారు..కానీ కేవలం ఆ ఉద్యోగులకు మాత్రమే లభ్ది చేకూరదు అనేది ప్రభుత్వానికి,ప్రజలకు తెలుసు..పైగా మొన్న కేబినెట్ మీటింగ్ లో కూడా ముఖ్యమంత్రిగారూ ఫిట్ మెంట్ ఇచ్చి మాటలు పడుతున్నాం అని ఆవేదన వ్యక్తం చేసారు..విశ్రాంత,అవిశ్రాంత ఉద్యోగులంటే హైద్రాబాద్ లో ఉన్నవాళ్ళే కాదు కదా.ఇవాళ రాష్ట్రం విడిపోయాకా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఉత్తర్వులు ఇవ్వడం..మీడియాకూడా హైలైట్ చెయ్యడం జరిగిందికానీ ఇవ్వాళే మొదటిసారి ఫిట్ మెంట్ ఇవ్వలేదే..ప్రతీ 5 ఏళ్ళకోసారి జరుగుతున్నదే..కేవలం ఒకప్రాంతం నుండి ఉద్యోగులు రాకపోవడానికి మిగిలిన మొత్తం ప్రాంతానికి లబ్ధి చేకూరకపోవడం అనేది సమంజసం గాలేదు...జీతాలు పెంచడం,బోనస్ ఇవ్వడం,ప్రోత్సహించడం అనేది ఏ సెక్టార్ లోనయినా జరుగుతున్నదే...జారీ చేసిన విషయాలన్నీ కాగితాలవరకే అనే విషయం తెలిసినప్పటినుండి బాధ పడటం తప్ప చెయ్యగలిగేది ఏముంది..అని నిటూర్చారు శాస్త్రిగారు.
My sincere Thanks to my Father R.Parameswara rao..Rtd Teacher....

ఆలస్యం అమృతం..విషం



2013 జూలై 1 వ తేదీ రామచంద్ర శాస్త్రి గారు పొద్దున్నే లక్ష్మీదేవిని స్మరించుకుంటూ లేచారు.కాలకృత్యాలు ముగించుకుని బయట వరండాలో పేపర్ చదవడం లో నిమగ్నమయ్యారు..వార్తల్లో కొత్తదనమేదీ కనపడలేదు ఆయనకు..ఓపక్కన టి వి లో ఏవన్నా తమకు సంబంధించిన వార్తలొస్తాయేమోనని ఓకన్ను,చెవీ కూడా అటువేపు వేసుంచారు.
శాస్త్రిగారిలాంటి ప్రభుత్వ విశ్రాంత,అవిశ్రాంత ఉద్యోగులకి 5 సంవత్సరాలకి ఒకసారి వచ్చేరోజది.ఆరోజునుండి ఎంతోకొంత పెన్షన్ పెరుగుతుందనే సంతోషం తెచ్చేరోజు కాబట్టి..రోజులు గడుస్తున్నాయి..ఇంతలో ఒక పెనుమార్పు..ఒకటిగా ఉన్న రాష్ట్రం రెండు ముక్కలయ్యింది..ఈలోపల నిలద్రొక్కుకునే సమయం ఇవ్వకుండా తుఫానురూపంలో ప్రకృతి కూడా విలయతాండవం చేసింది..అలా ఒక సంవత్సరం గడిచింది.అలా జీతాలు,పెన్షన్లు సవరించే 5 సంవత్సరాల కాలంలో రెండేళ్ళు గడిచిపోయాయి.
మళ్ళీ యధావిధిగా కాలచక్రంలో ఇంకో సంవత్సరం మొదలయ్యింది..రోజూలాగానే ఆరోజూ శాస్త్రిగారు మధ్యాన్నం కాఫీ తాగుతూ గతాన్ని నేమరువేసుకుంటున్నారు.ఈలోపల శాస్త్రిగారి భార్య ఏవండీ! అంటూ ఆదుర్దాగా వచ్చింది.ఏవిటీ! ఏవయ్యింది అంత కంగారుగా పిలిచావ్ అంటూ హడావుడిగా కుర్చీలోంచి లేచి అడిగారు శాస్త్రిగారు.
ఇప్పుడే టీవీ లో చూసాను పక్క రాష్ట్రం లో మీలాంటివాళ్ళకి ఫిట్ మెంట్ పెరిగిందని వార్తల్లో చూపిస్తున్నారు అని శెలవిచ్చిందావిడ.
ఔనా!..నేను తెలుసుకుంటానులే అని ఊరుకున్నారు శాస్త్రిగారు
ఆ తర్వాత చాలా స్వల్ప వ్యవధిలో తమకూ తమ ప్రభుత్వం అలాంటి ఉత్తర్వులు జారీ చేసిందనే వార్త విని చాలా సంతోషించారు శాస్త్రిగారు.
పూర్తి సమాచారం చేరేటప్పటికి టైం పట్టింది.ఈ లోపల ఉత్తర్వులు జారీ అయినప్పటినుండీ ప్రతీనెలా శాస్త్రిగారు పెన్షన్ పెరిగిందేమోనని చూసుకోవడం తో నెలలు గడుస్తున్నాయి..
ఎందుకిలా జరుగుతోంది ఇప్పటివరకూ ప్రభుత్వమేదయినా విశ్రాంత,అవిశ్రాంత ఉద్యోగుల పట్ల బాగానే వ్యవహరించేది..ఉత్తర్వులు లేటయినా..అందవలసిన సొమ్ము విషయంలో తప్పు పట్టేవిధంగా ప్రభుత్వ స్పందన ఉండేదికాదు..ప్రభుత్వం వ్యవహరించేదికాదు..ఇప్పుడెందుకిలా జరుగుతోంది.చాలామంది ప్రభుత్వేతరులు,ప్రజలు .. హైద్రాబాద్ నుండి రావల్సిన ఉద్యోగులు రావడం లేదుకాట్టి ఫిట్ మెంట్ పెంచడం కరెక్ట్ కాదు అంటున్నారు..కానీ కేవలం ఆ ఉద్యోగులకు మాత్రమే లభ్ది చేకూరదు అనేది ప్రభుత్వానికి,ప్రజలకు తెలుసు..పైగా మొన్న కేబినెట్ మీటింగ్ లో కూడా ముఖ్యమంత్రిగారూ ఫిట్ మెంట్ ఇచ్చి మాటలు పడుతున్నాం అని ఆవేదన వ్యక్తం చేసారు..విశ్రాంత,అవిశ్రాంత ఉద్యోగులంటే హైద్రాబాద్ లో ఉన్నవాళ్ళే కాదు కదా.ఇవాళ రాష్ట్రం విడిపోయాకా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఉత్తర్వులు ఇవ్వడం..మీడియాకూడా హైలైట్ చెయ్యడం జరిగిందికానీ ఇవ్వాళే మొదటిసారి ఫిట్ మెంట్ ఇవ్వలేదే..ప్రతీ 5 ఏళ్ళకోసారి జరుగుతున్నదే..కేవలం ఒకప్రాంతం నుండి ఉద్యోగులు రాకపోవడానికి మిగిలిన మొత్తం ప్రాంతానికి లబ్ధి చేకూరకపోవడం అనేది సమంజసం గాలేదు...జీతాలు పెంచడం,బోనస్ ఇవ్వడం,ప్రోత్సహించడం అనేది ఏ సెక్టార్ లోనయినా జరుగుతున్నదే...జారీ చేసిన విషయాలన్నీ కాగితాలవరకే అనే విషయం తెలిసినప్పటినుండి బాధ పడటం తప్ప చెయ్యగలిగేది ఏముంది..అని నిటూర్చారు శాస్త్రిగారు.
My sincere Thanks to my Father R.Parameswara rao..Rtd Teacher....

ఓ మంత్రి గారూ, ఒక మాట వినరూ!



తుమ్మల నాగేశ్వరరావు గారి కి
బుధవారం స్టేట్ హోం నుండి 11 మంది అమ్మాయిలు తప్పించుకుని పారిపోయిన విషయం లో మీరు అధికారులని మందలించారు..బానే ఉంది కానీ అసలక్కడ ఏం జరుగుతోంది అనేది నాకు తెలిసినంతవరకు చెప్తాను.'స్టేట్ హోం లో అప్పుడే పుట్టిన పసిపిల్లల్ల దగ్గరనుండి 25 యేళ్ళ లోపు వాళ్లున్నారు .
అక్కడ పిల్లల్లో.. తల్లీతండ్రీలేనివాళ్ళే కాకుండా semi orphans అంటే పేరెంట్స్ లో ఎవరో ఒకరు ఉండీ పోషించలేని పరిస్థిలో ఉన్న పిల్లలు+అనాధాశ్రమం+రెస్క్యూ హోం కూడా ఉండటం తో కొద్దిగా పిల్లల మైండ్ సెట్ లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
సహజం గా 10 యేళ్ళు దాటిన పిల్లలకి తల్లో, తండ్రో అప్పుడప్పుడూ వచ్చి కనపడుతుండటంతో ఇంటికెళిపోవాలనే కోరిక పెరగడం,వాళ్ళతోపాటు అసలు పేరెంట్స్ లేని పిల్లలు కూడా వాళ్ళ మధ్య ఉన్న స్నేహం తో వీళ్ళు వెళిపోవడం జరుగుతోంది.
ఇదికాకుండా అక్కడ నీళ్ళు పట్టుకోవడం దగ్గరనుండి చాలాపనులు వీళ్ళే చేసుకుంటూ ఉంటారు..ఇదే పని బయట చేసుకుని బతకలేమా అనే ఆలోచన కూడా వీళ్లకి ఉంది..అయితే వీళ్ళలో చాలామంది పిల్లలు చదువుకుంటున్నవాళ్ళు ఉన్నారు..
ఒకమాట చెప్పండి నిజంగా ఈరోజుల్లో చదువుకునే పిల్లలకి వాళ్ళ చదువుతోపాటు ఇంటిపనులు చేసుకునే టైం ఉంటోందా ఇప్పుడున్న చదువులకి.
ఇక రెస్క్యూ హోం కూడా ఇక్కడే ఎందుకు ఉండటం..రెస్క్యూ హోం ఉద్దేశం వేరు.
స్టేట్ హోం కి విదేశాలనుండి ఆర్ధిక సాయం చేసేవారు కూడా ఎక్కువే .
దయచేసి ఇక్కడ పిల్లలకి సరైన సౌకర్యాలు కల్పించండి,వాళ్ళ పేరెంట్స్ దగ్గరకి వెళ్తామనే పిల్లలకి వెళ్ళే అవకాశం కల్పించండి..అంతేకాదు..రెస్క్యూ హోం ని ,అనాధాశ్రమాన్ని కలిపి ఒకచోట ఉంచకండి.
మీరు దొరికిన అమ్మాయిలిద్దరితోమాత్రమే మాట్లాడారు..అలా కాకుండా ఎప్పుడేనా సడెన్ విజిట్ చేసి అక్కడ పరిస్థితులని తెలుసుకుంటే అనాధ పిల్లలకి మేలు చేసినవారవుతారు అంతేకాకుండా..అధికారులూ మరింత శ్రద్ధగా పనిచేస్తారు

15, మే 2015, శుక్రవారం

feeling silly

హైద్రాబాద్ లో తిరిగే వాటర్ టాంకర్ల యాజామాన్యాలకి విజ్ఞప్తి..
మీమానాన మీరు, టాంక్ మొత్తం ఫుల్లుగా నీటి తో నింపేసి రోడ్లమీదకి తీసుకొచ్చేస్తే సరిపోతుందా..ఆ టాంకర్ల పైనుండే పెద్ద పెద్ద హోల్స్ అవీ.. మ్యాన్ హోల్స్ లా ఉంటాయి..వాటికి మూతలు పెట్టరా..
చాలావరకు మూతలు లేకుండా ఉన్నవే తిరుగుతున్నాయి సిటీలో..
నీటి మీద,ఆ నీటిని తీసుకెళ్ళే వెహికిల్ మీద ఉండే శ్రద్ధ పైనుండాల్సిన మూత మీద కూడా పెట్టండి..
డ్రైవర్స్ happy గా నడిపేస్తున్నారు కానీ..కొద్దిగా ఎత్తు పల్లాలు వచ్చేసరికి..అమాంతంగా నీళ్ళువచ్చి టాంకర్ వెనకాల ఉండే వెహికిల్స్ మీద,అవి నడిపే మనుషులమీద పడిపోతున్నాయి..కార్లు,ఆటోలు..అయితే ఫరవాలేదు..మిగిలిన వాటిమీద వెళ్ళేవాళ్ళకి చాలా ఇబ్బంది..పైగా నీరు కూడా చాలా వేస్ట్ అవుతోంది.
................................
(ఇవాళ నేనో ఫంక్షన్ కి వెళ్ళానన్నమాట..గంటసేపు రడీ అయ్యి..మరీ.తీరా మా మేనల్లుడు వాళ్ల ఇంటిదగ్గరనుండి ఫంక్షన్ జరిగే చోటకి బండిమీద తీసుకెళ్తుంటే మాముందర టేంకర్ మాకు చేసిన సన్మానమే ఈ పోస్ట్..వెనకాలే ఎందుకూ కొద్దిగా దూరంగా ఉండచ్చుగా అనకండి.టేంకర్ కి పైన మూతలేదని మేం తడిసిపోయేదాకా తెలీలేదు)

7, మే 2015, గురువారం

ఏ కోపమైనా ఆర్టీసీ మీదే

ఆర్టీసీ బస్ మొత్తం నిండిపోయాకా టికెట్స్ ఇవ్వడం కష్టమయ్యి..ఓపక్కకి ఆపి టికెట్స్ తీసేలోపల..ఆ పదినిమిషాల్లో లక్షల టర్నోవర్ ఉన్న బిజినెస్ ఆగిపోయిందని ఫీలయిపోతాం..వ్యవస్థ మీద కోపం వచ్చి బందులు చేస్తూ ముందరగా నష్టం చేసేది..ఈ ఆర్టీసీ బస్సులకే..
మంచి టైం చూసి వీళ్ళు సమ్మె మొదలెట్టారంటున్నవాళ్లకి ఒకమాట...వాళ్ళేం శుభకార్యాలు చెయ్యట్లేదు ముహూర్తం చూసుకుని మొదలుపెట్టడానికి..ఒకవేళ వాళ్ళు అడిగేది తప్పే అయితే ప్రభుత్వం సగం ఇవ్వడానికి ఎందుకు ఒప్పుకుంది..వాళ్ళు 43% అడిగితే..27% ఇస్తానంటోంది).
ఇవాళేదో మొట్టమొదటిసారిగా బస్సులు చాలా రష్ గా ఉన్నాయనడానికి..గత 20 సంవత్సరాలనుండి..ప్రత్యేకరోజుల్లో బస్సులు ఎప్పుడూ ఇలాగే ఉంటున్నాయి..
కాకపోతే ఇంకొంచెం ఎక్కువ రష్ గా ఉంటున్నాయంతే..
ప్రభుత్వం ఎస్మా ప్రయోగిస్తానంటే ఆశ్చర్యం గా ఉంది..ఒకప్పుడు సకలజనుల సమ్మె అనగానే ఈ ఆర్టీసీ కూడా సహకరించిందనే విషయం నాకు గుర్తుంది..మరి మీకు
ఆర్టీసీకి ఒకటే విజ్ఞప్తి..మీరుకూడా ఇంక ఎక్కువ expect చెయ్యకుండా..ఇచ్చినదానితో తృప్తి పడండి..మీకు,ప్రజలకి కూడా మంచిది
ఇక ప్రైవేట్ వాహనాల గురించి ..వీళ్ళకి వచ్చేనష్టం ఏమీలేదు.వీళ్ళ బిజినెస్ ఎప్పుడూ ఫర్వాలేదు..ఇప్పుడేదో సిటీలోకి కూడా వస్తున్నారుకానీ..లేకపోతే వాళ్ళకి మామూలుగా ఉండే పాసెంజర్స్ ఎప్పుడూ ఉంటారు..

అయ్యో సల్మాన్

అయ్యో సల్మాన్ ఖాన్..నువ్వు జైల్ కెళ్తే ఎన్ని సినిమాలు,ఎంత టర్నోవర్..కోట్ల లో బిజినెస్..ఇదంతా లాస్ కదా..ఇదే మా తెలుగు మీడియాకి తెలిసిన బాధలు..నువ్వు కష్టపడి ఎలాగూ బెయిల్ తెచ్చుకుంటావ్..నీ పనులన్నీ పూర్తి చేసుకుంటావు..ఇది తెలిసినా చెప్పదు మా మీడియా..అంతేకాదు అసలు ప్రాణం పోయినవాడి పేరు కూడా గుర్తులేదు మా మీడియాకి...
ఇందుకు కాదు నేపాల్ పొండిరాబాబూ బాబూ భరించలేకపోతున్నాం మిమ్మల్ని అన్నది.
వాడెవడో దిక్కుమాలిన వెధవ..అభిజిత్ అని హిందీ సినిమాల్లో పాటలు పాడతాడు..పడుకోవడానికి ముంబై ఫుట్పాతే దొరికిందా మీకు ఇళ్ళులేవా అంటున్నాడు.
ఒరే ఏబ్రాసి వెధవా,,..నువ్వు ఒక్కరోజు నీ ఇంట్లో కాస్త ప్లేస్ ఇస్తావా ?,లేకపోతే నువ్వెళ్ళి ఒక్కరోజు అలాంటివాళ్ళ ఇంట్లో ఉంటావా..తింగరెధవ..

బుల్లెట్లకు బదులుండదు

మావోయిస్ట్స్ చాలా స్పీడ్ గా నిర్ణయాలు తీసుకుంటారు..ఎందుకంటే వాళ్ళు పేల్చే బులెట్ కి సమాధానం తిరిగి వాళ్ళ ప్రాణాలే అని వాళ్ళకీ తెలుసు...వాళ్ళ హిట్ లిస్ట్ లో ఉన్నవాళ్లని టార్గెట్ చెయ్యకుండా వదలరు.. తూర్పుగోదావరి జిల్లాకి చెందిన ఇద్దరిని (వీళ్ళిద్దరూ పోలీస్ informers.. అనే అనుమానం ఉంది మావోయిస్ట్స్ కి)..చత్తీస్ ఘడ్ కి మాట్లాడే పనుందని పిలిచి చంపేసారు..పైగా ఈ కారణం తోనే చంపేసామని ప్రకటించారు.
నిజమే..చంపెయ్యాలి ఎందుకంటే మీకు కోపం పాలకుల మీద,పోలీసులమీద ఉందికాబట్టి information ఇచ్చే ప్రతివాళ్ళని చంపెయ్యాలి.. అప్పుడే ప్రజల్లో భయం మొదలవుతుంది. .కానీ మీలోనే, మీ విధానాలని వ్యతిరేకించేవాళ్ళుంటారు.. వాళ్లు చెప్పేది వినండి వాళ్లని మాత్రం, వాళ్ళు కూడా పోలీస్ ఇంఫార్మర్సేమో అనే అనుమానం తో చంపకండి.....ఎందుకంటే మీరు కూడా చాలావరకూ ఎక్కడో ఉంటూ ఉంటారు, మీ ఇంఫార్మర్స్ ప్రజల్లో ఉంటారు..అంటే మీకు కూడా ఇంఫర్మేషన్ ఇచ్చేవాళ్ళుంటారు..ఎవరికి వారు స్వయంగా నిజాలు తెలుసుకునే అవకాశం చాలా తక్కువ ఉంటుందికాబట్టి..ఈ ఇంఫార్మర్స్ మీద ఆధారపడటం తప్పనిసరి..
................
ఒక licensed ... గన్ లోంచి వచ్చే బులెట్ కి ప్రజలకి సమాధానం చెప్పాల్సిన భాద్యత ఉంటుంది..మీ గన్ లోంచి వచ్చే బులెట్ కి సమాధానం మీరే...

బీ పాజిటివ్

ఈటీవీ వాళ్లు మైండ్ లో బ్లైండ్ గా ఫిక్స్ అయినట్టున్నారు...అయితే స్వరాభిషేకం లేకపోతే స్వర సంగమం..రెండింటిలోనూ ఒకే ఒక తేడా ఉంది..స్వరాభిషేకం లో ఆడియన్స్ ఎక్కువగా పార్టిసిపేట్ చేసేవారు కాదు..ఇక్కడ పాడేవాళ్ళు ,వెళ్లి ఆడియన్స్ కూడా పార్టిసిపేట్ చేసేలా పాడేస్తున్నారు....అందుకే అభిషేకంతీసేసి సంగమం అని పెట్టుంటారు...
ఇదీ ఒకందుకు మంచిదే లేకపోతే మంచి prime time లో వేసిన సినిమానే వేసి వాయించడం లేదు కాబట్టి..
ఏదయినా పాజిటివ్ గా ఆలోచించేస్తే భలే సౌకర్యంగా ఉంటుంది...
feeling silly.

పెళ్లి కావాలా, ఇంకో దేశం పొండి బాబూ

4.12 కోట్లమంది వధువులు కావలెను,అబ్బాయిలు ఉన్నారు కానీ,అమ్మాయిల కొరత ఎక్కువగా ఉంది....సాక్షి.
ఆల్రెడీ పెళ్ళయిన మగవారి పట్ల నా కామెడీ ఫీలింగ్స్.
..................
1.ఇప్పటికే పెళ్ళైయినవాళ్ళు అదృష్టవంతులు.
2.ఒకవేళ భార్య చేసేపనులేవన్నా నచ్చకపోయినా ఏం మాట్లాడలేరు..ఎందుకంటే అసలే పెద్దగా ఆప్షన్స్ కనపడటం లేదుకాబట్టి
3.ఇక బయట కనపడే అమ్మాయిలను పెద్దగా చూడరు..ఏదో ..తోటి పెళ్ళవని మగవాళ్లకి అవకాశం ఇచ్చినట్టవుతుంది కదా అని.
4.మరీ భార్యని నెత్తిమీద పెట్టుకోలేరు కానీ(అంటే బాగా బరువుగా ఉంటుందేమోనని..కికికి)..ఆల్మోస్ట్ దేవతలాగా పూజించేస్తారు.
5.భార్య అడిగినదల్లా కొనలేకపోతున్నామని విపరీతంగా మదనపడిపోయి బెంగపెట్టుకుని బక్కచిక్కిపోయినా ఆశ్చర్యపడక్కరలెద్దు
.....................
ఇక పెళ్ళికానీ మగవాళ్ళ పట్ల నా కామెడీ సానుభూతి
......................................
మీరేం బాధపడకండి..ఎక్కడో అక్కడ ,ఏదో ఒకదేశం లో మీకోసం ఒకమ్మాయి పుట్టే ఉంటుంది...మీరే వెతుక్కోవాలి కాంపిటీషన్ అలాఉంది మరి.
బాగా కష్టపడి చదివేసి తొందరగా లైఫ్ లో సెటిల్ అయి అంతే తొందరగా పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టెయ్యండి.
అధైర్యపడకుండా ఆంజనేయుడికి ఒక నమస్తే చెప్పేసి ప్రయత్నించండి...తప్పనిసరిగా మీకు పెళ్ళి అయ్యే అవకాశాలు 80% కనిపిస్తున్నాయి..
....................
all the best
(నన్ను వాయించేసేవాళ్లు ఇవా ళ నవ్వులరోజనే విషయం గుర్తుచేసుకోవాలని శాస్త్రం చెప్తోంది)

ఇది తెలంగాణ బాబూ

చంద్రబాబు ఇంటి చుట్టూ తిరగకండి..ఇక్కడ నడుస్తున్నది తెలంగాణా ప్రభుత్వం..కేసీఆర్ అన్ని విధాలా సహాయసహకారాలందిస్తారు ,కేసీ ఆర్ కి సహకరించండి..-----తలసాని శ్రీనివాసయాదవ్
కరెక్టే..కానీ తలసానిగారూ మీరు తెలుసుకున్నంత తొందరగా వాళ్ళు తెలుసుకోవాలంటే కష్టం..కొంచెం టైం పడుతుంది కానీ వాళ్ళూ దార్లోకొచ్చేస్తారు లెండి.మీరు టెన్షన్ పడకండి..
ఇక సహకారం..కేసీఆర్ ఏం చెయ్యాలనుకుంటే అదే చేస్తారుకాబట్టి..ఇక సహకరించడం అనే మాట పెద్దగా ఉపయోగం లేనిది..

27, ఏప్రిల్ 2015, సోమవారం

all the best Raju garu

ఉదయం 8:45 గంటలవుతోంది..almost ఎంప్లాయిస్ అందరూ ఆఫీస్ కి చేరుకున్నారు. సరిగ్గా నేను నేనూ లోపలకి అడుగుపెట్టి lift దగ్గరకు వెళ్ళబోతుంటే..అప్పటిదాకా అక్కడే పేపర్ చదువుకుంటున్న మా కంపెనీ ఎం డి కాస్తా మెట్ల దగ్గరకి వెళ్ళి మెట్లెక్కి నాలుగో ఫ్లోర్ లో ఉన్నా ఆయన కేబిన్ కి వెళ్తుంటే ..మొదట ఆశ్చర్యం గా అనిపించింది..
తర్వాత బహుశా ఇలాంటి మనస్థత్వం వల్లే ఆయన ఈస్థాయికి వచ్చారనిపించింది..అందుకే ఈ రోజుకి ఇది జరిగి 15 యేళ్ల యినా నేను మర్చిపోలేకపోయాను..అప్పట్లో సత్యం కంప్యూటర్స్ మొదటి స్థానం లో ఉంటే..ఈయన కంపెనీ రెండో స్థానం లో ఉండేది..అలాంటి కంపెనీలో పనిచేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయానని బాధపడని రోజూ లేదు..ప్రతీ ఎంప్లాయ్ తో ఆప్యాయం గా మాట్లాడే వ్యక్తి మా ఎం డి..ఆయనతొ ఆసోసియేట్ అయి పనిచేసే అవకాశాన్ని మిస్ చేసుకున్నానని తలుచుకోని రోజూ లేదు...
ఇప్పటికీ ఎక్కడేనా కలిసినా నన్ను వెంటనే గుర్తుపట్టి పలకరించే మనిషి...
ఆ కంపెనీ పేరు అప్పట్లో ..Visual soft Technologies.ఆయన పేరు D.V.S Raju
నేను పనిచేసింది కొద్దికాలమే..అయినా ఒక మంచిపేరున్న కంపెనీలో వర్క్ చేసాననే తృప్తి మిగిలిపోయింది...
ఇప్పుడు D.V.S Raju గారు గంగవరం పోర్ట్.. ఎం.డి.Best Business Leader అవార్డ్ గెలుచుకున్న DVS Raju గారికి నా ప్రతేక శుభాకాంక్షలు.
సర్.. నేను మీ అభిమానిని

26, ఏప్రిల్ 2015, ఆదివారం

ఇలా చేయొచ్చుగా

నాకో చిన్న సందేహం...
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే పంచవర్షప్రణాళికల స్థానం లో వార్షిక ప్రణాళికలుంటే,అన్ని విధాలా బావుంటుందని..అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులని పిలిచి ప్రకటించారు..దీనికి అందరూ కూడా ఒప్పుకున్నారు..కాంగ్రెస్ తప్ప
అంటే కొన్ని నిర్ణయాలకి అందరి ఆమోదం అవసరం అనేది స్పష్టమయ్యింది..అయితే కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోకపోవడానికి కారణం ఏంటంటే ..పంచవర్షప్రణాళికలు కాంగ్రెస్ చేతిలో రూపుదిద్దుకున్నాయి 60 యేళ్ళ క్రితం..ఇప్పటివరకూ కంటిన్యూ అవుతూ వచ్చినప్పుడు ఇప్పుడెందుకు మార్చడం అని కావచ్చు.
కానీ పంచవర్ష ప్రణాళికలో స్థానం లో వార్షికప్రణాళికలు మాత్రమే ఉండాలి అనే నిర్ణయానికి అందరి అమోదం పొందడం లో బీజేపీ ప్రభుత్వం సక్సెస్ అయ్యింది.
మరీ ఇదే రీతిలో కొత్తగా ఏర్పడ్డ ఒక రాష్ట్రానికి కూడా కొన్ని ప్రత్యేక నిధులు,అనుమతులు,రాయతీలు ఇవ్వడానికి కూడా బీజేపీ ప్రభుత్వం ప్రయత్నించచ్చుగా...
ఎలాగూ రెండు రాష్ట్రాలుగా విడదీసిన కాంగ్రెస్ కూడా ప్రత్యేక రాష్ట్రం గా ప్రకటించాలని కూడా అడుగుతోంది కాబట్టి..ఈ ప్రపోజల్స్ కి అడ్డురాదు కదా...ఎందుకంటే ఒకవేళ అడ్డొస్తే ఏం జరుగుతుందో కాంగ్రెస్ కు తెలుసు..
కొన్నిటికి రూల్స్ ఒప్పుకోవు అని చెప్పి రూల్స్ మార్చేకంటే కొత్త రూల్ ఒకటి తయారుచేసి ఆ రూల్స్ కి కలిపేస్తే సరి..మంచి జరుగుతుంది అన్నప్పుడు ఇలా చెయ్యడం తప్పుకాదని నా ఉద్దేశం...

నేనే రైటూ

ఆమధ్యన ఢిల్లీలో ఎలెక్షన్స్ కు ,ముందరే అరవింద్ ఖచ్చితంగా నెగ్గుతాడు అంటే నాకు బుర్రలేదని తిట్టిపోసారు...
మొన్న టాక్స్ విషయంలో తెలంగాణా చేసింది కరెక్ట్, ఏ రాష్ట్రమయినా వచ్చే అదాయాన్ని పోగొట్టుకుంటుందా అంటే అప్పుడూ నన్ను తిట్టేసారు..
నేనో బస్ కొని, ఏపీ కి,తెలంగాణా కి మధ్యలో సర్వీస్ స్టార్ట్ చేస్తే ..
ఏ పీ నాకు టాక్స్ విధిస్తే తప్పకుండా కడతాను అంటే మళ్ళీsame cards names Different టైప్ లో వాయించేసారు...
ఇప్పుడు ఏ పీ, లో తెలంగాణా నుండి ఏ పీ, కి వెళ్ళే వాహనాల మీద టాక్స్ వసూలు చెయ్యడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధం అయ్యింది...
ఇది చాలా మంచి ఆలోచన..నా దృష్టిలో...అయినా మనం మిగిలిన రాష్టాలకి కట్టడం లేదా..ఇదీ అంతే..
....................................................
హమ్మయ్యా ఇంక నేను బస్ కొనడం మిగిలింది
.........................................
(ఊరికే నన్ను వాయించేసేబదులు కాస్త ఆలోచించండి యా)

నరసింహే

జెమినీ టీవీలో ఇప్పుడు నరశిం హ సినిమ వస్తోంది..నేను విపరీతంగా అభిమానించే రజనీకాంత్ సినిమా
అందరికీ ఈ డైలాగ్ గుర్తొస్తాందా
"అతిగా ఆశ పడే మగవాడు..అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు"
భలే సినిమా.. పని మానేసి చూసేస్తున్నా
రజనీకాంత్ కి సూట్ అయ్యే పాట..
జీవితమంటే పోరాటం, పోరాటం లో ఉంది జయం
ఎక్కు తొలిమెట్టు కొండని కొట్టు ఢీ కొట్టు
గట్టిగ పట్టెయ్ నువు పట్టు గమ్యం చేరేట్టు
......
అరుణాచలం వెళ్ళినవాళ్ళకి ,గిరి ప్రదక్షిణం చేసినవాళ్లకి చాలా చోట్ల రజనీకాంత్ కనపడతాడు,వినపడతాడు
That is one and only Real Hero only Rajanikanth

మొండి చెయ్యి

ఇవాళ ఓపక్కన తెలంగాణా టీ ఆర్ ఎస్ ప్లీనరీ..మరో పక్క ఏ పీ కి స్పెషల్ స్టేటస్ లేదని ప్రకటన...
పోనీలెండి ఇవ్వకపోతే ఇవ్వకపోయారు..మీకు ఓటేసి మిమ్మల్ని గెలిపించాం కాబట్టి.. కొన్ని రాయితీలు,నిధులు ఇవ్వండి చాలు..కాస్త వెనకాల ఉండి నడిపించండి..
కొత్తగా ఏర్పడ్డ ఒకరాష్ట్రం వీలయినంత బాగుపడాలంటే ఏం చెయ్యాలో మీరే నిర్ణయం తీసుకుని అమలు చెయండి...ఏదో ఆంద్రప్రదేశ్ విడిపోయింది కాంగ్రెస్ చేతిలోకానీ, మీరేం రాష్ట్రాలు విడిపోవటానికి వ్యతిరేకం కాదు..
మీరూ 15 యేళ్ళ క్రితమే కాకినాడలో ఒక వోటు రెండు రాష్ట్రాలని బీజేపీ ప్లీనరిలో చెప్పారు...మాకూ గుర్తుంది...మీరు బీజేపీని బలోపేతం చేసే ఆలోచనలో ఉన్నారు అలాగే రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టిపెట్టండి చాలు..ఏలినవారు ఏం చెప్పినా చెయ్యాల్సిన ప్రజలు మేము..

అన్నదాత దుస్థితి

ఆత్మహత్యని రాజకీయం చేసే పెద్దలు..రాజస్థాన్ రైతు ఆత్మహత్య ని ఇలా చెప్పుకొచ్చారు..అతను ఢిల్లీలో అందరూ చూస్తుండగా చేసుకున్నాడు..ఇది ఎంత ఘోరం..
...అంటే ఎవరికీ చెప్పకుండా ఆత్మహత్య చేసుకుంటే, ఇప్పటివరకూ గాల్లో కలిసిపోయిన చాలామంది రైతుల ప్రాణాలతోపాటే ఇతని ప్ర్రాణం ఉండేది..ఈ పార్టీలు యుద్ధప్రాతిపదికన అతని కుటుంబానికి లక్షలు ప్రకటించేవారూ కాదు..
అంచేత ఒక రకంగా అతని కుటుంబానికి చచ్చాకా ఆధారం అయ్యాడతను..ఈ పార్టీలన్నిటికి అతను చనిపోయాడు అనే బాధకంటే ఢిల్లీ లో చనిపోవడమే ఎక్కువ బాధగా ఉన్నట్టుంది.
కానీ ఒక్క విషయం..
ఒక రాజస్థాన్ కి చెందిన వ్యక్తి,అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన వాడు..(ఇక్కడ అతనొక్కడేకాదు)..తనలాంటి బాధితులతోకలిసి వసుంధరా రాజే మీద వత్తిడి అయినా తీసుకురావల్సింది, ఎందుకంటే ఊహించని కష్టం వచ్చినప్పుడు ప్రభుత్వాన్ని కాక ఇంకెవర్ని సాయం అడుగుతారు ప్రజలు. ఒకవేళ వాళ్ళు సాయం పొందలేకపోతే వేరే ఏదయినా బ్రతుకుదెరువు అయినా చూసుకోవాల్సింది..ఆ బాధ అనుభవించినవాళ్ళకి తెలుస్తుందనేవాళ్లకు నేనేం చెప్పలేను...

చావడానికి ఉన్న ఒక్కమార్గం కంటే...చాలా ఎక్కువ మార్గాలు బ్రతకడానికి ఉన్నాయి అనేది అతను కొద్దిగా ఆలోచించి ఉంటే ..today అతని కుటుంబం అతన్ని మిస్ చేసుకుని ఉండేది కాదు..ఇవాళ డబ్బు ఎంత ఉన్నా మనిషి దూరమయ్యాడు..అతని చావే తిండి పెడుతోంది అనే వాస్తవాన్ని ప్రతీక్షణం గుర్తుంచుకోవల్సిన పరిస్థితి ఆ కుటుంబానికి వచ్చేదికాదు..

19, ఏప్రిల్ 2015, ఆదివారం

నాడి తెలిసిన నాయకుడే

28 యేళ్ళకే మంత్రి, IT Indian of the Millennium..అనే గౌరవం పొందిన వ్యక్తి..1995 నుండి 2004 వరకు అప్పటింకా విడిపోని ఆంధ్రప్రదేశ్ కి దీర్ఘకాలం ముఖ్యమంత్రి..
ఏప్రిల్ 20,1950 లో పుట్టీ ఎకనమిక్స్ లో MA చేసిన నార చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు...మంచి అడ్మినిస్ట్రేటర్ అనేపేరు ఈయన సొంతం...
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా..ఆంధ్రప్రదేశ్ గా విడిపోయాకా ఆంధ్రప్రదేశ్ కి మొట్టమొదటి ముఖ్యమంత్రి...ఎన్నో సవాళ్ళు ఇతని గుమ్మంలో నిల్చున్నాయనే వాస్తవాన్ని అంగీకరించే నాయకుడు .
బాబుగార్ని నమ్ముకున్న వాళ్ళ, నమ్మకాన్ని నిలబెట్టాలని ఆశ పడుతున్నాను..
నేను 20 యేళ్ళు ఆంధ్రా లో ఉండే ఇక్కడికొచ్చాను...
"తెలంగాణా లో ఉండే సెటిలర్ ని నేను"..
అయినా తెలంగాణా బావుండాలనే కోరుకుంటాను..అక్కడ పెరిగితే..ఇక్కడ బ్రతుకుతున్నాను కాబట్టి
విమర్శించేవాళ్లకి నేనేమీ చెప్పలేను కానీ బాబు మీద కోపం తో హెరిటేజ్ పాలు వాడని వాళ్ళు..ఎప్పుడో ఏన్ టీ ఆర్ స్థాపించారు కాబట్టి ఇప్పటికీ ప్రతీ విషయం లోనూ ఆయన పేరు బయటికి తెచ్చేవాళ్ళు వాస్తవం కూడా గమనించాలి..
ఎన్ టీ ఆర్ మీద ఉండే గౌరవం ఎలాగు ఎక్కడికీ పోదు..కానీ జరిగే ప్రతీపనికి కూడా ఆయనకి లింక్ పెట్టడం తగదు...
విమర్శలు,తప్పొప్పులు,ఎత్తుపల్లాలు ప్రతివారికి వారి స్థాయిని బట్టి ఉంటాయి..అదే జీవితం అంటే..
నేను ప్రతిపక్షం లో ఉన్న జగన్ కి,మొన్న కేసీఆర్ కి ఇవాళ బాబు కి కూడా ఒకలాగే శుభాకాంక్షలు చెప్పాను..ఎందుకంటే రాష్ట్రాల భవిష్యత్ కి వీళ్ళ నిర్ణయాలు చాలా అవసరం అని నమ్ముతున్నాను...




రాసుకో సాంబా రాసుకో...

మోడీ కి వీరాభిమానులు,బాబుకి భక్తులు,కేసీఆర్ కి అభిమానులు ,జగన్ కి ఫేన్స్..ఇలా..పొలిటీషియన్స్ కి,ఏక్టర్స్ కి,సెలెబ్రిటీస్ కి,లెజెండ్స్ కి జైకొట్టే జనం ఉంటారు తప్పులేదు..అభిమానం,ప్రేమ లేకుండా ఎలా బ్రతుకుతాం...
కానీ age తో సంబంధం లేకుండా, ఒకే ఒక్కడిని మాత్రం అందరూ విపరీతం గా అభిమానించేస్తూ ఉంటారు...
అగ్నివేష్ లాంటివాళ్ల అగ్ని మీద నీళ్ళు పోసేవాడు..మేధాపాట్కర్ లాంటి ఒక్కరు దూరమయితే ఏంటి మేధస్సు ఉన్నవాళ్ళు, కూడా ఉన్నారు, చాలు అని ఆనందపడిపోయేవాడు..
శాంతి భూషణ్,ప్రశాంతి భూషణ్ దూరం అయితే ఏంటి మనశ్శాంతి ఉంది చాలు అనుకునే ధీరుడు,శూరుడు,వీరాధి వీరుడు,మంచివాడు,యోగ్యుడు..రాజాధిరాజ,రాజ మార్తాండ,రాజ గంభీర.... నాకు తెలుసు మీరు కరెక్ట్ గానే guess చేస్తారని.....
అతనే.. ఒకే ఒక్కడు..శ్రీ శ్రీ శ్రీ అరవింద్ కేజ్రీవాల్
.........................................................
( అంటే ..మరీ..ఈ మధ్యన ఇతన్ని తలుచుకుని వారం రోజులయ్యింది..మళ్ళీ ఎక్కడ ఫీలయి మనసు కష్టపెట్టుకుంటాడో అని ఇలా రాసానన్నమాట....)..
( పొగిడేవాళ్ళు మాత్రం నా వాల్ మీద నిరభ్యంతరం గా పొగిడెయ్యండి..నేనస్సలు ఫీలవను...తిట్టేవాళ్ళు తిట్టకండి మరి.. ఇవాళ ఆదివారం కదా అరవింద్ కి సెలవో.. ఏంటో..)

18, ఏప్రిల్ 2015, శనివారం

Devi Varma ki gift....my friend devii enjoy...


ఈ రోజుల్లో...
మామూలు రోజుల్లో ఓణీలు వేసుకునేవాళ్ళు తక్కువైపోతున్నారు..అదేనండీ ఫంక్షన్స్ లో తప్ప పెద్దగా బయట కనపడటం లేదు...బహుశా బస్సులు ఎక్కి..దూరాలు వెళ్ళి చదువుకుంటున్నారు కదా అందుకు కావచ్చు..పైగా చుడీదార్లయితే సౌకర్యంగా ఉంటుందని కావచ్చు..ఏదయినా అప్పుడప్పుడూ అయినా వేసుకుంటున్నారు...అది చాలు..సంక్రాంతికి కోడిపందాలు,పెళ్ళిళ్ళలో పేకాట్లు,ఫంక్షన్స్ లో సాంప్రదాయం గా కనిపించడం భలే బావుంటుంది...
మన దేవీ వర్మ ఇలాంటి ఫొటొస్ భలే పెడుతుం...
See More
Lyrics : Veturi Sundara Rama Murthy Gaaru Music : Ramesh Naidu Gaaru Actors : Naresh, Pradeep, Subhakar, Subhalekha Sudhakar, Poornima Movie : Rendu Jalla Se...
youtube.com

17, ఏప్రిల్ 2015, శుక్రవారం

కలెక్టర్ కు పది కోట్లు - శెభాష్ KCR

దేశం లో మొట్టమొదటిసారి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి జిల్లా కలెక్టర్ కి పది కోట్లిచ్చి అభివృద్ధి కి ఖర్చు పెట్టమన్నారు..బావుంది కేసీ ఆర్ గారు..
జిల్లాకి పది కోట్లంటే వందకోట్లు...మొన్నామధ్యన మేయర్స్ కి ,కార్పొరేటర్స్ కీ కూడా భారీ గా జీతాలు కూడా పెంచారు..
నాకయితే ఒక్కసారి కలెక్టర్లు వాళ్ళ జిల్లాలో విస్తృతంగా తిరిగి..ఒక్కసారి నీటి సమస్య..డ్రైనేజ్ సమస్య గురించి ఒక అవగాహన కొచ్చి నివేదికలివ్వడం అవసరమయితే డబ్బు ని ఖర్చు పెట్టడం లాంటివి చేస్తే బావుంటుందనేది నా అభిప్రాయం..
వాటికి ఆ శాఖల మంత్రులున్నారని అనచ్చు...ముఖ్యమంత్రే ముందుకొచ్చినప్పుడు వీరు కూడా ఇలా చెయ్యటం తప్పుకాదు...
కలెక్టర్ స్థాయి వ్యక్తులు ముందుకొస్తే సమస్యలు కొంతవరకూ తీరచ్చు...ఇందులోకూడా అవినీతి జరుగుతుందనేవాళ్లకు నేనేమీ చెప్పలేను...అవినీతి చెయ్యాలంటే ఎలాగయినా చెయ్యచ్చు...అది విషయం కాదు.
ఇప్పటికే వెనకబడిన అదిలాబాద్ లాంటి జిల్లాను ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉందని నా ఫీలింగ్.
‪#‎All‬ the Best To the collectors#

16, ఏప్రిల్ 2015, గురువారం

పంచ్ పడింది

ఇందాకా బయటనించుని,మా అబ్బాయిని ఆడిస్తుంటే..ఒకతను బైక్ పై వచ్చి 'రెంట్' కేవన్నా ఇల్లుందా అని అడిగాడు బాగా ఖాళీగా ఉన్నానని.. ఇలా start చేసా...
ఇప్పుడు మీరు ఆగ్నేయం వేపునుండి వచ్చారు కదా..ఒకసారి ఈశాన్యం వేపు వెళ్ళి...లెఫ్ట్ కి తిరగండి.ఉత్తరం రోడ్ లో రెండు లేడీస్ హాస్టల్స్ కనిపిస్తాయి....ఈలోపల అతను అక్కడ నాకేం పనండీ అన్నాడు..
ఊరుకోవయ్యా చెప్పేది పూర్తిగా విను..అక్కడేమో కొంతమంది అమ్మాయలు నిలబడీ, అబ్బాయిలేమో బైక్ మీద కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు..వాళ్ళని పట్టించుకోకుండా...కుడి పక్కకు తిరిగి తూర్పు కు వెళ్తే...అర్ధమయ్యిందా తూర్పు కి వెళ్తే ఒక చిన్న సందు వస్తుంది...అక్కడ దక్షిణం లో ఉన్న ఇంట్లో ఆవిడని...
ఆవిడతో నాకేం పనండీ బాబూ..మళ్ళీ అతను
ఉండవయా స్వామీ..పొరపాటున కూడా ఆవిడని కదపకు..అసలే పెద్ద కంచు..(.మీకన్నానా నెమ్మదిగానే అన్నాడు )కానీ నేను మాత్రం వినపడనట్టు..మళ్ళీ స్టార్ట్ చేసా...ఆ 'కంచు' ఇంటి ఎదురుగుండా పడమర ముఖద్వారం తో ఒక ఇల్లు ఉంది అందులో అడిగితే..
ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్.బి నగర్ లో లోపలికి ఉన్న ఇల్లు అది సంవత్సరం నుండి ఖాళీగా ఉందిలెండి..దాని వివరాలు చెప్తారు అన్నా..
పాపం చాలా expectations తో వచ్చాడుకదా అని, ఇంత వివరంగాచెప్పా....ఈలోపల మా ఇంటి బాల్కనీవేపు చూసి..ఓసారి పట్టిన చెమటని కర్చీఫ్ తో తుడుచుకుని...మేడం ఆ బాల్కనీ లో సిగరెట్ కాలుస్తున్న ఆయన ఎవరూ అని అడిగాడు... మా అయన అన్నాను...మేడం ఆయనకి నా ప్రగాఢ సానుభూతి తెలియచెయ్యండి ప్లీజ్ అనేసి వెనక్కి చూడకుండా వెళ్ళిపోయాడు.....
........బాగా తెలివైనవాడు కదా.....
Small doubt
........
"చిత్రం" ..సినిమాలో "ఊహలపల్లకీలో ఊరేగించనా"..పాట విన్నప్పుడల్లా ఒక అనుమానం వస్తుంది నాకు
ఊహల పల్లకీ లో ఊరేగించనా
ఆశల వెల్లువై రాగం పలికించనా
కలహంసై కబురలందించనా
రాచిలకై కిలకిల నవ్వనా
నా పెదవుల మధువులే ఇవ్వనా సయ్యాటలోనా
...రాసింది.....కులశేఖర్
కలహంస అయి కబురులందించనా,రాచిలుకై కిలకిలా నవ్వనా,అని పాడుతుంది..అమ్మాయి
నాకైతే కలహంసై కబురులందించనా అనేకంటే రాచిలకై కబురులందించనా అని ఉంటే ఇంకా బావుండేదేమో అని ఫీలింగ్
ఎందుకంటే హీరో హీరోయిన్ కి దగ్గరగానే ఉంటాడు..ఈ సినిమాలో ..ఒకవేళ అతను ఎక్కడో దూరం గాఉంటే హంసరాయబారం చేస్తోందీ అమ్మాయి అనుకోవడానికి...
పాటంతా బావుంటుంది కానీ చిలక మాట్లాడుతుందంటారు కాబట్టి..ఇలా రాయాల్సింది
..............................
ఇప్పుడెందుకు గుర్తొచ్చిందంటే రేడియోలో ఈ పాట వస్తోంది...ఎప్పటినుంచో ఉన్న అనుమానం, మళ్ళీ బయటికొచ్చింది..అంతే
కొంతమందికి మాత్రమే....
ప్రేమించుకునేటప్పుడు...ఇంట్లో అబద్ధాలు చెప్పాలి,పార్కులకి తిప్పాలి,Gifts కొనాలి..బాడీగార్డ్ లాగా అన్నీ కనిపెట్టుకుంటూ ఉండాలి..అమ్మాయి ఏం చెప్పిన..తుమ్మినా,దగ్గినా కూడా అద్భుతం అనాలి,
ఈ లోపల పరీక్షలు వస్తే చదివినా చదవకపోయినా సరే రాయాలి..రిజల్ట్ బాగాలేకపోతే ఓదార్పుయాత్రచెయ్యాలి..అన్నీ బావుండి ..ఇద్దరూ ప్రేమలో ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటే మధ్యలో వచ్చే వాలంటైన్స్ డే లాంటివాటిని చాలా జాగ్రత్తగా ఒక వేడుకలా జరుపుకోవాలి..
ఇన్ని జరుగుతుంటే అసంకల్పిత ప్రతీకారచర్యలా ...అమ్మాయికో. అబ్బాయికో ..ఏవో ఇబ్బందులొచ్చి..పెళ్ళిదాకా వెళ్ళే పరిస్థితి ఉండకపోవచ్చు...అప్పుడు కాసేపు బాధపడి..అంతా మర్చిపోయి..ఎవరిదారి వాళ్ళు చూసుకుందామనే తెలివైన ఆలోచనకి వాళ్ళే వచ్చెయ్యచ్చు...
ఇంతకష్టపడి స్కెచ్ వేసుకుని దానికి ప్రేమ అనే పేరు పెట్టుకుని కన్వీనియంట్ గా బతికేసేవాళ్ళని పెళ్ళి పేరుతో ఇబ్బందిపెట్టడం ......
భజరంగ్ దళ్ వాళ్ళకి న్యాయమేనా అని .పెళ్ళి చేసి వాళ్ళ ప్రేమని చంపేస్తారా..వాళ్ళకే ఒక క్లారిటీ ఉండదు కదా..మీరేం ఉద్ధరిద్దామని వాళ్ళ జోలికి వెళ్తున్నారో... really very sad..మహా అయితేమీకు భయపడి రహస్యంగా కలుస్తారు...అంతే..
ప్రియమైన భజరంగ్ దళ్ ..మీకో సలహా....
వీలైతే ప్రేమించండి..పోయేదేముంది మహా అయితే తిరిగిప్రేమిస్తారు అంతే కదా...
భజరంగ్ దళ్ కి మాత్రమే వాలంటైన్స్ డే శుభాకాంక్షలు...
ఎందుకని క్రికెట్, వేలంటయిన్స్ డే,ఫాదర్స్ డే,మదర్స్ డే... ఇలాంటివన్నీ విదేశీ సంస్కృతి మనకు వద్దూ అని విమర్శిస్తున్నారు...
మనకి, మన పక్కిల్లు ఎలాగో ..మన దేశానికి పక్క దేశం అలాగా.. అంతే కదా...terms బావుంటే అన్నీ బావుంటాయి, లేకపోతే స్నేహం కంటిన్యూ అవదు..
ఏదేశ ఆర్ధిక పరిస్థితి,జనాభా ని బట్టీ ఆదేశం ఉంటుంది.
ఏదో ...ఇతరదేశాల ప్రభావం వల్ల మనలో మార్పు వచ్చింది అనేది కరెక్ట్ కాదు...తెల్లారిలేచి ఓ నాలుగు ఇంగ్లీష్ words మాట్లాడందే రోజు గడవదు,బ్రాండెడ్ వస్తువుల్ని వాడకుండా నిద్రపోం ...అలాంటప్పుడు ...చిన్నవాటిని మాత్రం భూతద్దం లో వెతకడం ఎందుకు.
మనవాళ్ళు వెళ్ళి విదేశాల్లో కూడా వాళ్ళ ప్రతిభ చూపించి ఆ దేశ, ఎకానమీ పెంచుతుంటే మనవాడే కదా, అని గర్వపడితే సంతోషం... ఇక్కడే ఆ పని చెయ్యచ్చుకదా అనుకుంటూ కూర్చుంటే....ఇలాంటి వాదనలవల్ల ఉపయోగం ఉండదు..
ఇతరదేశాలేమీ మనల్ని ,మీరు మమ్మల్ని ఫాలో అవ్వాల్సిందే అని బలవంతపెట్టట్లేదు కదా..మనకీ నచ్చిందీ ఇష్టపడుతున్నాం...
మాకు నచ్చలేదు అనుకునేవాళ్ళు దూరం గా ఉండటమే...అంతేగానీ ఒకవేలు వాళ్ళకి చూపిస్తే మనవేపు నాలుగు వేళ్ళు చూపించరా...
మంచి చెప్పడం మంచిదే..కానీ నేను చెప్పేదే మంచీ... మిగిలినదంతా చెడు ...అంటే...
ఏదో ఒకవిషయం మనకి నచ్చలేదని..అన్నిటినీ విమర్శించడం కంటే..గౌరవించేవాటిని గౌరవించడం...నచ్చనివాటికి దూరగా ఉండడం కరెక్ట్
తప్పు,ఒప్పు అనే బటన్స్ ఉండే రిమోట్ మనం...మనం డిసైడ్ చేసుకోవాలి ఏది ప్రెస్ చెయ్యాలి అనేది..అవతలవాళ్లని తప్పు పట్టేముందు
దేశవిదేశాల్లో ఉన్న నా అభిమాన స్నేహితులకు..
మీరంటే నాకెంత అభిమానమో నేను మాటల్లో చెప్పలేను..చేతల్లో చూపించలేను..మీరంతా నా ఆరాధ్య దేవతలు,దేవుళ్ళు...
రేపు శివరాత్రి అని మీకు తెలుసుకదా..మీరంతా నాకో సాయం..చెయ్యాలి...చెయ్యము,చెయ్యలేము అని నా ఉత్సాహం మీద వాటర్ చల్లద్దు..మీరు తప్పకుండా చెయ్యాలి..మీకా టాలెంట్ ఉంది..
ఎవరూ మీ టాలెంట్ ని తట్టిలేపక మరుగున పడుతోంది అంతే..మీమీద ఎంతో నమ్మకం తో అడుగుతున్నా..కాదనకండి......మీ చేతుల్లో ఉన్నదే..ఎక్కడ్నుండీ కొని తేవక్కరలెద్దు..డబ్బు ఖర్చు పెట్టక్కరలెద్దు..టైం అస్సలు వేస్ట్ అవదు...
విషయం ఏంటంటే
..
...
....
రేపొక్కరోజు ..మంచి మంచి వంటలు..పులిహోరా...ముఖ్యంగా స్వీట్స్ ఉన్న photos అస్సలు post చెయ్యద్దు...ఇక్కడ లడ్డూలూ చాలా important అమ్మా....ఇవి అసలంటే అసలే వద్దు..
ఎందుకంటే యావన్మంది ప్రజానీకానికీ తెలియజేయునది ఏమనగా అంటే రేపు నేను ఉపవాసం......ఓ అరగంట సేపు నాకోరికలన్ని కోరుకుని ఆతర్వాత మీ అందరూ బావుండాలని ఆ శివుడ్ని మరిమరీ కోరుకుంటా ..
తెలంగాణా ముఖ్యమంత్రి గారు..మన ప్రధాని మోడీ గార్ని కలిసి..తెలంగాణా లో ఉన్న సమస్యలు వివరంగా చెప్పారు..అంతే కాకుండా ప్రాణహిత-చేవెళ్ళకు జాతీయ హోదా విషయం కూడా ప్రస్తావించారు...వీటితోపాటుగా..విభజన చట్టం లో ఉన్న ప్రతిపాదనలన్నీ వీలైనంత త్వరగా అమలు చేయమన్నారు .మిషన్ కాకతీయ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు కూడా..
ఇక్కడదాకా బానే ఉంది
..
ఆంధ్రాకి ..హైకోర్ట్ తొందరగా ఏర్పాటు చెయ్యమని కోరారు...
ఒక రాష్త్రం కొత్తగా ఏర్పడినప్పుడు..కావలసినవన్నీ ఏర్పడటానికి కొంచెం టైం పడుతుంది..ఒక్కటీ చేసుకుంటూ రావాలి..కేంద్రం కూడా సపోర్ట్ చెయ్యాలి..ఇప్పుడు..
హైకోర్ట్ ఒక్కటీ ఎందుకు ప్రస్తావించినట్టు..
.......................
ఒకవేళ కేంద్రం కనుక ..ఆంధ్రా లో హైకోర్ట్ విషయం లో యుద్ధప్రాతిపదికన స్పందించి ,ఒక్క హైకోర్ట్ ఏర్పాటుకు నిధులందిస్తే..
ఆంధ్రా ముఖ్యమంత్రి..CBN గారు..మిగిలిన అన్నింటికీ కూడా ఇలాగే స్పందించి అప్పుడు మాట్లాడండని కేంద్రం మీద ఒత్తిడి తేవాలి
ఆంధ్రప్రదేశ్ ...తెలంగాణా,ఆంధ్రా అని రెండు రాష్ట్రాలుగా విడిపోయాకా మొట్టమొదటి తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా రెండు మాటలు..
ఫిబ్రవరి 17, 1954 లో మెదక్ జిల్లా లో పుట్టిన KCR తెలుగు లిటరేచర్ లో ఉస్మానియా యూనివర్సిటీ నుండి మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నారు..1970 లో యూత్ కాంగ్రెస్ సభ్యుడిగా సంజయ్ గాంధీ నాయకత్వం లో పనిచేసారు..1983 లో TDP లో చేరారు..అప్పట్నుండీ అంటే.. ఎన్ టీ రామారావు గారి నాయకత్వం లోనూ, బాబు గారి నాయకత్వం లో కూడా పనిచేసి..2000-2001 లో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా కూడా పనిచేసిన KCR ..ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఎలాగైనా సాధించాలనే కసి,పట్టుదలతో తెలంగాణా రాష్ట్ర సమితి స్థాపించారు..
2004 లో కాంగ్రెస్ తో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిందీ ,..2009 లో TDP తో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిందీ...ఈ TRS పార్టీనే
అయినా ..లక్ష్యం మాత్రం ప్రత్యేక తెలంగాణా మాత్రమే
మొత్తానికి విపరీతమయిన కృషి,పట్టుదలతో ..సోనియాగాంధీ ని మెప్పించి తెలంగాణా సాధనలో సఫలం అయ్యారు..KCR
తెలంగాణా ప్రజలు ఈయన కష్టాన్ని గుర్తించి ముఖ్యమంత్రిని చేసారు
ఇప్పటికీ ఎంతసేపు మాట్లాడాల్సివచ్చినా ఎదురుగుండా script పెట్టుకోని వ్యక్తి..
సమయానుకూలంగా సెటైర్స్ వెయ్యగల తెలివి..
విపరీతంగా చదివే అలవాటు ఉన్న KCR కి
జన్మదిన శుభాకాంక్షలు...
..........వైదేహి
దొరగారికి విజ్ఞప్తి
మీరు హటాత్తుగా మా మీద ప్రేమ చూపిస్తే ఎలాగండీ మాష్టారు...తుఫాను కి,వరదలకి కూడా హెచ్చరికలుంటాయే..అలాంటిది మీ మానాన మీరు మమ్మల్ని ఆకాశానికెత్తేస్తుంటే ..తట్టుకోవడం కష్టంగా ఉంది గురువుగారూ.
హుస్సేన్ సాగర్ కి వరదొచ్చినట్టు మీకు ప్రేమ పొంగితే ఎలాగండీ బాబూ.
మీరు మమ్మల్ని అభిమానిస్తుంటే మాకు బానేవుంది కానీ మీ వీరాభిమానుల పరిస్థితేంటారు..వాళ్ళకి as usual గా మమ్మల్ని విమర్శించాలో,పొగడాలో అర్ధం కాకుండా ఉంది..
అంచేత మీరు ముందర మీ అభిమానులకి ఒక క్లారిటీ ఇవ్వండి..తర్వాత మా సంగతి చూద్దురు గానీ..
మాకాలిలో ముల్లు గుచ్చుకుంటే మీరొచ్చి తీస్తామని సెలవిచ్చారు మహా సంతోషం ..అంతకంటే ముందు మీరు మాకు చూపించేదారిలో ముళ్ళు లేకుండా చూడండి చాలు
నిద్రపోతున్న తన చిన్న ప్రపంచాన్ని తట్టి లేపిన సోనియాగాంధీ..ఎంతో బాధతో లేఖరాసిన విధానం చూస్తుంటే...చాలా సంతోషంగా ఉంది.
మన విజయనగరం సత్తిపండు ,గ్లామర్ కింగ్ ఆనం రాం నారాయణరెడ్డి ,అభిమాన స్నేహితుడు కే వీ పీ ..ఈ ముగ్గురూ తో కలిసి కేంద్రం తో ..ఏపీ కీ ప్రత్యేక హోదా,రెవెన్యూ లోటు,రాజధానీ లాంటీ అంశాల గురించి రాజీ లేని పోరాటానికి డిసైడ్ అయ్యారు సోనియా గారు..
ఒక పార్టీని బతికించుకోవాలీ అంటే.. ఒక సమస్యను, అది తను సృష్టించిందే అయినా కూడా అవసరానికి ఈజీగా వాడుకోవచ్చనే విషయం బాగా తెలుసుకున్నారు..
ఏపీ రాష్ట్రానికి సంబంధించినంతవరకూ మీరు ఏహోదాలో అడుగుతున్నారు..మీరేం అక్కడ ప్రతిపక్షం కాదు.ఐతేనేం మేము మనుషులం మాకా హక్కుంది అంటారా..మీకంటే అక్కడి ప్రజలే బాగా అడుగుతున్నారు...
ఇక కేద్రం దగ్గరకొస్తే ..ఆల్రెడీ కేంద్రం జారీ చేస్తున్న ఆర్డినెన్సుల మీద ఫైట్ చేస్తున్నారు కదా..దానితోపాటు ఈవిషయం కూడా ప్రస్తావిస్తున్నారా..
నేను గిల్లాను..మీరంతా జోలపాడండి అంటే ..ఎలా.
ఓపక్కన ,మీ పొన్నాల లక్ష్మయ్యగారూ తెలంగాణా బిల్ అమోదం పొంది సంవత్సరమయ్యిందీ ఇదంతా మా సోనియా ఘనత అని సంబరాలు చేసుకుంటున్నారు..మరోపక్క మీరు పోరాటం చేస్తానంటున్నారు..
బావుందండీ ..ఏరాష్ట్రానికి ఆ రాష్ట్రం లో అలా అన్నీ సెట్ చేసుకుంటున్నారన్నమాట.
ఏంటి బాబుగారూ ఇంకా మాటలు పడదామనే డిసైడ్ అయ్యారా..
మీకు మాత్రమే సొంతమయ్యే ఇల్లు, మీరు దగ్గరుండి కట్టించుకుంటున్నారు కదా..మరి రాష్ట్రం మొత్తానికి ఉండాల్సిన ఒకే ఒక రాజధాని విషయం లో మీరెందుకీవిధంగా ఉండట్లేదు..
ఏవండీ ..విజయవాడ చుట్టుపక్కల ఖాళీగా ఉన్న బిల్డింగ్స్ లో తాత్కాలిక రాజధాని ఏర్పాటు చేసి పని మొదలెట్టలేరా...ముందర మీరు కదిలి, గట్టిగా ఆర్డర్స్ పాస్ చేస్తే ఉద్యోగులు రారా..వచ్చినవాళ్ళతో start చెయ్యలేరా..మీమీద నమ్మకంతో ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటే మీరు వాళ్లకేవిధంగా న్యాయం చెయ్యాలనుకుంటున్నారు..?
ఇవాళ KCR ఆంధ్రరాష్ట్రం గురించి మాట్లాడారంటే దానికి అవకాశం ఇచ్చినట్టవలేదా.
ఒక్క నిమిషం ఉండండి.. ఒకసారి ఆయనతో చిన్న మాట చెప్పాకా మీదగ్గరకొస్తాను
ఏవండీ KCR .మీరేవన్నా ఎలాంటి డెవలప్మెంట్ లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారా..లేక ఇప్పుడే పుట్టిన రాష్ట్రాన్ని పాలిస్తున్నారా..మీకు కడుపు నిండుగా ఉందని ఏమీలేని ఆకులో ఉమ్మేస్తానంటే ఎలాగండీ..ఇవాళ అభివృద్ధి చెందిన తెలంగాణా రాష్ట్ర రాజధానిలో మీరు వ్యతిరేకించే ఆంధ్రరాష్ట్ర ప్రజల రక్తం,తెలివితేటలు,పెట్టుబడి ఉంది గుర్తు తెచ్చుకోండి..ఒకసారి కుందేలు,తాబేలు కధ గుర్తుతెచ్చుకోండి మీరు..
పోటీ అభివృద్ధిలో చెయ్యడం లో పడండి..మాటలు మాట్లాడ్డం లో కాదు
.......
బాబుగారూ 9 నెలల కాలాన్ని వెనక్కి తీసుకురాలేకపోవచ్చు..కానీ పనిలో స్పీడ్ ఉంటే పదికాలాలు గుర్తుండిపోతారు..డబ్బు,సౌకర్యాలు ఉంటే ఎవడైనా పాలించగలడు.. అవన్నీ లేవుకాబట్టే మీరు ఎక్కువ effort పెట్టాలి
వంట వచ్చిన కొంతమంది మగవారితో ఇబ్బందులు...
ఏదో టైం బాలేక నలభీములిద్దరూ వంట చెయ్యడం మొదలుపెట్టారుగానీ ఏనాడైనా ఎవరి వంట కైనా..అదే ముఖ్యంగా ఆడవాళ్ళ వంటకు పేరు పెట్టినట్టు ఎక్కడైనా చదివామా లేదు కదా..మరి వీళ్ళేంటండీ మరీ వంకలు పెడతారు..ఇప్పుడూ వీళ్ళేదో అవసరమయ్యో,ఇష్టం పెంచుకునో నేర్చుకున్నారు బానేఉంది..
ఇంట్లో ఆడాళ్లు చేసేవాటికి పేర్లెందుకు పెట్టడం.ఇంట్లోవాళ్ళని వంట మొదలయినప్పటినుండి..తిని చేతులుకడుక్కునేదాకా కడుగుతూనేఉంటారు ..ఇదే నేనయితే అదరగొట్టేసేవాడ్ని అంటారు..మరిచెయ్యచ్చుకదా...కారం ఎక్కువయ్యిందీ,ఉప్పు తగ్గించుండాల్సింది..వంట మీద శ్రద్ధపెట్టు...
శ్రద్ధపెట్టకుండా అసలు వంట ఎలా చేస్తారని వీళ్ళ ఉద్దేశం...వంటచేసేదేవన్నా అసెంబ్లీ స్పీకరా
కాదు కదా అన్నిటినీ మేనేజ్ చెయ్యడానికి..లేదా తెలుగు సినిమా హీరో నా ఓపక్కన విలన్స్ ని కొట్టేస్తూ మధ్యలో తింగరిబుచ్చిలా వచ్చే హీరోయిన్ ని భుజం మీదేసుకుని ఫైటింగ్ చేస్తూ అందర్నీ,అన్నిటినీ కవర్ చెయ్యడానికి..
ఇవాళా రేపు నూటికి డెబ్భై మంది టీవీ చూస్తూ తింటున్నారు..ఇలా వాళ్ళు రెండుపనులు చేస్తున్నారు కదా అని అందరూ అలాగే ఉంటారా..కాదు కదా.
అంచేత ఇందుమూలంగా నేను చెప్పేదేంటంటే ఈ వంటవచ్చిన మగవాళ్ళు..అందరూ కాదు కొంతమంది మాత్రమే అదీ పేరు పెట్టేవాళ్లు..మొదట నెమ్మదిగా చెప్పండి..నెమ్మదిగా నేర్చుకుంటారు..ఒకవేళ మీరు చెప్పినా బాగాచెయ్యకపోతే మీకు నేర్పడం సరిగా రాదన్నమాట..
అప్పుడేం చెయ్యాలో నేను చెప్పక్కరలేదుగా...అదే అదే మీకు నేర్పడం చేతకాని కారణంగా మీరే వండుకుంటూ జీవనం సాగించండి
(ఈ post మా పక్కింటివారికి అంకితం చేస్తున్నా)
KCR కి తెలంగాణా..అందులోనూ హైదరాబాద్ మీదున్న ప్రేమాభిమానాలకు జోహార్లు..ఏంటండీ మాట్లాడితే వంద కోట్లు అంటున్నారు మరి...నిజంగా తెలంగాణా ఆర్ధికంగా అంత మంచిపొజిషన్ లో ఉందని నాకు తెలీనేలేదు..
మిషన్ కాకతీయ,హుస్సేన్ సాగర్ చుట్టూ బిల్డింగ్స్,వినాయక నిమజ్జనానికి..ప్రత్యేక చెరువు,కొత్త సచివాలయం అదీ పర్ఫెక్ట్ వాస్తు తో..ఇవే కాకుండా కోట్లాది రూపాయల మొక్కుబడులు...
నాకోవిషయం అర్ధమయ్యింది..ఈయన ఎక్కడ అడుగుపెడితే అక్కడ వరాలిస్తున్నారు..అన్నిటికంటే కూడా నిన్న యాదగిరిగుట్ట కిచ్చిన వరం మాత్రం అసామాన్యం..ఏడాదికి 100 కోట్లు సేంక్షన్ చేసారు..ఆధ్యాత్మిక కేంద్రంగా డెవలప్ చెయ్యడానికి..ఏడాదికి వందకోట్లండీ సరిగ్గా వింటున్నారుకదా నేను చెప్పేది..అదీ విషయం మరి.
ఐతే మా KTR ఏవన్నా తక్కువనుకుంటున్నారా..అదేనండీ తెలంగాణా IT మినిష్టర్..తండ్రికి తగ్గ కొడుకు ఈయన..ఏకంగా లక్షకోట్ల ఎగుమతులు మాలక్ష్యం అని చెప్పేసారు.
ఒకప్పుడు IT ఎగుమతుల్లో బెంగుళూర్ తర్వాతి స్థానం లో నిలిచిన హైదరాబాద్ కు పూర్వ వైభవాన్ని తెచ్చేప్రయత్నం లో KTR బిజీగా ఉన్నారు
అందుచేత తెలంగాణా ముఖ్యమంత్రిగారు..శ్రీ KCR ,IT మినిష్టర్ శ్రీ KTR..మీఇద్దరూ మా ఆతిధ్యం స్వీకరించీ..మమ్మల్ని ఆశీర్వదించి..అదీ మీ స్టైల్లో..మదర్పితచందనతాంబూలాలు స్వీకరించ ప్రార్ధన
............................................ఇట్లు వీరవిధేయురాలు .....................వైదేహి
వెంకీ మీ డాడీ కోరికమీద post పెడుతున్నా...
నువ్వు నీ exams బాగా రాయరా బాబూ..ఒకవేళ నువ్వు నీ ఫ్రెండ్స్ తో బిజీగా ఉండో fb లో టైం గడుపుతూనో చదవకపోతే నీ పక్కవాళ్ళని,వెనకాలవాళ్ళని బతిమాలుకుని జాగ్రత్తగా మేనేజ్ చేసి ఎలాగోలా మంచి మార్కులు తెచ్చుకో లేకపోతే ....మీ డాడీ మురళీవెంకట్ గారూ బెంగపెట్టుకుని బక్కచిక్కిపోతారు..
తెలంగాణా ముఖ్యమంత్రి లాగా మీడాడీ బోల్డన్ని మొక్కులు కూడా మొక్కుకున్నారు...ఒరే నాయనా.. పేకాట ఆడేవాళ్ళు కూడా రెగ్యులర్ గా ఆడకపోతే హేండ్ రైజ్ లో ఉండదు..అలాగే క్రికెట్ ఆడేవాళ్ళు కూడా రెగ్యులర్ గా ప్రాక్టీస్ చెయ్యకపొతే ఆడటం ఉండదు..పెవిలియన్ చుట్టూ ప్రదక్షిణాలు చెయ్యడమే..చూసావా జాతీయ క్రీడలకే ఇంత కష్టపడుతుంటే...చదువుకెంత కష్టపడాలి మరి ...అందుకే..నామాట విను..
బాగా చదువుకుని పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకుని మమ్మల్ని ఉద్ధరించు..పెద్ద ఉద్యోగం తెచ్చుకుని నాలుగురాళ్ళు సంపాదించి ఒకటి నాకు,ఒకటి మీ మురళీ వెంకట్ గారికి,ఒకటి మీ అమ్మా నాన్నకి ..మిగిలినది నువ్వూ,మిగిలిన వాళ్లందరూ పండగ చేసుకోండి..నువ్వు ఖచ్చితం గా అన్నీ సాధిస్తావనే నమ్మకం ఉంది..నీవెనకాలనేనున్నానుకదా..
(చదివేవాళ్ళందరూ సరదాగా మాత్రమే తీసుకోండి..పొద్దున్నే నన్ను వాయించెయ్యకండి)

All the best venky
పవన్ కల్యాణ్... బాబుగార్ని కలవటం అయిపోందా..సరే భోజనం టైం అవుతోందికదా..మా ఇంటికి వచ్చెయ్..
తినేసాకా ఢిల్లి వెళ్దాం...నేను చెప్పేది విను..ఇప్పుడు మన ప్రధానమంత్రి ని పదిసార్లు వెళ్లి కలవటం ,20 సార్లు మన సమస్యలు చెప్పటం తప్పేమీ కాదు..పౌరుషానికెందుకు వెళ్లటం చెప్పు..మనం ఓట్లేస్తేనేకదా ఆయన ప్రధాని అవుతా..
ఆయనకేవన్నా పిల్లలా,సంసారామా..ఏవీలేవుకదా..మనల్ని కాక ఇంకెవర్ని చూడాలి ..కాకపోతే గజనీ లాగా ఏంచెయ్యాలో మర్చిపోయారు..మనం గుర్తుచేద్దాం..అవసరం మనది...
పోలవరానికి లాస్ట్ యియర్ 250 కోట్లు ఇచ్చారు ఇప్పుడు 100 కోట్లే ఇచ్చారేంటండీ అని అడుగుదాం..తెలంగాణా ముఖ్యమంత్రి అయితే సంవత్సరానికి యాదగిరిగుట్ట అభివృద్ధికే 100 కోట్లిస్తానన్నారనే విషయం ఆయనికి తెలీదేమో మనమే చెప్దాం...అంతేనా ..ఇంకా చాలాఉన్నాయి అవన్నీ మాట్లాడుకుని...
అమ్మో ఇప్పటికే ఒంటిగంట అయ్యింది త్వరగా రా నీకోసం చిట్టిముత్యాలు రైస్ తో బిర్యానీ చేసాను..తినేసి ఢిల్లీ వెళదాం సరేనా...నువ్వేం మొహమాటపడకు నేనూ నీతో వస్తాను కదా..
వామనావతారం గుర్తుంది కదా అందరికీ...
వామనుడు పుట్టినవెంటనే తండ్రిని ఉపనయనం చెయ్యమంటాడు...తన తండ్రి అయిన కశ్యపబ్రహ్మని..
తండ్రికి తెలుస్తుంది, తనకి పుట్టింది శ్రీమహావిష్ణువే నని ..వెంటనే ఒడుగు చేస్తాడు కూడా..
బుల్లి పిల్లాడులా ఉండే వామనుడు..హేపీగా యజ్ఞోపవీతం ధరించి..ఒక గొడుగు తీసుకుని బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్న స్థలం దగ్గరకొస్తాడు..మన బలిచక్రవర్తి కాస్తా ..కొత్తగా ఉపనయనం అయినట్టుంది ఏంకావాలో కోరుకో అంటాడు...
వామనుడు మూడడుగుల స్థలం చాలు అంటాడు..అంతేనా అంటాడు బలి..అంతే చాలూ..కానీ నేనే కొలుచుకుంటాను అంటాడు వామనుడు..
మహాభాగ్యం అని చెప్పి , బలిచక్రవర్తి ,భార్యని నీళ్ళు తీసుకురమ్మంటాడు
అయితే... అతని భార్య నీళ్ళు తెచ్చి బలి చేతిలో వంపుతుండగా... మన శుక్రాచార్యుడు ఉన్నాడు కదా, మహా తెలివైనవాడు..వచ్చింది విష్ణుమూర్తి అని కనిపెట్టి..నీళ్ళు పడే రంధ్రానికి అడ్డుగా వెళతాడు..
నీరు రాకపోవడాన్ని గ్రహించిన వామనుడు ధర్బ పుల్లతో ఒకసారి పొడుస్తాడు. దెబ్బకి శుక్రాచార్యుడి కన్ను పోతుంది ...సంతోషంగా దానం చేస్తాడు బలి చక్రవర్తి..అ తర్వాత అంతా మీకు తెలుసు..చాలా చిన్నప్పుడు చదివాను..అందుకే గుర్తున్నంతవరకూ రాసాను.
...ఇప్పుడు రాజులు,రాజ్యాలు..లేవు .శుక్రాచార్యులు ఉన్నా..వాళ్ళ ఆటలు సాగవు..ఈ రోజుల్లొ దానాలివ్వడం ..పుచ్చుకోవడం...అనేవి విలువలేని మాటలు..
ఇప్పుడు ప్రజాస్వామ్యం లో ఉన్నాం...ప్రజలదగ్గర ఓటు అనే అయుధం ఉంది. రోజులు మారాయి...ఒక పార్టీకి నలభయ్యేళ్ళు పట్టింది కళ్ళు తెరవడానికి...కానీ ఉపయోగం లేదు కదా..మిగిలిన పార్టీలు నేర్చుకుంటే మంచిది..లేదంటే ఉన్న ఖర్చులతోపాటు మళ్ళీ ఎలెక్షన్స్ ఖర్చు....మళ్ళీ పన్నులు..ధరలు పెరగడం అనీ మామూలే ...
అలవాటు పడిపోయాం అని అనుకోవద్దు..ఒకవామనుడినే తట్టుకోవడం కష్టం అయ్యింది...ఇప్పుడు ప్రజలందరూ వామనుడిలా అయ్యేదాకా వెయిట్ చెయ్యకండి
అసలు, ఆటోల్లో పాటలు పెట్టీ ..వాళ్ళు వింటూ మనల్ని వినమని హింసించే ఆటో డ్రైవర్లకి ఏం చెప్పి జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలి
.కూకట్ పల్లి లో ఒక ఆటో అతన్ని అమీర్ పేట్ వస్తావా ..అని అడుగుదామనుకుంటున్నా ఇంతలోనే "తూ ఆజా సరోజా" అనే పాట వస్తోంది ఆటోలోంచి..అతనేం చెప్తున్నాడో అర్ధమైచావలేదు.."ఆజా సరోజా"అనేమాట తప్ప..
సరే ఏదో చెప్పి ఎక్కి కాస్త ఆ పాటలు ఆపవయ్యా అంటే..మేడం ఇప్పుడు బేక్ టూ బేక్ మూడు పాటలు వస్తాయి బావుంటాయి మేడం అన్నాడు..
వీడి రేడియోమిర్చీ అభిమానం తగలెయ్యా అనుకున్నా....వెంటనే..."మన్మధరాజా మన్మధరాజా" అనేపాట వచ్చేసింది.ఖర్మ అనుకుంటూ కష్టపడివిన్నా..తర్వాత "సిగ్గేస్తోంది నిను చూస్తుంటే.. "అనేపాట వచ్చేసింది యమా స్పీడ్ గా ...మన హరికృష్ణ,సిమ్రాన్ ది .."నాకూ ఆపాట అంటే ఇష్టమే కానీ ..ఆటో డ్రైవర్ తోపాటు ..ఈపాట ఎలా వినేడవాలీ అనుకుంటున్నా ..
ఇంకొక్కపాట..అదికూడా అయిపోతే బావుండూ..అనుకునేలోపు వచ్చిందండీ..మూడోపాట..ఏంటనుకున్నారు....
"రారా..వస్తవా అడిగింది ఇస్తవా"...నా జన్మ ధన్యమయిపోయింది..
మొత్తానికి అతను చెప్పినవన్నీ అయ్యాయికదా అని ..సర్లేవయ్యా నువ్వన్న పాటలన్నీ అయిపోయాయి కదా ఇప్పటికయినా ఆపేయ్ అంటే...
ఆటో డ్రైవర్ నావంక ఒకవెర్రి చూపు చూసి ...మేడం మీరు కళలని పోషించరా అన్నాడు..అతని సినిమా డైలాగులకి నవ్వొచ్చింది ..పైగా ఆడుతూ పాడుతూ పనిచేసుకోవాలి మేడం...అంటూ నామీదే పంచ్ వేసాడు....భలే తెలివైనవాడు..
ఇంతకీ అతనిపేరు యాదగిరి..యాదాద్రి కాదండోయ్
మల్లిగాడి ఇంటికాడ మల్లెపూలు కోసుకుంటె--చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటె
సుబ్బుగాడి దిబ్బకాడ సన్నజాజు లేరుకుంటె--పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటె
చాకిరేవు గట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటె--సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటె
ముత్యమున్న ముక్కుపుడక ముక్కుమీద పెట్టుకుంటె--రోల్డ్ గోల్డ్ గాజులేసి చేతులేమొ ఘల్లుమంటె
చీరకట్టునేమొనేను అట్ట ఇట్ట సర్దుకుంటె--సింగార కుంకుమెట్టి పెద్దబొట్టు దిద్దుకుంటె
అద్దం లో చూసుకుంటు నాకు నేను ముద్దుకుంటె--కుర్రాళ్ళ చూపులన్ని వచ్చి నన్ను గుద్దుకుంటె...
..................
ఇలాంటిమాటలన్నీ పల్లెటూళ్ళ లో ఉండేవాళ్ళకు అలవాటే..వ్యవసాయం పనులయితే మరీ పాడుకుంటూ పనిచేసుకుంటూ సంతోషంగా గడిపేస్తారు...ఇది "s/o సత్యమూర్తి "సినిమాకోసం దేవిశ్రీప్రసాద్ రాసినపాట..ఈ సినిమాకు సంగీతం కూడా దేవిశ్రీ నే..నాకు వినగానే పళ్ళెటూళ్ళు,వాళ్ల హడావుడి గుర్తొచ్చింది.
పవన్ కల్యాణ్ వ్యాఖ్యల మీద JC దివాకర్ రెడ్డి స్పందించడం బావుంది .ఎందుకంటే పవన్ తన మానాన తను వచ్చి ఉద్రేక పూరిత ప్రసంగం చేసి మర్నాడు.. ఇంటర్వ్యూలు ఇచ్చి అప్పుడు కూడా స్పష్టత లేకుండా మాట్లాడినప్పుడు..
ఒక TDP MP గా దివాకర్ రెడ్డి స్పందించటం కరెక్టే..ఎందుకంటే ఆంధ్రా ఏం పీలు స్పందించాలి అనిచెప్పినప్పుడు ఎలా స్పందించాలో కూడా చెప్పాలి పవన్ అన్నారు జేసీ..
నిజమే కదా...రాజకీయాల్లో అమూలాగ్రం చదివేసినవాళ్లకి ఎవరోఒకరు వచ్చి సలహాలు,సూచనలు ఇస్తే ..ఇస్తే ఇచ్చాడులే అని వదిలెయ్యకుండా బయటికొచ్చి నీ సలహా ఏంటీ..నువ్వేం సూచన చెయ్యదల్చుకున్నావు అని అడగటం....దీనివల్ల ఇంకోసారి ఇలాంటివి చేసేవాళ్ళు పునరాలోచించుకునే అవకాశం ఉంటుంది....
పరీక్షలు రాసేవాళ్ళసలు వినకూడదు ...వింటే ఈపాట పాడిన అమ్మాయిని చితక్కొటేస్తారని భయం..అందుకే వాళ్ళు తప్ప అందరూ వినచ్చని చెప్తోంది....ఇంక మీ ఇష్టం..పేర్లు పెట్టకండి మొదటిసారి పాడుతోంది మరి
ఇంగ్లాండ్ పర్యటనలో విరాట్ కోహ్లీ వైఫల్యానికి నన్ను కారణం అనడం తగదు...అనుష్క శర్మ.
అనుష్కా, అతను గెలిచినప్పుడు బేట్ ఎత్తి నీకు చూపించాకే కదా మాకు చూపించాడు..అప్పుడు, ముందర అభిమానులు ఆతర్వాత నేను అని చెప్పావా లేదు పైగా ముసిముసినవ్వులు నవ్వుకున్నావు...
అతను బాగా ఆడినప్పుడు..అనుష్క ఎంకరేజ్ చెయ్యటం వల్లే ఆడాడు అని పేపర్లలో వస్తే నువ్వేమయినా కాదు అన్నావా..హేపీ ఫీలయ్యావు..
అదిగో అప్పుడలాఉంటే..ఇప్పుడిలా ఉండాల్సివస్తుంది మరి...
అతను ఆడుతుంటే విపరీతం గా ఎంకరేజ్ చేసావాలేదా..ఏదో నీకు ఖాళీ లేక ఈ మధ్యన కనిపించడం లేదు గానీ అతని వెనక్కాల నువ్వున్నావనేది ఓపెన్ సీక్రెట్ కదా.
.క్రికెటర్లని పరిణతి చెందిన వ్యక్తులుగా చూడండి అంటున్నావు బానేవుంది....ఇక్కడ అతన్నెవరూ ఏమీ అనలేదు....
కానీ ఒక సెలెబ్రిటీ కి సంబంధింతవరకూ సమాజం ఇలాగే ఉంటుంది...నువ్వు దానికి అలవాటుపడిపో..నీకు బాధ అనిపించినా తప్పదు.
.ఎందుకంటే ఎవరు అవునన్నా కాదన్నా..ఒకసారి సెలబ్రిటీ అయితే ఇంక వాళ్ళకి,ప్రైవేట్ పబ్లిక్ అనే రెండు జీవితాలుండవు...ఇదీ లోకం తీరు..ఇలాగే ఉంటుంది
ఇజ్రాయెల్ చుట్టూ ముస్లిం దేశాలే..పాలస్తీనా,సిరియాలతో ఎప్పటినుండో తగువు పడుతోంది ఇజ్రాయిల్..ఈ పోరాటం లో ఎప్పటినుండో అమెరికా, ఇజ్రాయెల్ కు మద్దతిస్తోందనేది అందరికీ తెలిసిన విషయమే..అంతటి మిత్రదేశమైన అమెరికాకు చెందిన CNN కార్యాలయాన్ని ఇజ్రాయెల్ నేలమట్టం చెయ్యటం..నిజంగా పెద్ద సాహసమే..
("శ్రీనివాసరావు అవ్వారు " గారి post చూసాకా నాకిలా అనిపించింది)
మీకో చిన్న విషయం చెప్పాలండీ...
నిన్న, నేను ఎర్రగడ్డ రైతుబజార్ కి వెళ్ళాను..ఎప్పుడూ నేనొక్కదాన్నే వెళ్తాననుకోండీ..పొరపాటున కూడా షాపింగ్ కి ,మార్కెట్ కి మావారు రారు...రిస్కెందుకులే అని ఏదో అలా ఒకరికొకరు సహకరించుకుంటామన్నమాట.
సరే కూరలు కొనడం మొదలు పెట్టాను...నా ముందర భార్య,భర్త అనుకుంటా..ఇద్దరూ కలిసి కూరలు తీసుకుంటున్నారు...వాళ్ళమాటల్ని బట్టి గెస్ చేసా..కాకపోతే ఒక ప్లాస్టిక్ కవర్లో వేసుకుంటున్నారు కూరలన్నీ...బహుశా బజార్లోనే కొనుక్కున్నారేమో ఆ కవర్...
ఆ అమ్మాయి..ఖచ్చితంగా నాకంటే ఓ పదేళ్ళు చిన్నదే అయ్యుంటుంది..బాగా తక్కువకి బేరం చేస్తోంది ..భర్త అసహనం గాచూస్తున్నాడు..అమ్మే అతను నిస్సహాయం గా ఉన్నాడు..మొత్తానికి కొన్నారు...20 రూపాయలు చెప్తే 10 రూపాయలకడుగుతున్నారు..
రైతుబజార్లో అంత మార్జిన్ ఉంటే..వాళ్ళు అక్కడ కూరలమ్మరు..శుభ్రంగా ఏ బంజారాహిల్స్ లోనో షాప్ పెట్టుకుంటారు..ఇది నా అభిప్రాయం మాత్రమే నండోయ్.
సరే కొనడం అయిపోయింది..నేను ఆటో పిలుద్దామనుకుంటున్నాను..ఈలోపలే ఆ భార్యాభర్తలిద్దరూ బండికి ఆ కవర్ తగిలించికుని బయల్దేరుతున్నారు..వర్షానికి మొత్తం చాలా బురదగా ఉంది రోడ్...ఈలోపలే కూరల బరువుకి కవర్ చిరిగి అన్నీ కింద పడిపోయాయి..నాకయితే ఉసూరు మనిపించింది...డబ్బులసంగతి పక్కన పెడితే పాపం వాళ్ళ శ్రమ,ఆ కూరలు పనికిరాకుండా పోయాయని
వాళ్లు కొంచెం శ్రద్ధ పెట్టి కాటన్ బేగ్ తెచ్చుకుని ఉంటే బావుండేదనిపించింది....ఎందుకంటేమనచుట్టూ ఉన్న పర్యావరణాన్ని కాపాడినవాళ్ళవుతాం కదా
నేను కూడా అప్పుడప్పుడూ ప్లాస్టిక్ కవర్స్ వాడేస్తుంటానులెండి..నాకూ బాగా జ్ఞానోదయం అయ్యింది
వీలయినంతవరకూ కాటన్ బేగ్స్ వాడటానికి ప్రయత్నిద్దాం
పొద్దున్నే చెప్పిందేంటా అనుకోకండి..ఇ ఈసారికి సర్దుకుపొండి
అసలు, ఏరాష్ట్ర బడ్జెట్ లో అయినా ప్రణాళికేతరవ్యయం ఎందుకు ఎక్కువగా ఉంటుంది...అంటే ..ఎందుకేనా మంచిదని ఎక్కువ amount చెప్తారా..అదికూడా ప్రణాళికా వ్యయం కంటే ఎక్కువ గా ఉంటుంది...
రాష్ట్ర ఆదాయం అనూహ్యం గా పెరిగే అవకాశం ఉన్నా.. అంటే 100% పెరిగితే తప్ప ఈ లోటు పూడదు..ఎంత పన్నులు పెంచినా..ఆదాయం కోసం ప్రభుత్వ భూములు అమ్మినా కూడా ఇంత డబ్బు సమకూర్చడం జరుగుతుందా...కేంద్రం సాయం అనేమాట పక్కనపెడితే ఇది ఎంతవరకూ కరెక్ట్ అనేది నాకు తెలీదు.
క్రితం సంవత్సరం 1,00.637 కోట్లు.. బడ్జెట్ అయితే అందులో ప్రణాళికా వ్యయం...48,648.47 కోట్లు
ప్రణాళికేతర వ్యయం 51,648.47 కోట్లు
ఈ సంవత్సరం 1,15,689.19 కోట్లు అయితే
అందులో ప్రణాళికా వ్యయం 52,383.19 కోట్లు
ప్రణాళికేతర వ్యయం 63,306..00 కోట్లు
పోనీ ప్రకృతి వైపరిత్యాలు,అనుకోని కష్టాలు ఉంటాయికదా అనచ్చు..దానిని ప్రణాళికేతర వ్యయం లో చూపిస్తారోలేదో నాకు తెలీదు...ఒకవేళ చూపిస్తే అప్పుడది కేంద్ర సాయం లోకొస్తుందా రాదా...
నాకిది ముందుజాగ్రత్తలా అనిపించడం లేదు...ఖర్చులు పెంచుకుని పన్నులు పెంచడం కరెక్టా...సరే భూములమ్మేస్తాం...మరిnext బడ్జెట్ లో కూడా ఇలాగే ఉంటే అప్పుడింకేం అమ్ముతాం
300 ఎకరాలున్నవాడు ఖర్చులు పెరిగాయి ..సరిపోవడం లేదని ఒక ఎకరం అమ్మితే 299 ఎకరాలు మాత్రం సరిపోతాయా... ఖర్చులు తగ్గనప్పుడు..అంచేత అమ్ముకోవడం మాత్రమే మిగులుతుంది..మన బడ్జెట్ ని తగ్గించలేనప్పుడు ఆదాయం పెరిగే మార్గం చూసుకోవాలి.
ఇదెలా ఉందంటే suppose నాకు ఒక లక్షరూపాయలు నెలకు ఆదాయం ఉంది కానీ నా ఖర్చులు 2 లక్షలున్నాయి అన్నట్టే
A Short Story by Vydehi......
జానకీ..జానకీ ...అబ్బా, ఆ ఫేస్ బుక్ వదిలి నా సెల్ ఫోన్ ఎక్కడుందో చూడు టైం అవుతోంది ఆఫీస్ కి..
అబ్బా.. ఆ సిగరెట్ కాలుస్తూ బాల్కనీలో పెట్టుంటారు చూడండీ..కూర్చున్న చోటనుండి లేవకుండానే చెప్పింది జానకి..
జానకి భర్త శ్రీరాం ..చిన్న సాఫ్ట్ వేర్ కంపెనీ ఉంది అతనికి..వీళ్ళిద్దరికీ ఇద్దరు పిల్లలు..బాబూ,పాప...ముచ్చటయిన సంసారం..
జానకీ, ఫోన్ దొరికింది కానీ.. ఏంటలా నన్ను పట్టించుకోకుండా మరీ చూస్తున్నావ్ ఏముందేంటి అక్కడ..అడిగాడు శ్రీరాం లోపలికి వస్తూ..
ఏవండీ ఇలారండీ ఒకసారి ...ఇతని పేరు ఋషి ..స్నేహం గురించి ఎంతబాగా రాశాడో చూడండి కవిత..
సరేలే, నాకలాంటివాటిని చూసి చదివే ఖాళీ ఉండదని తెలుసుగా, నువ్వే చదివి చెప్దువు గానిలే సాయంత్రం..అంటూ ఆఫీస్ కి వెళ్లాడు శ్రీరాం
అతన్ని పంపించి వచ్చి ..ఋషి కవితకి ఒక లైక్ కొట్టి కామెంట్ పెట్టింది..ఋషి inbox లోకొచ్చి thanks చెప్పాడు..
మెల్లగా స్నేహం మొదలయ్యింది...జానకి డిగ్రీ చేసి ఇంట్లోనే ఉంటోంది..ఋషి MSc Computers చేసాడు..కానీ జాబ్ లేదు..కొద్దిగా English లో మాట్లాడ్డానికి భయపడతాడు..వాళ్ళ నాన్న వేణుగోపాలస్వామి గుళ్ళో పూజారి అని,ఒక చెల్లి ఉంది,, తను Inter చదువుతోందని...సంగీతం అంటే మహా ఇష్టం అనీ ఇలా అతని వివరాలన్నీ చెప్పాడు..అతనికి అమెరికా కూడా వెళ్ళాలని కోరిక..హైదరాబాద్ లో వాళ్ళ మేనమామ ఇంట్లో ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పాడు.
స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ లో జాయిన్ అవ్వచ్చుకదా చెప్పింది జానకి..కొంచెం ఫీజ్ ఎక్కువ ఉంది..పైగా ముందర ఉద్యోగం చూసుకుని తర్వాత నేర్చుకుంటాను చెప్పాడు ఋషి.
అతనికి హైదరాబాద్ లో స్నేహితులు పెద్దగాలేరని అర్ధమయ్యింది జానకి కి.
ఒకపని చెయ్యండి, రామకృష్ణ మఠం వాళ్ళు కొద్దిగా తక్కువ ఖర్చులోనే నేర్పుతారు కానీ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు..ఒక మూణ్ణెల్లలో అయిపోతుంది ..ఈలోపల అప్పుడప్పుడు నాతో English లోనే చాట్ చేస్తూ ఉండండి అని చెప్పింది జానకి.
జానకి తన ఫొటో పెట్టలేదు ఫేస్ బుక్ లో ....News papers లో ఫేస్ బుక్ గురించి వచ్చే వార్తలు చదివి కొంచెం భయపడింది.
కానీ ఋషి ఎప్పుడూ ఆ ప్రస్తావన తేలేదు..జానకి వివరాలు కూడా ఎప్పుడూ అడగలేదు..అందుకే జానకి కి అతని స్నేహం నచ్చింది..
రోజులు గడుస్తున్నాయి...ఋషి Spoken English Class లో జాయిన్ అవడం జానకితో English లోనే చాట్ చెయ్యడం అన్నీ జరుగుతున్నాయి.
ఓరోజు జానకి పిన్ని, జానకి కి ఫోన్ చెసింది.. వాళ్ళబ్బాయికేదన్నా ఉద్యోగం చూడమని...సరే అంది జానకి...భర్త తో చెప్పింది,పిన్నికొడుకు ఉద్యోగం గురించి..శ్రీరాం మూడురోజుల తర్వాత వాళ్ళ Friend కంపెనీ Email ID ఇచ్చి Resume పంపమని మీ పిన్నికొడుక్కి చెప్పు..కనీసం ఈ జాబ్ అయినా సరిగ్గా చెయ్యమను అన్నాడు ...నవ్వింది జానకి...ఎందుకంటే శ్రీరాం నిజంగానే జానకి పిన్నికొడుక్కి ఉద్యోగం ఇప్పించడం మూడోసారి...పిన్నత్తగారి బాధచూడలేక
జానకి శ్రీరాం చెప్పిన Email ID నోట్ చేసుకుంది...చాలాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చింది...
ఋషికి ఆ Email ID ఇచ్చి apply చెయ్యమంది..అతను ముందు కంగారుపడ్డాడు..తనే ధైర్యం చెప్పింది...
ఋషి, జానకి చెప్పినట్టు చేసాడు...సాయంత్రం శ్రీరాం వచ్చాడు..ఏంటీ మీ పిన్నికొడుకు apply చేసాడా అని ఆడిగాడు..చేసాడని చెప్పింది జానకి..
రెండు రోజుల తర్వాత జానకి inbox లోకి ఋషి నుండి మెసేజ్ వచ్చింది ..మీరు చెప్పిన చోటే నాకు జాబ్ వచ్చింది అంటూ ..నేనొక పాట పాడాను..ప్లీజ్ వినండి...మీ అభిప్రాయం కూడా చెప్పండీ అని..అది ఒక పాట లింక్..జానకి ఆ లింక్ open చేసింది..ఒక్క క్షణం తర్వాత పాట మొదలయ్యింది...
"మెరిసే తారలదేరూపం...విరిసే పువ్వులదేరూపం...అది నాకంటికి శూన్యం
మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఏరూపం
నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం..నీ రూపం..అపురూపం".."సిరివెన్నెల" సినిమాలో పాట...
పాట అయిపోయింది..ఇంతలో పాట చాలాబాగా పాడాడోయ్ నీ శిష్యుడు అంటున్న మాటలు విని వెనక్కి చూసింది జానకి ..గుమ్మంలో శ్రీరాం...ఆనందం తో శ్రీరాం ని బంధించేసింది జానకి.
(ఎందుకంటే ... ఋషికి apply చెయ్యమని చెప్పినరోజు రాత్రే శ్రీరాం కి మొత్తం విషయం చెప్పింది జానకి..అంతా విని నువ్వేం చేసినా నాకు ఇష్టమేనని శ్రీరాం కూడా అన్నాడు కాబట్టి)
.............End..........................
ప్రజాప్రతినిధుల జీతాలు భారీగా పెంపు,జెడ్పీ చైర్ పర్సన్ కు నెలకు 7,500 నుంచి లక్షరూపాయలకు పెంపు-సాక్షి
స్థానిక ప్రజాప్రతినిధుల వేతనం పెంపు జెడ్పీ చైర్ పర్సన్ కి 7,500 నుండి 1,00,1000.మేయర్ కి 50,000--ఈనాడు.
నేను, ముందర ఈవార్తలు చూడగానే 7,500 కాదేమో 75,000 అయ్యుంటుంది..ఓ సున్నా పడలేదేమో అనుకున్నా..
రెండు వాచీలు ఒకే టైం చూపించవు అంటారు కాబట్టి,
రెండుపేపర్లు ఒకే తప్పు చెయ్యవని బలం గా నమ్ముతున్నాను.
ఇంతవరకూ ఏ ప్రభుత్వం కూడా ఇంతలా జీతాలు పెంచలేదు అనేది వాస్తవం.. సర్పంచ్ లకీ పెంచారు కానీ మామూలుగానే పెంచారు...ఏదయినా KCR నిర్ణయం ఊహించనిది..
ఈ విధంగా ముందుకుపోవాలని డిసైడ్ చేసారన్నమాట.
బహుశా KCR ఈవిషయం లో సాఫ్ట్ వేర్ కంపెనీ లని ఆదర్శం గా తీసుకున్నట్టున్నారు.
ఏంటో తెలంగాణా లో మేయరో,జెడ్పీ చేర్మనో అయినా బావుండేదని నాతో సహా ఎంతమంది అనుకుంటున్నారో పాపం..
వస్తూనే పేకాట క్లబ్బులొద్దన్నారు .ఉద్యోగులకి ఫిట్మెంట్ ఇచ్చారు.ఇప్పుడిలా ..
ఏదేమయినా మీ స్టయిలే వేరు మాష్టారూ..
Good Morning to KCR
ప్రతీ సెకన్ ని పట్టించుకుంటూ..చాలా జాగ్రత్తగా ఉంటూ..మంచి బిజినెస్ మైండ్ ఉన్నవాడు ప్రేమిస్తే..
.........................................
ప్రియమైన నీకు...
నేను నిన్ను జనవరి 2, 2015 న ఉదయం 7:45 నిమిషాలకి పంజాగుట్ట సాయిబాబా గుళ్ళో చూసాను..నీకుభక్తి మరీ ఎక్కువనుకుంటా..ప్రదక్షిణాలమీద ప్రదక్షిణాలు చేసి నువ్వు బయటికొచ్చేసరికి టైం కాస్తా 9:30..అయినా నా విలువైన టైం ని వేస్ట్ చేసుకుని ఉన్నానంటే కారణం నువ్వు అందంగా ఉండటం ఒకటైతే ..నాకిష్టమైన లంగా ఓణీ వేసుకు రావడం మరొకటి.సరే నాకు ఆఫీస్ కి టైం అయ్యిందని నేను వెళిపోయాననుకో .
మళ్ళీ నువ్వు వారం రోజులకి అంటే జనవరి 9 సాయంత్రం 5:20 కి "బిగ్ సినిమాస్"దగ్గర కనిపించావు..అప్పుడూ బానే ఉన్నావనుకో ..నేనే వెంటనే, నీ దగ్గరకొచ్చి మాట్లాడదామనుకుంటే ..నువ్వెవరో కోన్ కిస్కాతో మాట్లాడుతున్నావ్(of course ..నేను తప్ప ఎవరున్నా నీతో, నాకలాగే అనిపిస్తుంది ఆ టైం లో )
సరే అక్కడికొచ్చి ,నా హీరోయిజం ప్రదర్శించి ,అతన్ని బాధపెట్టి నా విలువైన టైం వేస్ట్ చేసుకుంటూ నిన్నూ,నీ సోదిని భరించడం కష్టమనిపించి wait చేసాను
ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి తింటూ 70 కేజీలున్న నేను ఇంకోరెండు కేజీలు పెరిగాను.
సరే మొత్తానికి నిన్ను ఫాలో అయి జాగ్రత్తగా మీ ఇంటిముందు ఐరన్ చేసేవాడి దగ్గర details కనుక్కుని నీకీ ఉత్తరం రాస్తున్నా...
నేను నిన్ను ప్రేమిస్తున్నాను..ఏం చూసి అని అడక్కు..ఎవడయినా ముందర అందమే చూస్తాడు..అది నీకు కావల్సినంత ఉంది..
నేను సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నా..అన్నీ పోను చేతికి లక్షరూపాయలు వస్తాయి..మార్కెట్ లో నాకు దగ్గరదగ్గర ఓ 50 లక్షలు కట్నం వచ్చే అవకాశం ఉందని టాక్..నువ్వంత ఇవ్వక్కరలేదు ఓ 49 లక్షలు చూసుకో చాలు..
కానీ ముందర నన్నో మూణ్ణెళ్ళు ప్రేమించాలి..ఎందుకంటే నేను కట్నానికి,నీ అందానికి పడిపోయానని గానీ ,నువ్వు నా ఉద్యోగానికి పడిపోయావని గానీ ప్రజలు అనుకోకూడదు...ఈ మూణ్ణెళ్ళ టైంలో నేను నిన్ను ముద్దులు మాత్రమే పెట్టుకుంటాను అదీ అప్పుడప్పుడు..ఎందుకంటే నా టైం వేస్ట్ అవకూడదు కదా..నీకిష్టం లేకపోతే తిరిగి ఇచ్చెయ్యచ్చు వాటిని..
ఒకరకంగా నీకూ,నాకూ "probation for a period " అనుకో ..మూణ్ణెల్ల తర్వాత నిన్ను పర్మనెంట్ చేస్తాను...అదే పెళ్ళి చేసుకుంటాను..తర్వాత నీకు..ప్రమోషన్లు,అవీ ఇవీ ఉంటాయనుకో..
నీకు నా బంపర్ ఆఫర్స్ నచ్చితే నువ్వు అప్లై చెయ్యచ్చు అదే నువ్వుకూడా ఒక లెటర్ రాసి పంపించు..లేదంటే నేను మళ్ళీ సాయిబాబా గుడికి వెళ్తాను.
Best regards
నీ ప్రేమికుడు
.....
ఈ post Santosh Patnaik రాసిన ఒక post చూసి సరదాగా రాసాను...కాపీ చెయ్యలేదు..ఉపయోగించుకున్నాను అంతే.
ముందరే చెప్తున్నా ...సరదాగా తీసుకోండి
కోడిపందాలపేరుతో కోళ్లని హింసించద్దు..గుత్తా జ్వాల
ఓకే..కానీ ఇవాళే ఎందుకు చెప్తున్నావు..
ఇప్పుడెక్కడైనా కోడిపందాలు జరుగుతున్నాయా..నాకు తెలీదు మరి అందుకే అడుగుతున్నాను,ఫీలవకు అడిగానని..
మామూలుగా అయితే కోడిపందాలు సంక్రాంతికి జరుగుతాయి..అప్పుడు చెప్తే నీకు,నీ ప్రకటనలకి మంచి పబ్లిసిటీ వచ్చేది..ప్రజలు కూడా కాస్త ఆలోచిస్తారేమో..
ఈ PETA వాళ్ళు ప్రజలు ఎక్కడ, జ్వాలని మర్చిపోతారో అని బాగానే గుర్తుచేస్తున్నారు.. జ్వాలా మొహానికి మాత్రం రక్తం మరకలంటకుండా బాగానే మేనేజ్ చేసావు అయ్యో అదే బాగానే ఉన్నావు..
ఇంతకీ నువ్వు వెజిటేరియన్నా,నాన్ వెజిటేరియన్నా..చెప్పనేలేదూ
To kejriwal Sir
మీమానాన మీరు వైద్యం చేయించుకుందుకువెళ్ళినా, మీ వ్యతిరేకులు అదేదో మహాతప్పు కిందా మాట్లాడుతున్నారు..ఢిల్లీ ముఖ్యమంత్రి అయినదగ్గరనుండి అస్సలు ఓర్చుకోలేకపోతున్నారు..ఓ బాధపడిపోతున్నారు..నాకు తెలిసి మోడీగారు కూడా ఇంతలా ఫీలవలేదనుకుంటా..
అయినా మీరెందుకు ఆ మూడు సీట్లు వాళ్ళకి వదిలారు..చూడండీ ..ఆ మూడు సీట్లే ముప్ఫై సీట్లు కిందా అనుకుంటున్నట్టున్నారూ..ఊరికే విమర్శిస్తున్నారు.. నెగ్గిన బీజేపీ అభ్యర్ధులు కాస్తా ఒక డ్రైవర్ ని పెట్టుకుని ముగ్గురూ ఒక కారు లోఢిల్లీ అసెంబ్లీకి వచ్చివెళిపోవచ్చు..కాస్త ఖర్చేనా తగ్గుతుంది .
ఇప్పుడు బీజేపీ ఉంది కాబట్టి ఆ ఢిల్లీ సీట్ మాత్రం వేరేవాళ్ళకెందుకు దక్కాలి అని..ఇప్పుడు మాట్లాడుతున్నవాళ్లు మీరు మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడలేదే...ఎందుకంటే అప్పుడు కేంద్రం లో ఉన్నది కాంగ్రెస్ కదా..అందుకని..ఆల్రెడీ ఉన్నకోపం అంతా కాంగ్రెస్ మీద చూపించారు...మిమ్మల్ని అనడం మర్చిపోయారు..
ఏవేవో వార్తలు చూసి,చదివి వ్యక్తిగత విమర్శలకు కూడా సిద్ధం అవుతున్నారు..మీరేం పట్టించుకోకండీ..మీపని మీరు చేసుకోండి...మహామహావాళ్ళకే..మన్ మోహన్ సింగ్ లాంటివారికే తప్పలేదు...
ఈ post ...
శ్రీనివాసరావు అవ్వారు గారికి ,జనసేవాసమితి గారికి,రామరాజు కలిదిండి గారికి..అంకితం

15, ఏప్రిల్ 2015, బుధవారం

పొద్దున్నే ఓ Good Morning పోస్ట్ ..తర్వాత ఆరోజు ని, ఏ దేవుడి రోజనుకుంటామో ఆ దేవుడి ఫొటో తోపాటు పోస్ట్.వెంటనే break fastకి సంబంధించీ..ఇడ్లీ,దోశ,పూరీ ఆ మర్చిపోయాను.. పెసరట్టు ఉప్మా ఇలాంటివాటి ఫొటోస్ తో ఉన్న ఒకపోస్ట్..ఇవన్నీ చూస్తుంటే మధ్యలో AP తెలంగాణా,కేంద్రానికి సంబంధించినవార్తలు కొన్ని..అక్కడక్కడ,పులులు,పిల్లులు,గులాబీలు..కూడా కనపడుతున్నాయి...నిజంగా ఇంత శ్రద్ధగా పోస్ట్లు పెట్టేవాళ్ళకి వందనాలు...ఎందుకంటే..ఇవేమీ నాకులేవు..కనీసం నేర్చుకోవాలని కూడా ఉండట్లేదు ఎందుకంటే..ఆ ఎలాగూ, ఎవరోఒకరు ఈ శ్రమ పడుతున్నారుకదా..అని కావచ్చు..సహజంగానే నాకూ ఆసక్తి తక్కువనేది కూడా ఒకకారణం అవ్వచ్చు.
కానీ సాక్షిపేపర్ కి నాకులేని మంచిలక్షణాలు చాలా ఉన్నాయి..అదేంటంటే ఆల్రెడీ వర్షాలు లేవని తెలుసు..ఎండాకాలం అంటే ఎండ ఎక్కువ ఉంటుందనీ తెలుసు.భూగర్భ జలాలు ఇంకిపోయాయనీ తెలుసు...నీటి కష్టాలు ఉంటాయనీ తెలుసు...నేను తెలంగాణా గురించి మాట్లాడుతున్నానండి...ఈ సమస్య గురించి రాస్తూ ఓ ఫొటో కూడా పెట్టింది..దయచేసి ఎవరయినా ఆ ఫొటో చూస్తే కనుక తెలంగాణా లో ఆ ఫొటో ఉన్న ప్రాంతం ఎక్కడుందో చెప్పండి..నాకయితే తెలీదు..తెలుసుకుందామని మాత్రమే అడుగుతున్నాను...అంతకుమించి వేరే ఏమీ కాదు