మీకో చిన్న విషయం చెప్పాలండీ...
నిన్న, నేను ఎర్రగడ్డ రైతుబజార్ కి
వెళ్ళాను..ఎప్పుడూ నేనొక్కదాన్నే వెళ్తాననుకోండీ..పొరపాటున కూడా షాపింగ్ కి
,మార్కెట్ కి మావారు రారు...రిస్కెందుకులే అని ఏదో అలా ఒకరికొకరు
సహకరించుకుంటామన్నమాట.
సరే కూరలు కొనడం మొదలు పెట్టాను...నా ముందర
భార్య,భర్త అనుకుంటా..ఇద్దరూ కలిసి కూరలు తీసుకుంటున్నారు...వాళ్ళమాటల్ని
బట్టి గెస్ చేసా..కాకపోతే ఒక ప్లాస్టిక్ కవర్లో వేసుకుంటున్నారు
కూరలన్నీ...బహుశా బజార్లోనే కొనుక్కున్నారేమో ఆ కవర్...
ఆ అమ్మాయి..ఖచ్చితంగా నాకంటే ఓ
పదేళ్ళు చిన్నదే అయ్యుంటుంది..బాగా తక్కువకి బేరం చేస్తోంది ..భర్త అసహనం
గాచూస్తున్నాడు..అమ్మే అతను నిస్సహాయం గా ఉన్నాడు..మొత్తానికి
కొన్నారు...20 రూపాయలు చెప్తే 10 రూపాయలకడుగుతున్నారు..
రైతుబజార్లో
అంత మార్జిన్ ఉంటే..వాళ్ళు అక్కడ కూరలమ్మరు..శుభ్రంగా ఏ బంజారాహిల్స్ లోనో
షాప్ పెట్టుకుంటారు..ఇది నా అభిప్రాయం మాత్రమే నండోయ్.
సరే కొనడం
అయిపోయింది..నేను ఆటో పిలుద్దామనుకుంటున్నాను..ఈలోపలే ఆ భార్యాభర్తలిద్దరూ
బండికి ఆ కవర్ తగిలించికుని బయల్దేరుతున్నారు..వర్షానికి మొత్తం చాలా
బురదగా ఉంది రోడ్...ఈలోపలే కూరల బరువుకి కవర్ చిరిగి అన్నీ కింద
పడిపోయాయి..నాకయితే ఉసూరు మనిపించింది...డబ్బులసంగతి పక్కన పెడితే పాపం
వాళ్ళ శ్రమ,ఆ కూరలు పనికిరాకుండా పోయాయని
వాళ్లు కొంచెం శ్రద్ధ పెట్టి
కాటన్ బేగ్ తెచ్చుకుని ఉంటే బావుండేదనిపించింది....ఎందుకంటేమనచుట్టూ ఉన్న
పర్యావరణాన్ని కాపాడినవాళ్ళవుతాం కదా
నేను కూడా అప్పుడప్పుడూ ప్లాస్టిక్ కవర్స్ వాడేస్తుంటానులెండి..నాకూ బాగా జ్ఞానోదయం అయ్యింది
వీలయినంతవరకూ కాటన్ బేగ్స్ వాడటానికి ప్రయత్నిద్దాం
పొద్దున్నే చెప్పిందేంటా అనుకోకండి..ఇ ఈసారికి సర్దుకుపొండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి