Translate

15, ఏప్రిల్ 2015, బుధవారం

Hyderabad నుండి యానాం వెళ్ళే APSRTC నాన్ ఏసీ బస్ లో 31 సీట్లు ఉంటే మామూలు రోజుల్లో టికెట్ రేట్ రూ 500 ..అదే ప్రైవేట్ బస్ అయితే మామూలు రోజుల్లో రూ 600 ..పండగ రోజుల్లో రూ 999 ..సీట్లు 36.
అంటే ఒకరోజుకి 36*600=21,600
నెలకి 30*21,600=6,48,000
.......................................
ఇంతవరకూ బీజేపీ ప్రభుత్వం ...పదేళ్ళు ఉమ్మడిరాజధాని అనే మాట గురించి ఎక్కడయినా లిఖితపూర్వక హామీ ఇచ్చిందా...
తమిళనాడు,కర్ణాటకా..ఇంకా మిగిలిన రాష్ట్రాలకు మనం రోడ్ టేక్స్ కట్టడం లేదా..
విభజనచట్టం లో దీనిగురించి ప్రస్తావించినట్తు తెలుసు..విభజన జరిగినవెంటనే అమలు చెయ్యాలని అడిగింది తెలంగాణా ప్రభుత్వం.
ఇవ్వాళ గగ్గోలెత్తుతున్న కొంతమందిజనం పండగరోజుల్లో ఎందుకు 999 రూపాయలు వసూలు చేస్తున్నారని అడగలేకపోయారు..అప్పుడేం రోడ్ టేక్స్ ఎక్కువ కట్టలేదే...ఇక్కడ అంతరేటు పెట్టి ఎక్కడమా,మానడమా అనేదాని గురించి నేను మాట్లాడటం లేదు..రోడ్ టేక్స్ ఏవన్నా పెరిగిందా అనే అడుగుతున్నా..
ఒకరాష్ట్రం విభజన జరిగినప్పుడు ఏర్పడే సమస్యల్లో ఇది ఒకటికావచ్చు కానీ ఇదే తెలంగాణా రాష్ట్రం ప్లేస్ లో ఇంకే రాష్ట్రం ఉన్నా ఇలా కాకుండా కొత్తగా చేస్తుందా..వచ్చే ఆదాయాన్ని వదులుకుంటుందా...
కమర్షియల్ వాహనాల మీద టేక్స్ భారం ఉండటం ఇవాళ కొత్తకాదు..
APSRTC అధికారికంగా రెండు కార్పొరేషన్స్ కిందా ఇంకా విడిపోలేదు...ఒకవేళ విడిపోయుంటే రెండు ప్రభుత్వాలు ఇంతవరకు అధికారికంగా ప్రకటన చేసాయా?
ఇంకొకముఖ్యవిషయం ఈ విషయం మీద కోర్ట్ తీర్పు చెప్పింది...అంటే కోర్ట్ కి విభజన చట్టం మీద అవగాహన ఉన్నట్టేకదా...
.............................................
ఒకవేళ నేను కరీం నగర్ లో ఉంటూ ఒక బస్ సర్వీస్ విజయవాడకు start చేస్తే ఏపీ ప్రభుత్వం నాకు రోడ్ టేక్స్ విధిస్తే చాలా సంతోషంగా కడతాను..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి