తెలంగాణా R &B శాఖ మినిస్టర్ శ్రీ తుమ్మల నాగేశ్వర రావుగారికి ...
కూకట్ పల్లి నుండి అమీర్ పేట్ వరకూ వచ్చే రోడ్(ముంబై జాతీయ రహదారి )చాలా గతుకులతో నిండిపోయింది..దయచేసి వాటిని పూడ్చండి..అయితే అమీర్ పేట్ నుండి కూకట్ పల్లి వెళ్ళే రోడ్ బానేఉంది...
ఇవాళ నేను కూకట్ పల్లి నుండి అమీర్ పేట్ బండి మీద వస్తుంటే(మావారు డ్రైవ్ చేస్తున్నారు) నా ఫోన్ మోగింది..
ఆన్ చేసి మాట్లాడే లోపల, చిన్న గుంతలో పడిలేచిన మా బండి నిలకడగా బానే ఉంది కానీ ...నా ఫోన్ కిందపడి రెండు ముక్కలయ్యింది..
దీనికంతటికీ మీరే కారణం కాబట్టి నాకో "ఫోన్" కొనివ్వాల్సిన భాద్యత మీదే..same నా ఫోన్ లాంటిదే నాకు కొన్నివ్వక్కరలెద్దు..మీరు మీ స్థాయికి తగ్గట్టు ఒక లేటెస్ట్ మోడల్ "I Phone "కొనిచ్చినా సర్దుకుంటాను....నీకు నేనెందుకు ఇవ్వాలి అని మీరడగచ్చు...
"నా ఫోన్ ఇక్కడే కొన్నాను..నాకు కాల్ ఇక్కడే వచ్చింది...కూకట్ పల్లి,అమీర్ పేట్ ఇక్కడే ఉన్నాయి ..నాకు ఆధార్ కార్డ్ ఇక్కడే ఉంది..మీకూ ఆధార్ కార్డ్ ఇక్కడే ఉంది..ఇన్ని వివరాలు చాలని నా ఫీలింగ్..".
నా ఫీలింగ్ కి మీరు respect ఇవ్వడం మాత్రమే కాదు..gift గా ఫోన్ ఇవ్వడం మర్చిపోవద్దు..
అస్తమానూ నాకే ఎందుకు రాస్తున్నావ్ అని అడగచ్చు మీరు...మీ దగ్గర ఉన్న రెండు శాఖలే వీటికి సమాధానం...
నేను చాలా మంచిదాన్ని కాబట్టి నాకో కార్ కొనివ్వండి అని అడగటం మానేసి..ఫోన్ మాత్రమే అడుగుతున్నా..గమనించండి..(అలాగని ఫోన్ ఇచ్చి రోడ్లు పూడ్చడం మానకండి..అస్తమానూ ఫోన్లు,కార్లు కొనివ్వడం కంటే రోడ్లు పూడ్చడమే బెటర్ కదా)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి