సభ్యత్వం ఇంతేనా ,అంటూ కాంగ్రెస్ నేతల అలసత్వం పై కాంగ్రెస్ రాష్ట్ర
వ్యవహారాల ఇన్ చార్జ్ రామచంద్ర కుంతియా పాపం చాలా ఆవేదన వ్యక్తం
చేస్తున్నారు...
ఏదో కనీసం లో కనీసం ఓ పాతిక లక్షలమందేనా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకుంటుందని ఓవర్ ఎక్పెక్టేషన్స్ లోఉన్నారు మన మాష్టారు...
తెలంగాణా ఇచ్చింది కాంగ్రెస్ కదా అలాంటప్పుడు ఎందుకు జాయిన్ అవరూ అనేది ఈయనగారి డౌట్..
గురువుగారూ ఇంకా ఎన్నిరోజులీపాట పాడతారు..ఆ..కొత్తవి ట్రై చెయ్యచ్చుగా..అస్తమానూ ఒకటే మాట్లాడకపోతే..
అంటే ప్రజల అభిప్రాయాలతో మీకు సంబంధం లేదా..మీ తృప్తి కోసం మీ జనం దొంగ సభ్యత్వాలు చూపించాలి, మీకు అప్పుడు హేపీనా .....అలా ఐతే మీకు బావుంటుందేమో...
సభ్యత్వం కంటే మీ విధానాలేంటో ప్రజలముందు పెట్టండి..తెలంగాణా ఇచ్చి చేతులు దులుపుకోలేదు అనే నమ్మకం కలిగించండి...
లక్ష్యం ఏంటో చెప్పడం లో పెద్ద గొప్పేముంది సార్...మార్గం చూపించండి..అది గొప్ప..
ఇవాళ మీరేం చేసారో గుర్తుపెట్టుకున్న ప్రజలు..చరిత్రని మర్చిపోరుగా..
పైగా నమోదు మీద నిర్లక్ష్యం చూపించేవాళ్ళ మీద చర్యలు
తీసుకుంటార్ట...జోకులేస్తున్నారా మాష్టారూ..మీరు చర్యలు తిసుకునేదాకా wait
చేయ్యడానికి వాళ్ళు టికెట్ తీసుకుని రైల్ ఎక్కిన పాసెంజర్స్ కాదు..
వాళ్ళు కూడా నాయకులు...వెంటనే అధికారపార్టీలోకి జంప్ చేసేస్తారు....రూల్ చెయ్యకండి...వెయిట్ చెయ్యడం తప్ప వేరేదారిలేదు మీకు
All the Best కుంతియా
Ya its nice, if a politician comes with good plans and activity list which will be useful for the society then no need to ask for enrollment/registration they will automatically come to them.
రిప్లయితొలగించండిyou are right Mr. Sunil Samanta
రిప్లయితొలగించండి