ఇందాకా బయటనించుని,మా అబ్బాయిని ఆడిస్తుంటే..ఒకతను బైక్ పై వచ్చి 'రెంట్'
కేవన్నా ఇల్లుందా అని అడిగాడు బాగా ఖాళీగా ఉన్నానని.. ఇలా start చేసా...
ఇప్పుడు మీరు ఆగ్నేయం వేపునుండి వచ్చారు కదా..ఒకసారి ఈశాన్యం వేపు
వెళ్ళి...లెఫ్ట్ కి తిరగండి.ఉత్తరం రోడ్ లో రెండు లేడీస్ హాస్టల్స్
కనిపిస్తాయి....ఈలోపల అతను అక్కడ నాకేం పనండీ అన్నాడు..
ఊరుకోవయ్యా
చెప్పేది పూర్తిగా విను..అక్కడేమో కొంతమంది అమ్మాయలు నిలబడీ, అబ్బాయిలేమో
బైక్ మీద కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు..వాళ్ళని పట్టించుకోకుండా...కుడి
పక్కకు తిరిగి తూర్పు కు వెళ్తే...అర్ధమయ్యిందా తూర్పు కి వెళ్తే ఒక చిన్న
సందు వస్తుంది...అక్కడ దక్షిణం లో ఉన్న ఇంట్లో ఆవిడని...
ఆవిడతో నాకేం పనండీ బాబూ..మళ్ళీ అతను
ఉండవయా స్వామీ..పొరపాటున కూడా ఆవిడని కదపకు..అసలే పెద్ద కంచు..(.మీకన్నానా
నెమ్మదిగానే అన్నాడు )కానీ నేను మాత్రం వినపడనట్టు..మళ్ళీ స్టార్ట్
చేసా...ఆ 'కంచు' ఇంటి ఎదురుగుండా పడమర ముఖద్వారం తో ఒక ఇల్లు ఉంది అందులో
అడిగితే..
ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్.బి నగర్ లో లోపలికి
ఉన్న ఇల్లు అది సంవత్సరం నుండి ఖాళీగా ఉందిలెండి..దాని వివరాలు చెప్తారు
అన్నా..
పాపం చాలా expectations తో వచ్చాడుకదా అని, ఇంత
వివరంగాచెప్పా....ఈలోపల మా ఇంటి బాల్కనీవేపు చూసి..ఓసారి పట్టిన చెమటని
కర్చీఫ్ తో తుడుచుకుని...మేడం ఆ బాల్కనీ లో సిగరెట్ కాలుస్తున్న ఆయన ఎవరూ
అని అడిగాడు... మా అయన అన్నాను...మేడం ఆయనకి నా ప్రగాఢ సానుభూతి
తెలియచెయ్యండి ప్లీజ్ అనేసి వెనక్కి చూడకుండా వెళ్ళిపోయాడు.....
........బాగా తెలివైనవాడు కదా.....
nice ..ha ha ha
రిప్లయితొలగించండి